ఎక్కువగా పండగల సమయంలో చేసుకునే చక్కెర పొంగళిని(Chakkara Pongal recipe).. మనకు వీలు దొరికినప్పుడు చేసుకుని ఆవురావురుమంటూ లాగించేయొచ్చు. ఇంతకీ దీనిని తయారీ ఎలా? ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దామా!
కావాల్సిన పదార్థాలు
నెయ్యి, బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర, పచ్చ కర్పూరం
తయారీ విధానం
ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో బియ్యం, పెసరపప్పు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒకటికి నాలుగు వంతుల నీళ్లు పోసుకుని 5,6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు, బెల్లం, సరిపడా నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఓసారి కలుపుకొని యాలకుల పొడి వేసుకోవాలి. అనంతరం జీడిపప్పు, కిస్మిస్తో నెయ్యి తాలింపును చక్కెర/బెల్లం పాకంలో వేసి, చివరగా పచ్చ కర్పూరం వేసి కలుపుకొంటే ఎంతో రుచికరమైన చక్కెర పొంగళి(Chakkara Pongal recipe) రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: