ETV Bharat / priya

నూడుల్స్‌ పొడిపొడిగా రావాలంటే! - నూడుల్స్ గుడ్లు పుట్టగొడుగుల రెసిపీ తెలుగు

నూడుల్స్‌ చేసిన ప్రతిసారీ ముద్దలా కలిసిపోతున్నాయని చాలామంది అంటుంటారు. అలా కాకుండా రెస్టారెంట్‌లో మాదిరిగా పొడిపొడిగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..?

noodles
నూడుల్స్‌
author img

By

Published : Jul 29, 2021, 11:30 PM IST

రెస్టారెంట్‌ స్టైల్‌ నూడుల్స్‌ ఇంట్లో చేసుకోవాలంటే నాణ్యమైన నూడుల్స్‌ను కొనుగోలు చేయాలి. నూడుల్స్‌ రుచి మొత్తం వాటిని ఎలా ఉడికించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీటిని మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తాం. అయితే ప్యాకెట్‌ వెనుక ఇచ్చిన సమయం కంటే అర నిమిషం తక్కువగా ఉడికించాలి. వీటిని ఉడికించే నీళ్లలో కాస్తంత ఉప్పు, చెంచా వెనిగర్‌ కలపాలి. ఇలా చేస్తే రుచితోపాటు నూడుల్స్‌ మల్లెపువ్వులా తెల్లగా ఉంటాయి. అలాగే ఉడికేటప్పుడు ఒకట్రెండు చెంచాల నూనె వేస్తే ఒకదానికొకటి అతుక్కోవు.

నూడుల్స్‌ సరిగ్గా ఉడికించకపోతే లోపలి భాగమంతా పిండిపిండిగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా మారి ఫ్రై చేసేటప్పుడు ముద్దలా అయిపోతాయి. దాదాపు 90 శాతం ఉడకగానే వెంటనే దించేసి చల్లటి నీళ్లను ధారగా పోయాలి. ఇలా చేస్తే నూడుల్స్‌ విడివిడిగా ఉండి రెస్టారెంట్‌ స్టైల్‌లో వస్తాయి. చల్లార్చకుండా నీళ్లు మాత్రమే పారబోసి గిన్నెలో ఉంచితే మరింత మెత్తగా అవుతాయి. కాబట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చిల్లుల గిన్నెలో ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు రెండు మూడు చెంచాల నూనె కలపాలి. దాంతో నూడుల్స్‌ గట్టిపడకుండా, అతుక్కోకుండా ఉంటాయి.

నూడుల్స్‌ను ఒకట్రెండు గంటల ముందే ఉడికించుకుని నూనె కలిపి ట్రేలో పలుచగా పరుచుకోవాలి. వెజ్‌ నూడుల్స్‌లో వాడే కూరగాయల ముక్కలను సన్నగా, పొడవుగా తరగాలి. అలాగే తాజా కూరగాయల్ని ఎంచుకోవాలి. తాజా మిరియాల పొడిని వేస్తే రుచి పెరుగుతుంది. నూడుల్స్‌ను ఎప్పుడూ పెద్ద మంటపై ప్రత్యేకమైన కడాయిలో చేయాలి. ఈ కడాయికి అడుగు పలుచగా ఉండి వేడి నూడుల్స్‌కు నేరుగా, త్వరగా తగులుతుంది. నూడుల్స్‌ను గరిటెతో కలపొద్దు. నూడుల్స్‌లో గుడ్లు, పుట్టగొడుగులు, ఉడికించిన చికెన్‌తో కలిపి చేసుకోవచ్చు.

ఇవీ చదనండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.