అధిక పోషకాలనిచ్చే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇలాంటి కూరగాయతో ఎప్పుడూ చేస్కునే వంటకాలే కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే.. బెండకాయతో తొక్కు పచ్చడి చేసుకోండిలా..
కావల్సినవి:
- బెండకాయలు-పావుకేజీ
- పచ్చిమిర్చి -ఐదు లేక ఆరు
- చింతకాయలు-నాలుగైదు
- ఉప్పు-తగినంత
- వెల్లుల్లి-ఐదు లేక ఆరు
- జీలకర్ర-ఒకటిన్నర చెంచా
- కొత్తిమీర-సగంకట్ట
- నూనె-రెండు చెంచాలు
తయారీ విధానం:
బెండకాయలు, పచ్చిమిర్చిని నూనెలో మగ్గించాలి. ఆ తరవాత మరీ మెత్తగా కాకుండా దంచి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి, జీలకర్రను కూడా అదేవిధంగా పలుకుల్లా నూరి పెట్టుకోవాలి. చింతకాయల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఓ పాత్రలోకి తీసుకుని, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపితే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తురుము అలంకరించాలి. ఇది తొక్కు పచ్చడి కాబట్టి మెత్తగా దంచకూడదు.
ఇదీ చదవండి: నోరూరించే 'మసాలా చేప కూర'- చేసుకోండి ఇలా..