చల్లని వాతావరణంలో చాలా మందికి వేడి వేడిగా పకోడిలు తినాలనిపిస్తుంది. ఎప్పటిలా కాకుండా కొత్తగా ట్రై చేయాలనుందా? అయితే.. సొరకాయతో నోరూరించే పకోడి చేసుకోండిలా..
కావాల్సినవి:
- సొరకాయ తురుము- కప్పు
- సెనగపిండి- అరకప్పు
- బియ్యప్పిండి- రెండు టేబుల్‌స్పూన్లు
- ఉప్పు- తగినంత
- కారం- కొద్దిగా
- తరిగిన పచ్చిమిర్చి- రెండు
- అల్లం తురుము - టీస్పూన్
- పసుపు- చిటికెడు
- కొత్తిమీర తురుము- కొద్దిగా
- నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
గిన్నెలో సొరకాయ తురుము, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా, జారుగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడెక్కాక పకోడీలు వేసుకోవాలి.
ఇదీ చదవండి: ఆహా! అనిపించే 'తోటకూర చికెన్'