క్రీడలు ఎక్కువగా ఆడేవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగిన స్థాయిలో ప్రొటీన్లు శరీరానికి అందకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ప్రొటీన్ల విషయంలో క్రీడాకారులు చాలా జాగ్రత్త వహించాలి. సరైన మోతాదులో ప్రోటీన్లు అందాలి అంటే సులభమైన పద్దతిలో ప్రోటీన్ చాట్ (Protein Chaat) తయారు చేసుకోవడం. అయితే ఇది ఎలా చేయాలో ఓ సారి చూద్దాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రోటీన్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఉడికించిన పల్లీలు
- టమాటా ముక్కలు
- కీర దోస
- అల్లం
- పచ్చిమిర్చి
- డ్రై మ్యాంగో పౌడర్(ఆమ్చూర్ పొడి)
- నిమ్మకాయ రసం
- జీలకర్ర పొడి
- మిరియాలు పొడి
- పంచదార
- ఉప్పు
- కారం
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన పల్లీలు, పచ్చిమిర్చి, టమాట, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, ఉప్పు, పంచదార, అల్లం, నిమ్మకాయ, కీరదోస వేసి పైకి, కిందకు బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే స్పోర్ట్స్‌కు సంబంధించిన వారికి ఉపయోగపడే ప్రోటీన్ చాట్ రెడీ.
ఇదీ చూడండి: చల్లచల్లని వాతావరణానికి నోరూరించే చాట్!