Women's Day Special at Ramoji Film City: మహిళా మహోత్సవాలకు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కానుంది. మార్చి 1 నుంచి 31 వరకు మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మగువల ఆనందానికి ప్రాధాన్యమిచ్చేలా నెల రోజుల పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనను, వినోదాలను ఆస్వాదించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఫౌంటెయిన్లు, స్టూడియోలు, బోన్సాయ్ గార్డెన్, పక్షుల, సీతాకోక చిలుకల పార్కులను చూపించనున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో జాలీగా గడిపేలా ఈ టూర్ ఉండనుంది . రామోజీ అడ్వెంచర్ వేదిక సాహస్‌లో నిర్వహించే అడ్వెంచర్లతో థ్రిల్ అవ్వొచ్చు. అంతే కాకుండా ఆరోజున ప్రత్యేకంగా నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొని గిఫ్టులు కూడా గెలుచుకోవచ్చు. మహిళల నెలగా మార్చి నెలను ప్రకటిస్తూ ఈ నెలంతా జాలీగా గడిపేలా రామోజీ ఫిలిం సిటీ ప్లాన్ చేసింది.
మహిళల కోసం ప్రత్యేక ఆఫర్: మహిళల కోసం ప్రత్యేక ఆఫర్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఒక ఎంట్రీ టికెట్ కొనుగోలు చేస్తే.. ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించనుంది. ఈ ఆఫర్ మహిళలకు మాత్రమే. టికెట్లను తప్పనిసరిగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు విచ్చేయాలనుకొనే మహిళామణులు మరిన్ని వివరాల కొరకు ఫోన్ నంబర్లు.. 93930 93930, 80086 07026, టోల్ ఫ్రీ నంబరు 1800 120 2999కు కాల్ చేయవచ్చు. లేదా అడ్వాన్స్ బుకింగ్ కోసం www.ramojifilmcity.comలో లాగిన్ చేయవచ్చు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 సందర్భంగా మహిళల కోసం థీమ్‌ను రూపొందించారు. ప్రతి సొసైటీ డీఎన్ఏలో లింగ సమానత్వం భాగం కావాలి. అనే థీమ్‌తో ఈ ఏడాది మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోనున్నారు.
ఇవీ చదవండి: