ETV Bharat / opinion

నీటి సరఫరా: ఇంటికే జలం.. వ్యాధులకు కళ్లెం

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి 2024 కల్లా గొట్టాల ద్వారా మంచినీటిని అందించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యానికి కరోనా కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు విఘాతం కలిగిస్తున్నాయి. ఇంటింటికి నల్లా ఉంటే భౌతిక దూరం పాటించకపోవడం వంటి సమస్యలూ తలెత్తవు. నీటి లభ్యత ఉంటే ఇళ్లలో శుభ్రతా మెరుగవుతుంది. కనుక అన్ని రాష్ట్రాలూ తాగునీటి సరఫరా వ్యవస్థలను సత్వరం మెరుగుపరచాలి.

author img

By

Published : Jun 13, 2020, 6:33 AM IST

Water supply through pipes for each home
ప్రతి గ్రామీణ గృహానికి 2024 కల్లా గొట్టాల ద్వారా మంచినీరు

గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించగలిగితే పలురకాల వ్యాధులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. నల్లానీళ్లు వాడినచోట నీళ్ల విరేచనాల వంటి సమస్యలు తలెత్తడం లేదని యునిసెఫ్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. చాలా ప్రాంతాల్లో గ్రామాల్లోని ఇళ్లలో నల్లాలున్నా, సరఫరా లోపాల కారణంగా ప్రజలు వీధి కొళాయిల వద్దకు వెళ్లకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నట్లు కేంద్రం ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి 2024 కల్లా గొట్టాల ద్వారా మంచినీటిని అందించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యానికి కరోనా కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక సమస్యలు కొంతమేర విఘాతం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి నల్లా ఉంటే భౌతిక దూరం పాటించకపోవడం వంటి సమస్యలూ తలెత్తవు. నీటి లభ్యత ఉంటే ఇళ్లలో శుభ్రతా మెరుగవుతుంది. కనుక అన్ని రాష్ట్రాలూ తాగునీటి సరఫరా వ్యవస్థలను సత్వరం మెరుగుపరచాలి. కరోనా కట్టడి చర్యల్లో మంచినీటి సరఫరా సైతం ప్రధానమైన అంశమని ప్రభుత్వాలూ గుర్తించాలి.

సుప్రీం దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా గ్రామాల్లో 17.87 కోట్ల ఇళ్లు ఉన్నాయి. 3.71 కోట్ల (20.81 శాతం) ఇళ్లకు మాత్రమే ప్రస్తుతం గొట్టాల ద్వారా తాగునీరు అందుతోంది. మిగతా 79.19 శాతం గృహవాసులు నిత్యం వీధి కొళాయిల వద్దకు వెళ్తున్నారు. అవీ అందుబాటులో లేకుంటే దూరప్రాంతాల్లోని బావులు, బోరుల వద్దకు నడవక తప్పని దుస్థితీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ముఖ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. వేసవిలో గ్రామ పంచాయతీలు సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ నీళ్లు పట్టుకోవడం తెలిసిందే. ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాను అత్యవసర చర్యగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లాక్‌డౌన్‌ అమలైన మొదటి దశలోనూ తాగునీటి సరఫరా పనులు చేసుకోవచ్చని రాష్ట్రాలకు తెలిపింది. మరోవైపు ఏప్రిల్‌లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా తాగునీటికి సత్వర చర్యలు చేపట్టాలని- క్వారంటైన్‌ కేంద్రాలు, మురికివాడలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు తదితర చోట్ల తగినంత నీటి లభ్యత ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం 2015లోనే దాదాపు రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో 'మిషన్‌ భగీరథ' పేరిట నీటి సరఫరా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గ్రామాల్లో ఇళ్లలోనే నల్లాలు ఏర్పాటు చేసి నదులు, రిజర్వాయర్ల నీటిని శుద్ధి చేసి అందిస్తోంది. తెలంగాణలో 54 లక్షల గృహాలకుగాను 18 లక్షల ఇళ్లకు (33.53 శాతం) నల్లా కనెక్షన్లు ఉన్నట్లు జల్‌జీవన్‌ మిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 91 లక్షల గ్రామీణ గృహాల్లో 30 లక్షల (33.52 శాతం) గృహాలకు నల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. భూగర్భ జలంలో ఫ్లోరైడ్‌, ఐరన్‌, లవణీయత తదితరాలు మోతాదుకు మించి ఉండే ప్రమాదం ఉండటం వల్ల నదులు, చెరువుల్లోని ఉపరితల జలాలనే ఇళ్లకు సరఫరా చేయాలని కేంద్రం తొలుత ప్రతిపాదించింది. అవన్నీ ఖర్చుతో కూడిన పనులంటూ చాలా రాష్ట్రాలు అడ్డుచెప్పాయి. దీంతో ఉపరితల జలం అందుబాటులో లేనిచోట భూగర్భ జలాన్నే శుద్ధి చేసి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తాగునీటి పరీక్షల్ని స్థానికంగానే నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వ యోచన. అన్ని రాష్ట్రాల్లో గ్రామానికి అయిదుగురు మహిళల్ని ఎంపిక చేసి, వారికి జల నాణ్యత పరీక్షలు నిర్వహించడంపై శిక్షణ ఇస్తామని, అనంతరం నీటి నాణ్యత తనిఖీ కిట్లను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ మార్గదర్శకాల్లో వెల్లడించింది. మహిళలు చేపట్టే నీటి నమూనాల తనిఖీ పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితాలు వస్తే, ఆ నమూనాలను తాగునీటి శాఖ ద్వారా ప్రయోగశాలకు పంపాల్సి ఉంటుంది. నీటి పరీక్షలకు సంబంధించి కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రయోగశాలల ఏర్పాటుకూ నిధులు అందిస్తామని, సంచార ప్రయోగశాలల్నీ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. తనిఖీ ఫలితాలను పంచాయతీ పాలక వర్గానికి, గ్రామస్థులకు సంక్షిప్త సందేశా(ఎస్‌ఎమ్‌ఎస్‌)ల ద్వారా తెలపాలని సూచించింది.

నీటి శుద్ధిపై దృష్టి సారించాలి

ఇప్పటికే గొట్టం మార్గాల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్న తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి క్షేత్ర స్థాయి నీటి నాణ్యత నిర్ధారణ పనులను సత్వరమే చేపట్టాలి. ప్రస్తుతం భగీరథ పథకంలో సరఫరా అవుతున్న నీటిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లోని ప్రయోగశాలల్లో తనిఖీ చేస్తున్నా అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తున్నాయనేది ఎవరికీ తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలకు దాదాపు అయిదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్షల తనిఖీ కిట్లను అందించింది. వాటిలోని రసాయనాలను ఏ విధంగా ఉపయోగించాలనేదానిపై సరైన అవగాహన లేకపోవడంవల్ల ఆ కిట్లన్నీ నిరుపయోగంగా మారాయి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంటింటికీ తాగునీటిని గొట్టాల ద్వారా సరఫరా చేసే ప్రక్రియలో రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గృహావసరాలకు ఉపయోగించిన నీరు అడ్డంకులు లేకుండా నిర్దేశిత ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. లేనిపక్షంలో మురుగునీరు ఇళ్లమధ్యే నిలిచిపోయి దోమలకు నెలవుగా మారే ముప్పుంది. జాతీయ నమూనా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ గృహాల్లో వాడిన నీటిలో 37శాతం పల్లపు ప్రాంతాలు, వీధుల్లో మురుగులా పేరుకుపోతోంది. మరో 37శాతం మురుగు కాలువల్లోకి వెళ్తుండగా- తక్కింది సమీప నదులు, చెరువులు వంటివాటిలోకి చేరుతోంది. తెలంగాణలో వాడిన నీరు పల్లపు ప్రాంతాలు, వీధుల్లో 36శాతందాకా నిల్వ ఉంటే, మురుగు కాల్వల్లోకి 46శాతం దాకా వెళ్తోంది. ఇలా ఉపయోగించిన నీటిని వృథాగా వదిలేయకుండా, శుద్ధి చేసి తిరిగి సాగు అవసరాలకు వాడొచ్చని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలూ ఈ తరహా నీటి శుద్ధి ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిధులున్నా... ప్రయోజనం అంతంతే!

గ్రామాలకు రక్షిత మంచినీటి కోసం 1954లోనే కేంద్ర పథకాలు మొదలైనా నిధుల దుర్వినియోగమే తప్ప నీళ్ల కోసం ప్రజలు వెంపర్లాడే దుస్థితి తప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఏ రాష్ట్రానికి వెళ్లి చూసినా నిరుపయోగంగా మిగిలిపోయిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ప్రతి గ్రామంలో దర్శనమిస్తుంటాయి. ఇష్టానుసారంగా నిర్మాణాలను చేపట్టి నిధులను కైంకర్యం చేయడం వల్లే పలుచోట్ల అవి దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. శుద్ధి చేసిన జలాలను అందించే లక్ష్యంతో 'స్వజలధార' వంటి పలు పథకాలు అమలైనా, 2019లో కేంద్రం తెచ్చిన 'జల్‌జీవన్‌ మిషన్‌' మాత్రం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొంది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ గృహాలకు 2024 నాటికి గొట్టంమార్గం ద్వారా ప్రతిరోజూ తలసరి 55 లీటర్ల శుద్ధి చేసిన నీటిని అందజేయడం జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యం. మొత్తం 14.60 కోట్ల గృహాలకు నీటిని అందించేందుకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దానిలో రూ.1.51లక్షల కోట్లను తాము సమకూరుస్తామని కేంద్రం నిరుడు ప్రకటించింది. గొట్టం మార్గాల వ్యయంలో- ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకు 90శాతం, మిగతావాటికి 50శాతం మేర ఇస్తామని ప్రతిపాదించింది.

- పిళ్లా సాయికుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.