గడ్డి ప్రకృతిలో విరివిగా లభిస్తుంది. జంతువులు దానిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ గడ్డితో మనం కూడా ఆహారపదార్థాన్ని తయారుచేయవచ్చు. గడ్డి పూలతో కారంపొడిని ఎలా తయారు చేయాలో ఓ సారి చూద్దాం..
కావాల్సినవి: గడ్డినువ్వులు (వెర్రినువ్వులు) - 100 గ్రా., ఎండుమిర్చి- 50గ్రా., మెంతులు, జీలకర్ర- స్పూన్ చొప్పున, కరివేపాకు- రెండు రెబ్బలు, పసుపు- పావుటీస్పూన్, ఉప్పు-తగినంత, ఇంగువ- చిటికెడు.
తయారీ: గడ్డి నువ్వులను నీళ్లతో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వీటిలో ఇసుక ఉంటుంది. బాగా ఆరిన తర్వాత కడాయిలో వేసి చిటపటలాడేంత వరకు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, మెంతుల, జీలకర్ర, కరివేపాకు వేయించాలి. దీంట్లో ఉప్పు, పసుపు, ఇంగు వేసి అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గడ్డినువ్వుల కారంపొడి రెడీ. ఇది అన్నం, ఇడ్లీ, దోసెల్లోకి చాలా బాగుంటుంది. ఇష్టమైతే వెల్లుల్లిరేకలు కూడా వేసుకోవచ్చు.
ఇదీ చదవండి:Paneer recipes: పసందైన పనీర్ విందు!