దీనికోసం ఆరోగ్యంగా ఉన్న వంద మందిని ఎంపిక చేసి మరీ పరిశీలించి చూశారట. మిగిలిన వాళ్లతో పోలిస్తే సుక్రోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్నవాళ్లలో జీవక్రియా వేగం తగ్గడంతో పాటు కాలేయంలో కొవ్వు కణాల శాతం ఎక్కువైనట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆధారంగా- రోజుకి 80 గ్రా. చక్కెర లేదా 0.8 లీటర్ల శీతల పానీయం తీసుకుంటే కాలేయంలో కొవ్వు కణాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందనీ అదలానే కొనసాగితే దీర్ఘకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తుందనీ వివరిస్తున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి చక్కెర పదార్థాలతో జాగ్రత్త.
ఇదీ చదవండి: హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించనున్నకేటీఆర్