ETV Bharat / priya

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. ఇంకాస్త కొత్తగా మరింత రుచిగా! - ఆహారం

ఎదురుగా ప్లేటులో ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఉన్నాయంటే చాలు.. ఎన్ని తింటున్నామో కూడా పట్టించుకోకుండా ఒకదాని తరువాత ఒకటిగా వరసబెట్టి అన్నీ లాగించేస్తారు పిల్లలూ కుర్రకారూ. కాస్త క్రంచీగా, కాస్త మెత్తగా ఉండే ఆ ఫ్రైస్‌ని ఎందుకు అంత ఇష్టంగా తింటారనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే ఇప్పుడవి రకరకాల ఆకారాల్లో వచ్చేస్తూ మరింత నోరూరిస్తున్నాయి.

french fries
ఫ్రెంచ్ ఫ్రైస్​
author img

By

Published : Aug 1, 2021, 12:00 PM IST

బంగాళాదుంపను ఇష్టపడేవారిలో పిల్లల నుంచి పెద్దలవరకూ అందరూ ఉంటారు. అందుకే పప్పూ, సాంబారూ, చారూ లాంటివి చేసుకున్నప్పుడు ఆలూ వేపుడు ఉండాలని కోరుకుంటే... బయటకు వెళ్లినప్పుడు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని తప్పక ఆర్డర్‌చేస్తారు. ఫింగర్‌ఫ్రైస్‌, హాట్‌చిప్స్‌ అంటూ రకరకాల పేర్లతో పిలిచినా వాటి ఆకృతి మాత్రం దాదాపు ఒకేలా చేతివేళ్లంత సైజులో సన్నగా, పొడుగ్గా ఉంటాయి. ఎంత ఇష్టమైనా, అవి ఎప్పుడూ ఒకేలా ఎందుకుండాలీ అనుకున్నారో ఏమో తయారీదారులు... ఇప్పుడు వాటిని రకరకాల ఆకారాల్లో తయారుచేస్తూ ఫ్రెంచ్‌ఫ్రైస్‌కి కొత్త అర్థాన్ని చెబుతున్నారు. దాంతో అవి బాగా పొడుగ్గా, గుండ్రంగా, జంతికల్లా మెలితిరిగినట్లుగా... ఎన్నో ఆకారాల్లో వచ్చేస్తూ మరింత నోరూరిస్తున్నాయి.

french fries
లాంగ్​ ఫ్రెంచ్ ఫ్రైస్​

చేసే పద్ధతే వేరు

french fries
రౌండ్​ ఫ్రెంచ్​ ఫ్రైస్​

ఒకప్పుడు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను కేవలం బర్గర్‌తో కలిపి మాత్రమే సర్వ్‌ చేసేవారు. వాటిని స్నాక్స్‌గా తినడం మొదలుపెట్టాక రకరకాల సాస్‌లూ, మసాలాలూ వేసి మరీ వడ్డించేవారు. కానీ ఇప్పుడు వాటి రుచితోపాటూ ఆకారం కూడా మారుతుండటంతో ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను ఇలా కూడా చేస్తున్నారా... అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆలూప్రియులు. ఉదాహరణకు మరీ పొడుగ్గా ఉండే జపనీస్‌ లాంగ్‌ ఫ్రైస్‌నే తీసుకుంటే.. ముందుగా బంగాళాదుంపను ఉడికించి మెత్తగా మెదిపి, అందులో కొద్దిగా మొక్కజొన్నపిండీ, బ్రెడ్‌పొడీ, బేకింగ్‌పౌడర్‌, ఉప్పూ, కారం వంటివి కలుపుతారు. ఆ పిండిని చేత్తోకానీ జంతికల గొట్టం వంటి దాన్లో కానీ వత్తి వీలైనంత పొడుగ్గా చేసి నూనెలో వేయిస్తారు. తరువాత వీటిపైన వేసే సాస్‌లు మామూలే. ఇళ్లల్లో అయితే వాటిని ఏ ఆకారంలో చేసుకున్నా చెల్లుతుంది కానీ ఫుడ్‌కోర్టులూ, బేకరీలూ, హోటళ్లల్లో అలా కుదరదు గనుక వీటి తయారీకి పెద్ద రంధ్రాలతో, రకరకాల డిజైన్లలో ఉన్న జంతికల గొట్టాలను ఎంచుకుంటారు. వాటితో ఈ ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని కోరిన ఆకారాల్లో చేసుకోవచ్చన్నమాట. ఏమైనా, కొత్త రూపంలో సరికొత్త రుచిలో ఊరిస్తున్న ఈ ఫ్రైస్‌ని తినకుండా నోరుకట్టేసుకుని కూర్చోవడం కష్టం కాబట్టి పిల్లలతో పాటు మనమూ కాసిని లాగించేస్తే సరి. ఏమంటారూ!

french fries
వివిధ ఆకారాల్లో ఫ్రెంచ్​ ఫ్రైస్

ఇవీ చదవండి:VITAMIN-D: సరైన మోతాదులో శరీరానికి అందుతుందా?

బరువు తగ్గాలా.. రోజుకు ఇన్ని ఖర్జూరాలు తినండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.