బంగాళాదుంప తింటే లావవుతామనుకుంటారు చాలా మంది. కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషక విలువలు (Potato Health Benefits) శరీరానికి మంచి చేస్తాయని చెప్తున్నారు. అయితే దీనిని తీసుకునే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది. అది ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు.
బంగాళాదుంపలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్‌లోనూ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాలిబుల్ ఫైబర్, రెండు ఇన్సాలిబుల్ ఫైబర్. ఇది ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం వ్యాధి ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు. చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. దుంపకూరలను మధుమేహం ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడదని... నిజానికి అలాంటి ఏం లేదు. బంగాళాదుంపను భేషుగ్గా తీసుకోవచ్చు.
బంగాళాదుంపను ఇతర కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. దీనిని వండేటప్పుడు పైన ఉన్న పొట్టు తీయకుండా చేయడం చాలామంచి పద్ధతి. ఈ పొట్టులోనే మనకు కావాల్సిన పీచుపదార్థం బాగా ఉంటుంది. బంగాళాదుంపలో స్టార్చ్ కంటెంట్ (పిండిపదార్థాలు) కూడా ఎక్కువగా ఉంటాయి. సుమారు 70 శాతం మేర పిండిపదార్థాలు ఉంటాయి. నేచురల్‌గా దొరికే పిండిపదార్థం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మనిషికి కావాల్సి పొటాషియం కూడా బంగాళాదుంపల్లో తగిన మోతాదులో ఉంటుంది. ఇదీ బీపీ ఎక్కువగా ఉన్న వారికి.. తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బరువు తగ్గాలంటే.. తాగే నీటిలో ఇవి కలపాల్సిందే!