ETV Bharat / opinion

దేవభూమిలో ఆలయాలపై రగడ

ఉత్తరాఖండ్​లోని ఆలయాల నిర్వహణ, ఆధ్యాత్మిక పర్యాటకం విషయంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వివాదాలు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ చట్టం కింద 2019లో ఏర్పాటు చేసిన చార్‌ధామ్‌ నిర్వహణ బోర్డుగా పిలిచే తాత్కాలిక కమిటీని కొనసాగించాలన్న నిర్ణయమే వీరి ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పూజారులు.. జూన్‌ 28 నుంచి ఆందోళన ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.

author img

By

Published : Jun 22, 2021, 8:53 AM IST

temple disputes
ఆలయాలపై రగడ

హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఆలయాల నిర్వహణ, ఆధ్యాత్మిక పర్యాటకం విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో ఇటీవల వివాదాలు చెలరేగాయి. ప్రఖ్యాత బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలకు కొవిడ్‌ కారణంగా భక్తుల సందర్శనను నిలిపివేశారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు ఈ దేవాలయాలకు చెందిన పూజారులు బహిరంగంగా గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం కింద 2019లో ఏర్పాటు చేసిన చార్‌ధామ్‌ నిర్వహణ బోర్డుగా పిలిచే తాత్కాలిక కమిటీని కొనసాగించాలన్న నిర్ణయమే వీరి ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. ఈ తరహా కమిటీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూజారులు జూన్‌ 28 నుంచి ఆందోళన ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. వివాదానికి సంబంధించిన మూలం చాలాఏళ్లక్రితం నుంచే ఉంది.

ఏటా లక్షల మంది..

దేవభూమి ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ ఆలయాల్లో ఒకటైన బద్రీనాథ్‌ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యులు నిర్మించారని భక్తుల విశ్వాసం. గంగానదికి మూలమైన గౌముఖికి ఇది కొద్ది మైళ్ల దూరంలో ఉంటుంది. దేవప్రయాగ వరకు భగీరథిగా పిలిచే ఈ నదిని, అలకనందా నదితో కలిశాక 'గంగ'గా వ్యవహరిస్తారు. అటు కేదార్‌నాథ్‌లో ప్రవహించే మందాకిని, అలకనందల సంగమం రుద్రప్రయాగలో జరుగుతుంది. ఈ ప్రదేశాల్లో ప్రకృతి అందం వర్ణనాతీతం. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి ఏటా లక్షల మంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. సామాన్య భక్తులతోపాటు దేశంలోని ఎంతోమంది ప్రముఖులు దైవక్షేత్రాలను సందర్శించుకుని దేవాలయాల హుండీలకు భారీ విరాళాలు సమర్పించడం ఆనవాయితీ. గతంలో ఈ ఆలయాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో ఇక్కడి పురోహితులకు ప్రత్యేక స్థానం ఉండేది. నిధుల నిర్వహణలో వారికి స్వేచ్ఛ ఉండేది. కానీ 1939లో నాటి సంయుక్త ప్రావిన్సు గఢ్వాల్‌ ప్రాంతంలోని హిందూ దేవాలయాల నిర్వహణను బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ కిందకి తీసుకొచ్చిన అనంతరం పరిస్థితులు మారి పోయాయి. పర్యవేక్షక కమిటీ ఏర్పాటుకు అప్పట్లో పురోహితుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికి, గట్టి ప్రతిఘటన వ్యక్తం కాలేదు. ఫలితంగా ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు.

పూజారులు ఆగ్రహం..

చార్‌ధామ్‌తోపాటు ఉత్తరాఖండ్‌ ఆలయాలకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్లుగా ఆలయాల సందర్శనకు భక్తుల రాకను అనుమతించడం లేదు. వరసగా రెండేళ్లు భక్తులను అనుమతించకపోవడం ఇదే మొదటిసారి. ఈ పరిణామాల ఫలితంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన పూజారులు, పాండాలు జీవనాధారం కోల్పోయారు. స్థానిక హోటల్‌, పర్యాటక పరిశ్రమలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వీటన్నింటికి మించి, కరోనా తొలి దశ వ్యాప్తికి కొద్ది నెలల ముందు, రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆలయాల నిర్వహణను తన అధీనంలోకి తీసుకుంది. ఈ నిర్ణయంపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ రాష్ట్రంలోని 53 దేవాలయాల వ్యవహారాలకు సంబంధించిన తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించినట్లేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కొవిడ్‌ మహమ్మారి పరిస్థితులు, ప్రభుత్వ మార్గదర్శకాలు, పూజారుల ఆందోళనలు వెరసి, ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక పర్యాటక పునరుద్ధరణ అవకాశాలు మరింత సన్నగిల్లాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాలన్నింటినీ ఒకే బోర్డు నిర్వహణ కిందకు వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు సంబంధించిన భారీ మొత్తంలోని నిధులు, ఇతర విలువైన వస్తువుల పర్యవేక్షణ, నిర్వహణలో తరచూ లోపాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంపై అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విస్తృత ప్రజాప్రయోజనాల నిమిత్తం నిధులు, ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు వాటిని సక్రమంగా వినియోగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

దీనావస్థలో ప్రాచీనాలయాలు..

మరోవైపు ఈ ఆలయాలకు పెద్దయెత్తున ధనం, బంగారంతోపాటు, దెహ్రాదూన్‌, రామ్‌నగర్‌, లఖ్‌నవూ, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో భూముల రూపంలో ఆస్తులు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లో పలు ప్రాచీన ఆలయాలు దీనావస్థకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. వీటిని గుర్తించిన భారత పురావస్తు శాఖ తక్షణమే పరిరక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది. ఇలాంటి ఆలయాల నిర్వహణలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. పూజారుల ఆందోళన ఆలోచనాపరుల్లో కొత్త చర్చకు దారితీసింది.

అధికార యంత్రాంగం పరిధి నుంచి తక్షణమే ఆలయాలకు విముక్తి కల్పించాలని పూజారుల డిమాండ్లు, ఆలయాల నిర్వహణపై నియంత్రణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలో ఏది సరైనదనే అంశంపై చర్చ సాగుతోంది.

- ఆర్‌.పి.నైల్వాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.