బీట్రూట్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనికి ఆంథోసైనల్ అనే దాని వల్ల ఎరుపు రంగు వస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అలాగే దీనిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న బీట్రూట్తో మిల్క్ షేక్(beetroot milkshake recipe) చేసుకుని రుచి చూసి ఆస్వాదించండి. ఆరోగ్యంగా ఉండండి.
కావాల్సిన పదార్థాలు
బీట్రూట్ ముక్కలు, పంచదార, బాదంపప్పు, పుదీనా, దాల్చినచెక్క పొడి, అల్లం రసం, పాలు
తయారీ విధానం
ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్‌లో బీట్రూట్ ముక్కలు, పంచదార, బాదంపప్పు, పుదీనా, దాల్చినచెక్క పొడి, అల్లం రసం, పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్, మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమం వేసి పైన బాదంపప్పు, పుదీనా, బీట్రూట్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ మిల్క్‌షేక్ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">