మనం చికెన్‌తో ఎక్కువగా కర్రీ(chicken curry), ఫ్రై లాంటి రెసిపీస్ చేసేటప్పుడు(Chicken Recipes) దానిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పదార్థాలు సిద్ధం చేస్తుంటాం. అయితే వాటికి భిన్నంగా చికెన్ బాడీ మొత్తాన్ని ఒకేసారిగా చాలాతక్కువసార్లు ఫ్రై చేస్తుంటాం. అలాంటి రెసిపీయే ఈ మసాలా చికెన్ రోస్ట్.
కావాలిసిన పదార్థాలు
హోల్ చికెన్, ఆవాల నూనె అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, యాలకుల పొడి, ఉప్పు, నిమ్మరసం
తయారీ విధానం
ముందుగా ఓ ప్లేట్లో ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసులు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, యాలకుల పొడి, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
మరోవైపు హోల్ చికెన్‌ను తీసుకుని ఫోర్క్‌తో అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని చికెన్‌కు బాగా పట్టించాలి. దీనిని మైక్రో వేవ్ ఓవెన్లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 35 నిమిషాల పాటు రోస్ట్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన మసాలా చికెన్ రోస్ట్(masala chicken roast) రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: