మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ.. ఇలా చెప్పుకుంటూపోతే దోశల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే వీటిలో 'ఉప్పు హుళి దోశ'కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఉడిపి హోటళ్లలో ఎక్కువగా లభించే ఈ దోశ కోసం జనం బారులు తీరుతారు. ఆ దోశ రుచి అలాంటిది. ఈ దోశకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దీనిని తయారు చేసుకునేందుకు పట్టే సమయం కూడా మిగతా దోశల తయారీతో పోలిస్తే చాలా తక్కువ. పిండి పులవపెట్టకపోయినా కూడా చింతపండు కలిపి ఈ దోశలను తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు : బియ్యం, మినపప్పు, చింతపండు, బెల్లం, కొబ్బరితురుము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నూనె, కారం, ఇంగువ, ఉప్పు
తయారు చేసే విధానం..
ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులు, చింతపండు నానపెట్టుకోవాలి. బియ్యం ఎంత నానపెడితే అందులో ఒక్కవంతు మినపప్పు నానపెట్టాలి. సాధారణంగా దోశలకైతే గంటల తరబడి నానపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ దోశల తయారీకి కేవలం గంట-గంటన్నర ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది.
నానపెట్టిన బియ్యంలో జీలకర్ర, కాస్తంత ఇంగువ, నానపెట్టిన మెంతులు, ఎండుమిరపకాయలు, నానపెట్టిన మినపప్పు, కొబ్బరితురుము వేయాలి. ఇందులో కాస్తంత రుచికి బెల్లంతో పాటు ఉప్పు కూడా కలపాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు నానపెట్టిన చింతపండు వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రుబ్బి దోశపిండిని తయారు చేసుకోవాలి. సిద్ధమైన పిండిని పెనంపై దోశలుగా వేసుకుని నూనెతో కాల్చి, కాస్తంత కారం వేసుకుంటే టెస్టీ ఉప్పు హుళి దోశలు రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : 'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం!