ETV Bharat / opinion

ఆన్‌లైన్‌ అగాధంలో చదువులు- ఆదిలోనే అడ్డంకులు!

author img

By

Published : Jul 2, 2021, 9:21 AM IST

కరోనా వైరస్​ కారణంగా ఆన్​లైన్​ చదువుల ప్రాముఖ్యం పెరుగుతోంది. అయితే.. దేశీయ విద్యారంగం అందుకు సరిగ్గా సన్నద్ధం కానేలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు సహా పది రాష్ట్రాల్లో 20శాతం కన్నా తక్కువ జనాభాకే నెట్‌ సదుపాయం ఉందని, దేశం నలుమూలలా 42శాతం పట్టణ ప్రాంతవాసులకు 15శాతం గ్రామీణులకే అంతర్జాలం చేరువైందని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. కనిష్ఠ వ్యవధిలో మౌలిక సమస్యల్ని చురుగ్గా పరిష్కరిస్తేనే ఆన్‌లైన్‌ చదువులు అర్థవంతమవుతాయి. వీలైనంత వేగంగా డిజిటల్‌ అగాధాన్ని పూడ్చగలిగితేనే, గాడి తప్పిన విద్యాభారతం తేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి!

Online classes
ఆన్​లైన్​ తరగతులు

కరోనా మహమ్మారి విజృంభణతో దేశ విద్యారంగాన బోధన, అభ్యసన పద్ధతుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వైరస్‌ కొత్త కోరలు తొడుక్కుంటున్న దృష్ట్యా, పోనుపోను ఆన్‌లైన్‌ చదువుల ప్రాముఖ్యం ఇంతలంతలవుతోంది. వాస్తవంలో దేశీయ విద్యారంగం అందుకు సరిగ్గా సన్నద్ధం కానేలేదని భిన్న అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. కోల్‌కతా మహానగరంలో డిజిటల్‌ అగాధం ఎంతగా విస్తరించిందో అమర్త్యసేన్‌ నెలకొల్పిన ప్రతీచి ట్రస్ట్‌ తాజా అధ్యయనం తెలియజెబుతోంది. అక్కడి 1-5 తరగతుల పిల్లలనుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారం ప్రకారం, ఎకాయెకి 40శాతం దాకా విద్యార్థులు ఆన్‌లైన్‌ బోధనకు నోచుకోలేకపోయారు. అంతటి మహానగరంలోనే పరిస్థితి అలా ఉంటే, మారుమూల పల్లెల్లోను ఆర్థిక స్థోమత ప్రాతిపదికన డిజిటల్‌ అంతరం ఎన్ని యోజనాల మేర విస్తరించిందో ఊహించుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో సుమారు 70శాతం విద్యార్థులకు అంతర్జాల వసతి అందుబాటులో ఉండగా, గ్రామీణ ఒడిశాలో మూడుశాతం కన్నా తక్కువ కుటుంబాలే ఆ జాబితాలో ఉన్నట్లు ఇటీవల జాతీయ గణాంక సంస్థ ధ్రువీకరించింది.

పరిష్కారం చూపుతుందా?

కర్ణాటక, తమిళనాడు సహా పది రాష్ట్రాల్లో 20శాతం కన్నా తక్కువ జనాభాకే నెట్‌ సదుపాయం ఉందని, దేశం నలుమూలలా 42శాతం పట్టణ ప్రాంతవాసులకు 15శాతం గ్రామీణులకే అంతర్జాలం చేరువైందని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లలో ఏదో ఒకటైనా కలిగిన కుటుంబాలు 10శాతమేనంటున్నారు. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో చరవాణులు కలిగి ఉన్న అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువేనన్న విశ్లేషణలు- లింగపరమైన దుర్విచక్షణా డిజిటల్‌ అగాధాన్ని పెంచుతోందంటున్నాయి. పలు రాష్ట్రాలు దాదాపు అన్ని తరగతులకూ ఆన్‌లైన్‌ పాఠాల బోధనే శరణ్యమంటున్నా- విద్యార్థుల నడుమ అదృశ్య విభజన రేఖ ఉనికి ఎవరూ తేలిగ్గా తోసిపుచ్చలేనిది. పదహారు రాష్ట్రాల్లోని 3.61లక్షల గ్రామాలకు కేంద్రం కల్పిస్తామంటున్న ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ బ్రాడ్‌బ్యాండ్‌, ప్రస్తుత దుస్థితికి సరైన విరుగుడు కాగలుగుతుందా?

అంతర్జాల సేవలు పొందడమన్నది పౌరుల ప్రాథమిక హక్కేనని లోగడ జమ్ముకశ్మీర్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. దురదృష్టవశాత్తు, దేశంలోని 35 కోట్ల మంది విద్యార్థుల్లో అత్యధికులకు తరచూ ఆ 'హక్కు' కొల్లబోతుండటానికి డిజిటల్‌ అగాధం పుణ్యం కట్టుకుంటోంది. పదేళ్ల క్రితం ప్రారంభమైన జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ అనంతర కాలంలో 'భారత్‌ నెట్‌వర్క్‌'గా మారినా, రెండున్నర లక్షల గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే కృషిలో అక్షరాలా చతికిలపడింది. పనులు పూర్తయినట్లు సగర్వంగా ప్రకటించిన చోట్లా అంతర్జాల సేవల నాణ్యత అంతంతమాత్రమే.

పకడ్బందీ కార్యాచరణ తక్షణావసరం..

నెట్‌వర్క్‌ ఇబ్బందుల్ని పరిష్కరించనిదే ఆన్‌లైన్‌ చదువులు గాడిన పడవు. ఇప్పటికే పూర్తి చేశామంటున్న పనులపై ఫిర్యాదుల్ని గాలికొదిలేసి కొత్తగా మరిన్ని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని అందుబాటులోకి తెస్తామనడంలోని ఔచిత్యం ఏమిటి? అన్ని జనావాస ప్రాంతాలకు 'భారత్‌ నెట్‌' విస్తరణ ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధననే కాదు- టెలీవైద్యం, నైపుణ్య శిక్షణ, వివిధ రకాల ఇ-సేవలు, ఇ-వాణిజ్యాలను విస్తృత జనబాహుళ్యానికి చేరువ చేస్తామంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలూ త్వరలోనే ఊరూరా నెట్‌ సదుపాయం తథ్యమంటున్నాయి. బోధన సిబ్బందికి డిజిటల్‌ బోధనలో శాస్త్రీయ శిక్షణ అత్యావశ్యకమని గతంలోనే అసర్‌ (వార్షిక విద్యాస్థాయి నివేదిక) హెచ్చరించింది. తదనుగుణమైన ఏర్పాట్లతో పాటు- గ్రామాలన్నింటా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పనులు చురుగ్గా సాగేలా, బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో మందభాగ్యాన్ని చెదరగొట్టేలా పకడ్బందీ కార్యాచరణ తక్షణావసరం. కనిష్ఠ వ్యవధిలో మౌలిక సమస్యల్ని చురుగ్గా పరిష్కరిస్తేనే ఆన్‌లైన్‌ చదువులు అర్థవంతమవుతాయి. వీలైనంత వేగంగా డిజిటల్‌ అగాధాన్ని పూడ్చగలిగితేనే, గాడి తప్పిన విద్యాభారతం తేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి!

ఇదీ చూడండి: Online Classes : సన్నద్ధత లేదు.. సాధనాలు లేవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.