ETV Bharat / priya

చల్లని సాయంత్రానికి నోరూరించే నెత్తళ్ల పకోడీ! - చేపల పకోడి

చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే బెస్ట్​ ఛాయిస్​ పకోడినే. ఎప్పటిలా కాకుండా కొత్తగా ట్రై చేయాలనుందా? అయితే.. చిన్నచిన్న చేపలతో(నెత్తెళ్ల) నోరూరించే పకోడి చేసుకోండిలా..

netalla pakodi
నెత్తళ్ల పకోడి
author img

By

Published : Sep 26, 2021, 4:31 PM IST

ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే చిన్న చేపలతో(నెత్తళ్లు) ఎప్పుడూ పులుసు, ఫ్రై కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అలానే ఎప్పుడూ తినే పకోడీలతో బోర్​ కొడుతుందా? అయితే ఈసారి నెత్తళ్లతో నోరూరించే పకోడీ ట్రై చేయండి. అదెలా అంటారా? ఇదిగో చూసేయండి.

తయారీ విధానం.

ముందుగా స్టవ్​ ఆన్​ చేసి బాండీ పెట్టుకోవాలి. దానిలో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. మరోవైపు మిక్సింగ్​ బౌల్​ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన నెత్తళ్లను తీసుకోవాలి. సరిపడినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్​, కారం, గరంమసాలా జోడించి.. కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో బియ్యం పిండి, శనగపిండి వేసి నెత్తెళ్లకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న నెత్తళ్లను బాగా మరుగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. బాగా వేగిన నెత్తళ్లు తీసేముందుగా కరివేపాకు, మిర్చి వేసి పూర్తిగా వేగిన తరువాత సర్వింగ్​ ప్లేట్​లోకి తీసుకుని, నిమ్మకాయతో గార్నిష్​ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పెట్టి సర్వ్​ చేసుకోవడమే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు...

  • పసుపు, ఉప్పు కలిపిన నెత్తళ్లు
  • శనగపిండి
  • బియ్యం పిండి
  • ఉప్పు
  • కారం
  • పుసుపు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి ముక్కలు
  • గరం మసాలా
  • నూనె

ఇదీ చూడండి: నాన్​వెజ్​ స్పెషల్​.. మిక్స్​డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.