ETV Bharat / priya

Palak Poori: ఆరోగ్యకరమైన గ్రీన్​ పూరి.. సింపుల్​గా తయారీ - వాల్​నట్​ ఆయిల్​తో పాలక్​పూరీ

'ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పాలకూరతో ఎప్పుడూ కూరలే చేస్తే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు కాస్త భిన్నంగా ట్రై చేయాలి కదా' అని భావించే వారు గ్రీన్​ పూరిని (Palak Poori) ట్రై చేయవచ్చు. అందులోనూ వాల్​నట్​ ఆయిల్​తో చేసిన పూరీలు. మరి వీటి తయారీ విధానం ఎలానో ఓ సారి తెలుసుకుందాం.

Palak Poori, green puri
గ్రీన్​ పూరీ
author img

By

Published : Sep 24, 2021, 7:11 AM IST

పూరి.. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓ వంటకం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాస్త భిన్నంగా ఆరోగ్యకరమైన వాల్​నట్ ఆయిల్​తో గ్రీన్​ పూరి (Palak Poori) చేసేయండి. వాల్​నట్​ ఆయిల్​తో పాటు పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి దీని తయారీ తెలుసుకుందామా..

గ్రీన్​ పూరీ తయారీ విధానం..

ముందుగా మిక్సింగ్​ బౌల్​ తీసుకొని అందులో పూరి పిండి, క్యారెట్​ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శెనగపప్పు, పాలకూర పేస్ట్​, పెరుగు, ఉప్పు వేసుకోవాలి. పిండిలాగా కలిపి.. పూరీలుగా చేసుకోవాలి. తరువాత స్టౌవ్​ వెలిగించి.. ప్యాన్​ పెట్టుకుని, అందులో ఆయిల్​ వేసుకొని ముందుగా తయారు చేసిన పూరీలను అందులో ఫ్రై చేసుకొని సర్వ్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్​ పూరీ రెడీ అవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గ్రీన్ పూరికి కావాల్సిన పదార్థాలు...

  • పూరి పిండి
  • పాలకూర పేస్ట్​
  • పచ్చిమిర్చి ముక్కలు
  • వాల్​నట్​ ఆయిల్​
  • ఉప్పు
  • పెరుగు
  • నానబెట్టిన శెనగపప్పు
  • క్యారెట్​ తురుము

ఇదీ చూడండి: బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.