దక్షిణ భారత దేశంలో పుట్టి.. దేశ వ్యాప్తంగా ఉండే ప్రతి స్వీట్‌షాప్‌లో దర్శనం ఇచ్చే ఏకైక తినుబండారం మైసూర్‌పాక్ (Mysore Pak Recipe). చూడగానే నోటిలో నీళ్లు ఊరిస్తుంది. దీనిని నాలుకపై పెట్టుకోగానే ఆ రుచికి మ్మ్... అని ఆస్వాదిస్తూ తినని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి స్వీట్‌ను ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఓ సారి చూద్దాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
- నీళ్లు
- పంచదార
- నెయ్యి
- శెనగపిండి
- యాలకలపొడి
- పసుపు
తయారీ విధానం..
ముందుగా ఒక బాండల్లో కొద్దిగా నీటిని తీసుకోవాలి. దానిలో పంచదార కలపాలి. దీనిని ఒక కప్పు నీటికి రెండు కప్పుల పంచదార అన్నట్లుగా తీసుకోవాలి. లేతపాకం వచ్చే వరకు వేడి చేయాలి. ఆ తరువాత మరో పాత్రలో సరిపడినంత నెయ్యి తీసుకోవాలి. దానిని వేడి చేయాలి. అందులో మనకు కావాల్సిన పరిణామంలో శెనగపిండిని తీసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా ముద్దగా ఏర్పడిన దానిని ముందుగా వేడి చేసుకున్న పాకంలో కలుపుకోవాలి. దానిలో నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ..దగ్గరగా వచ్చే వరకు కలపాలి. దానిలోనే పసుపు, యాలకల పొడి వేయాలి. దానిని మంచిగా పైకి, కిందకు కలపాలి. అలా కొంచెం గట్టిపడిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దానిపై పంచదారా చల్లి.. గోరు వెచ్చగా ఉండగానే మనకు సరిపడినంత సైజ్‌లో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే మైసూర్‌పాక్ రెడీ.
ఇదీ చూడండి: చవితి నైవేద్యాలు: గణనాథునికి ఇష్టమైన పూర్ణం బూరెలు!