ETV Bharat / opinion

ఆ తప్పు మీరూ చేయొద్దు! - hyderabad news

పెళ్త్లెన ప్రతి అమ్మాయి ఎప్పుడెప్పుడు తల్లి అవుతానా అని కోటి ఆశలతో ఎదురుచూడటం సహజం. కానీ ఒక అమ్మాయి మాత్రం కొన్ని నిస్సహాయ పరిస్థితుల మధ్య మొదటిసారి గర్భం దాల్చినప్పుడు గర్భస్రావం చేయించుకుంది. ఇది జరిగి దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ బిడ్డకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా మనసును వెంటాడుతూనే ఉన్నాయంటోంది.. ఇంతకీ ఎవరామె?? ఏం జరిగింది.. ఎందుకు అలా చేసిందో తెలియాలంటే ఆమె హృదయరాగం వినాల్సిందే..

woman feeling sad about her aborted child
ఆ తప్పు మీరూ చేయొద్దు!
author img

By

Published : Apr 25, 2021, 5:22 PM IST

నా పేరు సత్య. మాది రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు. అమ్మానాన్నకి నేను, అన్నయ్య ఇద్దరం సంతానం. పుట్టింది అక్కడే అయినా నాన్న వ్యాపార రీత్యా మా చిన్నతనంలోనే విజయవాడకి మకాం మార్చేశాం. అలా మా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే రమణ నాకు పరిచయం అయ్యాడు. తనది కూడా మా క్లాసే. ప్రారంభంలో కొద్ది రోజులు ఫ్రెండ్స్ అందరి మాదిరిగానే మేమూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ గడిపేసినా ఆ తర్వాత ఎందుకో రమణ అంటే ఒక ప్రత్యేకమైన భావన కలిగేది. కానీ అప్పట్లో దానికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేదాన్ని కాదు..

పెళ్లి సంబంధం అన్నారు..

చూస్తుండగానే సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోయాయి.. డిగ్రీ పరీక్షలు పూర్త్తెపోయాయి. అప్పటివరకు కలిసే చదువుకోవడం వల్లేమో..ఇకముందు తనని చూడకుండా ఉండాలి.. తనతో మాట్లాడకుండా ఉండాలి.. అనే ఆలోచనే నా బుర్రకి తట్టలేదు. కానీ పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకెలా కలుస్తాం?? అదే మాట రమణని అడిగా. తను కూడా నన్ను ప్రేమిస్తున్నానని, తన మనసులో మాట చెప్పేశాడు. అయితే పెళ్లికి ఇది సరైన వయసు కాదు కాబట్టి అప్పటి వరకు వేచి ఉందామని, ఈలోపు ఇంకా బాగా చదువుకుని కెరీర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాం. దాంతో నా భవిష్యత్తు పైన నాకు ఒక స్పష్టత వచ్చింది. రమణ తన మాటలతో అందించిన ప్రేరణతో ఎంబీఏ పూర్తి చేశా. అంతా మనం అనుకున్నట్లే జరిగితే ఇది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి?? ఎంబీఏ పూర్తవ్వగానే మా అమ్మానాన్న మంచి సంబంధం అంటూ పెళ్లి చూపులు ఏర్పాటుచేశారు. దానిని తప్పించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆఖరికి అయిష్టంగానే పెళ్లిచూపుల్లో కూర్చోవాల్సి వచ్చింది. పిల్ల నచ్చిందని చెప్పి, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టి కబురు పంపుతాం అంటూ వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారు..

అందుకే ఇబ్బంది పెట్టలేదు

మా బంధువుల్లో ఒకాయనకి ఆ అబ్బాయి బాగా తెలుసట! అతడు మంచివాడు కాదని, జూదం, మద్యం.. వంటి అలవాట్లు ఉన్నాయని చెప్పడంతో అమ్మానాన్న ఆ సంబంధం వద్దని చెప్పేశారు. ఈసారికైతే గండం గడిచిపోయింది. మరొకసారి ఇలాగే జరిగితే.. అప్పుడు ఎవరు ఆపుతారు?? అందుకే అలాంటి సందర్భం రాకూడదనే ఉద్దేశంతోనే మా ప్రేమ విషయం అమ్మానాన్నలకి చెప్పా. ఇంకేముంది.. అమ్మ పొయ్యి మీద నిప్పు కణికలా మండితే, నాన్న అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. వారికి సర్దిచెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఒకసారి నాన్న నన్ను పిలిచి 'ఆ అబ్బాయిని మరిచిపోతానంటే నువ్వు ఉద్యోగం చేయడానికి నేను ఒప్పుకుంటా..' అన్నారు.. దానికి నేను కూడా 'నువ్వు మరో నాలుగేళ్ల పాటు నా పెళ్లి మాట ఎత్తనని నాకు మాటివ్వాలి..' అంటూ పరస్పరం మాట ఇచ్చిపుచ్చుకున్నాం. అయితే ఇంట్లో జరిగిన విషయాలన్నీ నేను ఎప్పటికప్పుడు మా కామన్ ఫ్రెండ్ ద్వారా రమణకి తెలియజేస్తూనే ఉన్నా. కానీ కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల తను చదువు మానేసి, పని చేయడం ప్రారంభించాడు. అది కూడా వేరే వూరిలో! దాంతో తనని ఇబ్బంది పెట్టడం దేనికని నేను కూడా మిన్నకుండిపోయేదాన్ని.

గుళ్లో పెళ్లి

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో అదనపు కోర్సులు చేయాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని భాగ్యనగరం చేరుకున్నా. ఇందుకు మా నాన్న ఒప్పుకున్నా అమ్మ మాత్రం అంతగా అంగీకరించలేదు. నేను హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసి రమణ కూడా పని కోసం ఇక్కడికే వచ్చేశాడు. అప్పుడప్పుడూ ఇద్దరం బయట కలుసుకోవడం, కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం.. ఇదే మా పని. నేను కోర్సులు చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే నాన్న మరోసారి సంబంధం అంటూ ఇంటికి రమ్మన్నారు. మా ప్రేమ విషయం గురించి మళ్లీ చెప్పా. ఈసారి కూడా అదే తిరస్కారం. చేసేది లేక వాళ్లని ఎదురించి మర్నాడే మేమిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం. ఒక చిన్న రూంలోనే ఇద్దరం కలిసి ఉండేవాళ్లం. వండుకోవడానికి సరిపడా రెండు, మూడు గిన్నెలు, వేసుకోవడానికి మా దగ్గర ఉన్న బట్టలు తప్పితే మా వద్ద ఇంక ఎలాంటి వస్తువులు, సౌకర్యాలు లేవు. అలా మా జీవితాన్ని పూర్తిగా సున్నా నుంచి మొదలుపెట్టాం.

అప్పుడే వద్దనుకున్నాం..

పెళ్త్లెన మూడు నెలల తర్వాత నాకు చిన్న ఉద్యోగం రావడంతో ఇద్దరం క్రమంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం ప్రారంభించాం. అయితే ఆ ఏడాదిలోనే నేను గర్భం దాల్చడంతో ఇద్దరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇద్దరికీ పిల్లలంటే ప్రాణం. అలాంటిది మా ప్రేమకి ప్రతిరూపంగా ఈ భూమ్మీదకి రానున్న బిడ్డ గురించి ఆలోచించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికి మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండటం, కెరీర్‌లో స్థిరపడకపోవడం.. వంటి కారణాలతో బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వలేమని నిర్థరించుకోవడంతో వేరే దారి లేక అయిష్టంగానే గర్భస్రావం చేయించుకున్నా. ఇది జరిగిన మరో మూడు నెలల్లోనే నాకు ఒక మంచి సంస్థలో ఉద్యోగం రావడం, ఆ మరుసటి ఏడాదిలోనే పండంటి బిడ్డ పుట్టడం.. చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పటికీ నా మొదటిబిడ్డ జ్ఞాపకాలు నా మనసుని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మేం చేసిన ఆ పని ఆ క్షణానికి తప్పక చేసినా తప్పు చేశామనే బాధ మా ఇద్దరికీ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ప్రస్తుతం మా బిడ్డతో మేం సంతోషంగా ఉన్నాం. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాం. కెరీర్‌లోనూ స్థిరపడ్డాం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 'పిల్లలు ప్రేమిస్తున్నాం అని చెప్పగానే.. వద్దు అనే పెద్దలూ.. కాస్త ఆలోచించండి. వారి ప్రేమ నిజమైనదని మీకు అర్థమైనప్పుడు మీ మనసు పెద్దది చేసుకొని వారిని ఆశీర్వదించి ఒక్కటి చేయండి.. లేదా ముందుగా వారిని జీవితంలో స్థిరపడే దిశగా ప్రోత్సహించండి. అంతేకానీ మొండితనంతో, అహంతో మాట్లాడటం సరికాదు.. మాటపట్టింపులకు పోవడం వల్ల మీకు మానసికంగా బాధ కలగడమే కాదు.. మీ పిల్లలకు కూడా అది ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించండి.. అలాగే పిల్లలు కూడా తమ ప్రేమ కోసం పెద్దలకు ఎదురుతిరగడం కాకుండా ఒప్పించి వివాహమాడడానికి ప్రయత్నించండి. జీవితంలో స్థిరపడకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి గురించి ఆలోచంచకండి... కెరీర్, ఆర్థిక పరిస్థితి బాగుంటేనే జీవితాన్ని పూల బాటగా మార్చుకోగలుగుతాం. ఈ విషయాన్ని యువతరమంతా గ్రహించాలన్నదే నా కోరిక'

ఇట్లు,

మీ సత్య

ఇదీ చదవండి: కరోనా టెస్ట్​లో నెగిటివ్ వచ్చింది.. కానీ ప్రాణం పోయింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.