సాయంత్రం వేళల్లో నలుగురు కలిసినప్పుడు అలా కార్న్‌ఫ్లేక్స్‌ను (corn flakes snacks recipe) ముందేసుకుని స్నాక్స్‌గా తింటే బాగుంటుంది కదా!. అయితే.. చాలమందికి కార్న్‌ఫ్లేక్స్ అనగానే హోటలే గుర్తొస్తుంది. వాటిని మన ఇంట్లో ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు:
నూనె, కార్న్‌ఫ్లేక్స్, నైలాన్ సాబుదానలు, పల్లీలు, అటుకులు, కిస్మిస్, జీడిపప్పు, కరివేపాకు, ధనియాల పొడి, కారం, చాట్‌మసాల, చక్కెర, సిట్రిక్ యాసిడ్, ఉప్పు.
తయారీ విధానం:
ముందుగా ఒక బాండీలో నూనె బాగా వేడెక్కిన తర్వాత కార్న్‌ఫ్లేక్స్(corn flakes snacks mix) ఫ్రైచేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే నైలాన్ సాబుదానలను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, అటుకులు, కిస్మిస్, జీడిపప్పు, కరివేపాకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఇవన్నీ వేసుకుని పైనుంచి ధనియాల పొడి, కారం, చాట్‌మసాల, చక్కెర, సిట్రిక్ యాసిడ్, ఉప్పు వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే కార్న్‌ఫ్లేక్స్ చుడవా తయారవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:పాలకూర జొన్న పొంగనాలు తయారు చేయండిలా!