ETV Bharat / opinion

డబ్ల్యూహెచ్‌ఓలో అమెరికా స్థానాన్ని భర్తీ చేసేదెవరు? - who reforms news

డబ్ల్యూహెచ్‌ఓ మీద చైనాకు పూర్తి అదుపు ఉందనీ, కరోనా వైరస్‌ విస్ఫోటనం గురించి వారికి ముందే తెలిసినా ఆ విషయం చెప్పకుండా తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఇప్పుడు అత్యధిక నిధులు సమకూర్చే అమెరికా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయమే ప్రశ్నార్థకమైంది.

WHICH COUNTRY REPLACE AMERICA IN WHO
డబ్ల్యూహెచ్‌ఓలో అమెరికా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
author img

By

Published : Jun 5, 2020, 7:23 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాను డిమాండు చేసిన సంస్కరణలు చేపట్టకపోతే ఆ సంస్థతో తెగతెంపులు చేసుకొంటామనీ, సంస్థకు ఇచ్చే నిధులను అంతర్జాతీయంగా కీలక ప్రజారోగ్య రక్షణ పథకాలకు మళ్లిస్తామని గత నెల చివరిలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. బహుళ పక్ష సహకారాన్ని పక్కనపెట్టి స్వదేశ ప్రాధాన్యాలకు, ప్రయోజనాలకు అమెరికా పట్టం కట్టడం ఇదే మొదటిసారి కాదు. 2017 అక్టోబరులోనూ అమెరికా ఇదేమాదిరిగా ఐక్యరాజ్యసమితి విద్య, సామాజిక, సాంస్కృతికి సంస్థ (యునెస్కో) నుంచి వైదొలగింది.

'యుద్ధాలు మనుషుల మస్తిష్కాలలో మొదలవుతాయి కాబట్టి, శాంతి దుర్గాలను అక్కడే నిర్మించాలి' అని యునెస్కో పీఠికలో రాసిన వ్యక్తి స్వయంగా అమెరికన్‌ జాతీయుడైన ఆర్చిబాల్డ్‌ మెక్‌ లీష్‌. ఆయన యునెస్కో ప్రథమ నిర్వహణ సంఘ సభ్యుడు కూడా. యునెస్కో నిరంతరం ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందనీ, ఆ సంస్థలో సంస్కరణలు రావలసి ఉందనీ వాదిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం యునెస్కో నుంచి కూడా వైదొలగింది. ఆ సంస్థకు అమెరికా వాటా నిధులు బకాయి పడిపోయాయి. ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఏర్పరచిన మానవ హక్కుల పరిరక్షణ మండలి నుంచి కూడా 2018 జూన్‌లో అమెరికా నిష్క్రమించింది. ఈ సంస్థ సైతం ఇజ్రాయెల్‌ వ్యతిరేక పంథా అనుసరిస్తోందని ట్రంప్‌ సర్కారు ఫిర్యాదు. ఇంతకీ డబ్ల్యూహెచ్‌ఓ ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో ట్రంప్‌ విస్పష్టంగా ప్రతిపాదించలేదు. డబ్ల్యూహెచ్‌ఓ మీద చైనాకు పూర్తి అదుపు ఉందనీ, కరోనా వైరస్‌ విస్పోటనం గురించి చైనాకు ముందే తెలిసినా, డబ్ల్యూహెచ్‌ఓకు ఆ విషయం చెప్పకుండా తప్పుదోవ పట్టించిందని ట్రంప్‌ ఆరోపణ. కానీ, ఆయన అదే నోటితో ‘చైనా కరోనా వైరస్‌ను నియంత్రించడానికి హోరాహోరీ ప్రయత్నం చేస్తోంది’ అని జనవరి 24న పేర్కొన్న సంగతి మరచి పోయారు.

డిసెంబరులోనే..

నిజానికి 2019 డిసెంబరు 31న వుహాన్‌లో న్యుమోనియా కేసులు బయటపడినప్పుడు, ఆ వ్యాధి నియంత్రణలో చైనాకు తోడ్పడటానికి డబ్ల్యూహెచ్‌ఓ ఒక ప్రత్యేక సహాయ బృందాన్ని నెలకొల్పింది. 2018-2021 కాలానికి 34 దేశాల ప్రతినిధులతో ఎన్నికైన డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక సంఘంలో అమెరికాకూ సభ్యత్వం ఉంది. ఫిబ్రవరి 3-6 తేదీలలో సమావేశమైన ఈ సంఘానికి డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ కరోనా గురించి తెలియజేశారు. ఈ సమావేశానికి తమ ప్రతినిధిగా ట్రంప్‌ నియమించిన బ్రెట్‌ గిర్వా సమయానికి రాలేకపోయారు. అమెరికా ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయిన అడ్మిరల్‌ గిర్వా నియామకానికి అమెరికా సెనెట్‌ (ఎగువ సభ) ఆమోదం తెలపడంలో ఆలస్యమే దీనికి కారణం. మే 22న సెనెట్‌ ఆమోదం లభించిన తరవాత మాత్రమే ఆయన డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక సంఘ సమావేశంలో పాల్గొనగలిగారు. ఏదిఏమైనా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా వైదొలగాలన్నా రెండు లాంఛనాలు పాటించాల్సిందే. వాటిలో మొదటిది- డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకురావడానికి అమెరికా ఒక ఏడాది ముందే నోటీసు ఇవ్వాలి. దీని ప్రకారం 2021 మధ్యనాళ్లకు కానీ అమెరికా నిష్క్రమణ వీలుకాదు. రెండు.. డబ్ల్యూహెచ్‌ఓకు తన వాటా నిధులు ఇచ్చిన తరవాత మాత్రమే అమెరికా నిష్క్రమించాలి. కాబట్టి ట్రంప్‌ డబ్ల్యూహెచ్‌ఓకు ఇవ్వాల్సిన నిధులను వేరే పథకాలకు మళ్లించాలన్నా వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

నిధులు ఎవరిస్తారు?

డబ్ల్యూహెచ్‌ఓకు 2020-21 మధ్యకాలంలో అమెరికా తప్పనిసరిగా 23.69 కోట్ల డాలర్లు చెల్లించాలి. మరో 65.6 కోట్ల డాలర్లను స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలి. డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక నిర్వహణ బడ్జెట్‌కు అందరికన్నా ఎక్కువగా (22 శాతం) నిధులు సమకూర్చేది అమెరికాయే. ఆ దేశమిచ్చే నిధులలో 27.4 శాతం పోలియో నిర్మూలనకు, 17.4 శాతం నిధులను అత్యవసర చికిత్సలు, పౌష్టికాహార పథకాలకూ వెచ్చిస్తున్నారు. 7.7 శాతం నిధులను టీకా కార్యక్రమాలకు, 5.74 శాతం నిధులను క్షయ నివారణపై ఖర్చుచేస్తున్నారు. అమెరికా నిష్క్రమణ తరవాత చైనా కానీ, ఇతర దేశాలు కానీ, ఆ నిధుల కోటాను చెల్లించడానికి ముందుకురావచ్ఛు ఈసారి కొవిడ్‌ టీకా ఉత్పత్తి, పంపిణీకి ఆ నిధులు వెచ్చిస్తారు. డబ్ల్యూహెచ్‌ఓ అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూహెచ్‌ఏ ఇటీవల జెనీవాలో సమావేశమైనప్పుడు చైనా, ఐరోపా సమాఖ్యలు అమెరికా స్థానాన్ని భర్తీచేయడానికి సుముఖత వ్యక్తంచేశాయి. కొవిడ్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి టీకాలు, మందులు, వైద్య సాధనాలను ప్రపంచ దేశాలన్నింటికీ అందించే బృహత్తర యజ్ఞానికి డబ్ల్యూహెచ్‌ఓ నాయకత్వం వహించాలంటూ భారత్‌తో సహా 130 దేశాలు గత నెల 19న తీర్మానించాయి. హెచ్‌ఐవి-ఎయిడ్స్‌కు కావలసిన మందులను ప్రపంచానికి సరఫరా చేస్తున్న అనుభవం భారతదేశానిది. పేద దేశాలకు చౌక ధరలకు ఈ మందులు సరఫరా చేసే బాధ్యతను ఐరాస, డబ్ల్యూహెచ్‌ఓలు భారతీయ కంపెనీ సిప్లాకు అప్పగించాయి. కొవిడ్‌పై పోరులోనూ భారత్‌ అంతర్జాతీయ సహకారంతో ముందుకెళుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఉద్ఘాటించారు. ఆయన డబ్ల్యూహెచ్‌ఏ కార్యనిర్వాహక బోర్డు అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికయ్యారు. ఈ ఏడాది అంతా ఆయన ఆ పదవిలో ఉంటారు.

-అశోక్‌ ముఖర్జీ, ఐక్యరాజ్యసమితిలో భారత్‌ తరఫున మాజీ ప్రతినిధి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.