వేసవి కాలం వచ్చిందంటే పండ్లలో 'రారాజు' మామిడి పండు హవా మొదలవుతుంది. మామిడి పండును ఎప్పుడెప్పుడు ఆరగిస్తామా? అని ఎదురుచూస్తూ ఉంటారు. భానుడి భగభగల నుంచి విముక్తి పొందేందుకు చల్లటి మామిడి పండు రసం తాగాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ 'మ్యాంగో మస్తాని'. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా...
కావాల్సినవి..
- 100 గ్రాముల మ్యాంగో పల్ప్
- 100 గ్రాములు చక్కెర
- 200 మిల్లీలీటర్ల పాలు
- మ్యాంగో ఐస్‌క్రీమ్- రెండు స్కూప్స్
- యాలకుల పొడి- చిటికెడు
- బాదాం ఫ్లేక్స్
ఇలా చేసేయండి...
మ్యాంగో పల్ప్, చక్కెర, పాలను బాగా మిక్సీ పట్టాలి. అది మ్యాంగో మిల్క్ షేక్‌గా మారుతుంది. దానిని 20 నిమిషాల పాటు డీప్-ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత మళ్లీ మిక్సీ పట్టండి. అది మందంగా మారుతుంది.
దానిని ఓ గ్లాసులోకి తీసుకుని ఐస్‌క్రీమ్ స్కూప్స్ వేయాలి. రుచికి తగ్గట్టు యాలకుల పొడి వేసుకోవాలి. బాదాం ఫ్లేక్స్ గార్నీషింగ్ కోసం ఉపయోగపడుతుంది.
అంతే.. మండుటెండల్లో.. చల్లచల్లని మ్యాంగో మస్తానీ రెడీ.
ఇదీ చూడండి:- ఏ అరటి పండు ఎప్పుడు తినాలో తెలుసా?