సన్డే అంటే ఫన్డే. వారానికి దొరికే ఈ ఒక్కరోజును మనసుకు నచ్చినట్లు ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఉంటుంది. మంచి రుచిగా ఉండే వంటలతో సంతృప్తిగా తినాలని కోరుకుంటారు. మరి ఈ ఆదివారం చికెన్‌తో స్నాక్స్ వంటకం అయిన డ్రాగన్ చికెన్ (Dragon Chicken Recipe) చేసేసుకోండి.
డ్రాగన్ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు....
- చికెన్
- కోడి గుడ్డు
- మైదా
- కార్న్‌ప్లోర్
- చిల్లీపేస్ట్
- అల్లం, వెల్లుల్లి పేస్ట్
- మిరియాల పొడి
- సోయాసాస్
- జీడిపప్పు
- ఎండుమిర్చి
- క్యాప్సికం ముక్కలు
- ఉల్లిపాయ ముక్కలు
- ఉప్పు సరిపడా
- స్ర్పింగ్ ఆనియన్స్
- టమాటో కెచప్
డ్రాగన్ చికెన్ తయారీ విధానం...
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒక బౌల్లో చికెన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్, సోయాసాస్, మిరియాలపొడి, కోడి గుడ్డు వేసి కలిపి.. మైదా పిండి, కార్న్ప్లోర్ను వేసి ముద్దగా కలపాలి. వేడి నూనెలో వేసి పక్కన పెట్టాలి. తరువాత వేరే బాండల్లో నూనె వేసి అది వేడి అయిన తరువాత.. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడి పప్పు, క్యాప్సికం ముక్కలు, సోయాసాస్, చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, ఎండు మిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఫ్రై చేసుకున్న చికెన్‌ను అందులో వేసి కలిపి... స్ర్పింగ్ ఆనియన్స్ ముక్కలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డ్రాగన్ చికెన్ రెడీ.
ఇదీ చూడండి: ఆంధ్రా స్పెషల్.. 'ఉలవచారు కోడి కూర'