కొత్తు పరోటా.. తమిళనాడులో విపరీతంగా డిమాండ్ ఉన్న స్ట్రీట్ ఫుడ్. అయితే దీనిని ఇప్పుడు మీ వంటింట్లోనూ తయారు చేసుకోవచ్చు. రొటీన్‌కు భిన్నంగా పరోటా రుచిని ఆస్వాదించాలనుకునే వారికోసమే ఈ రెసిపీ.
కావాల్సిన పదార్ధాలు:
ఉల్లిపాయలు (పెద్దవి రెండు), పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటోలు (నాలుగు), గరం మసాలా, ఉప్పు, కారం, కోడిగుడ్డు- ఒకటి, చికెన్ కర్రీ, నూనె, రెడీమేడ్ పరోటాలు- మూడు.
తయారీ విధానం:
ముందుగా ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి అది బాగా వేడెక్కే వరకు ఆగాలి. తర్వాత అందులో కొంచెం నూనె వేసి అప్పటికే సిద్ధంగా ఉన్న పరోటాలను రెండు వైపులా కాల్చాలి. అవి బాగా కాలాక వాటిని బయటికి తీసి అదే వేడి మీద చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఇప్పుడు అదే వేడి పెనంలో మళ్లీ కొంచెం నూనె తీసుకోవాలి. అది వేడెక్కాక అందులో అప్పటికే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి పైనుంచి కట్ చేసుకున్న పరోటా ముక్కలు వేసి దానిని బాగా కలిపి అది కొంచెం ఉడికే వరకు ఆగాలి. ఆ తర్వాత కోడిగుడ్డును ఒక గిన్నెలో తీసుకొని దానిని బాగా కలిపి పెనంలో ఉన్న మిశ్రమంపై వేయాలి. ఆ మొత్తాన్ని బాగా కలిపి కొద్దిసేపు కలిపి పెట్టుకోవాలి. అలాగే బీట్ చేసుకొన్న చికెన్ కర్రీని అందులో వేసుకొని బాగా కలపాలి. అలా కొంతసేపు ఉడికిన తర్వాత దానిని ఒక ప్లేటులోకి తీసుకుని దానిపై కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొత్తు పరోటా రెడీ. దీనిని కొంచెం చికెన్ కర్రీ గ్రేవీతో అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో నంజుకొని తింటే చాలా బాగుంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: ఈ ఆహార పదార్థాలు గడువు ముగిసినా వాడుకోవచ్చు!