ETV Bharat / priya

కాస్త షాంపూ + కాస్త కలబంద = కేశ సంపద! - hair fall tips in telugu

షాంపూలో కాస్త కలబంద కలిపి తలస్నానం చేస్తే... చుండ్రుకు చెక్ పెట్టి కురులను మృదువుగా చేసుకోవచ్చు. అంతేనా షాంపూలో కొన్ని ఆయుర్వేద పదార్థాలను కలిపితే జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు మరి ఆవేంటో చూసేద్దాం రండి...

dandruf reduction with home remedies for hair growth
కాస్త షాంపూ + కాస్త కలబంద = కేశ సంపద!
author img

By

Published : Oct 1, 2020, 10:31 AM IST

తలస్నానం చేసేందుకు షాంపూ వాడతాం కదా.. ఈసారి అందులో ఈ పదార్థాలను కలిపి చూడండి. తలకు సంబంధించిన కొన్ని సమస్యల్ని చాలా సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు.

  • తల దురదగా ఉందా.. మీ షాంపూలో చిన్న మూత రోజ్‌వాటర్‌ని కలిపి వాడుకుని చూడండి. మార్పు కనిపిస్తుంది.
  • మీరు వాడే షాంపూలో కాస్త నిమ్మరసం వేస్తే గనుక నిర్జీవంగా ఉన్న జుట్టు నిగనిగలాడుతుంది.
  • జుట్టుకు తేమ అంది.. ఆరోగ్యంగా కనిపించాలంటే షాంపూలో కొద్దిగా తేనె కలపాలి.
  • విపరీతంగా జుట్టు రాలుతోందా. కొన్ని చుక్కలు ఏదయినా అరోమా నూనెను మీ షాంపూలో కలిపి చూడండి. ఆ సమస్య అదుపులోకి రావడంతోపాటూ.. జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.
  • కలబందను షాంపూతో కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
  • ఉసిరి రసం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

ఇదీ చదవండి: బరువు పెరగాలా? ఈ నిజాలు తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.