కేక్ ఎప్పుడూ కట్ చేసుకునే తినాలా? అప్పుడప్పుడూ ఇలా కేక్ బాల్స్ చేసుకుంటే లడ్డూలా నోట్లో వేసుకోవచ్చు కదా.... ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి...
కావలసిన పదార్థాలు
సాదా కేకు పొడి: అరకిలో, మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్: 200 గ్రా., కకోవా పొడి: 50 గ్రా., డెసికేటెడ్ కొబ్బరి పొడి: పావుకిలో
తయారీ విధానం
ఓ గిన్నెలో ఫ్రూట్ జామ్ వేసి గరిటెతో బాగా కలుపుతూ క్రీమ్‌లా చేయాలి. కేకు పొడిని విడిగా ఓ గిన్నెలో వేసి అందులో కకోవా పొడి, వంద గ్రా. డెసికేటెడ్ కొబ్బరి వేసి కలపాలి. తరవాత జామ్ కూడా వేసి ముద్దలా అయ్యేలా కలపాలి. అవసరమైతే కాసిని పాలు కలపవచ్చు. ఇప్పుడు దీన్ని అరగంటసేపు నాననిచ్చి లడ్డూల్లా చుట్టి మిగిలిన కొబ్బరి పొడిలో దొర్లించి తీస్తే కేక్ బాల్స్ రెడీ.
ఇదీ చదవండి: 'హయగ్రీవ పాయసం' రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!