ETV Bharat / opinion

ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ - E-Commerce problems

కంపెనీలిచ్చే భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల కారణంగా ఆన్​లైన్​ షాపింగ్​ బాగా అలవాటైపోయారు దేశ ప్రజలు. ఈ క్రమంలోనే ఇందులో మోసాలు అరికట్టేందుకు ఈ-కామర్స్​ను 2019నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. జులై 27న అమల్లోకి వచ్చిన ఈ చట్టంలోని కొత్త నిబంధనలపై ప్రత్యేక కథనం.

Special story on consumer protection act 2019 in view of E-commerce
ఈ-కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ
author img

By

Published : Aug 3, 2020, 8:11 AM IST

చరవాణి చేతిలో పెట్టుకుని నచ్చిన వస్తువులను కొనుగోలుచేసే ఈ-కామర్స్‌ సంస్కృతి దేశంలో పల్లెపల్లెకూ విస్తరించింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ భారతీయులకు బాగా అలవాటైంది. కంపెనీలిచ్చే భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఈ-కామర్స్‌ విజయానికి కారణాలు. దేశ జనాభాలో దాదాపు నాలుగోవంతు ఈ-కామర్స్‌లో కొనుగోళ్లు సాగిస్తున్నా, ఉత్పత్తి విషయంలో ఏదైనా సమస్య వస్తే తీర్చే యంత్రాంగం, దానికో నియమ నిబంధనలంటూ ఇన్నేళ్లుగా లేకుండా పోయాయి. మోసపోయిన వినియోగదారు ఉసూరుమనే పరిస్థితి నుంచి తప్పించడానికి తాజాగా కేంద్రం సంబంధిత చట్టంలో మార్పులు చేసింది. 2019నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి ఈ-కామర్స్‌ సంస్థలనూ తీసుకొచ్చింది. నిరుడు ఆగస్టు ఆరున పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లు ఏడాది తరవాత జులై27 నుంచి చట్టంగా అమలులోకి వచ్చింది. ఈ-కామర్స్‌ వినియోగదారులకు ఇది పెద్ద ఊరట కలిగించే విషయమే!

పెరుగుతున్న డిజిటల్ కొనుగోలుదారుల సంఖ్య..

అమెజాన్‌ లాంటి ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ మనదేశంలో వేలకోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది. దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా వాణిజ్య దిగ్గజం వాల్‌మార్ట్‌ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టింది. దేశంలో దాదాపు 19వేల ఈ-కామర్స్‌ కంపెనీలున్నా వాటిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నవి 70 మాత్రమే. ఆదాయార్జనలోనూ వీటిదే సింహభాగం. మనసుకు నచ్చిన దుస్తుల నుంచి, మనుషుల ప్రాణాలు కాపాడే ఔషధాల వరకూ అన్నీ ఆన్‌లైన్లో ఆర్డరిస్తే వాకిట వాలుతున్నాయి. 2018నాటికి దేశంలో డిజిటల్‌ కొనుగోలుదారుల సంఖ్య 22.4కోట్లు. 2020నాటికి 32కోట్లు దాటుతుందని ‘స్టాటిస్టా’ సంస్థ అంచనా వేసింది.

2017లోనే దేశంలో ఈ-కామర్స్‌ వ్యాపారం విలువ దాదాపు రూ.1.79లక్షల కోట్లు. 2021నాటికది రూ.6.28లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. కరోనా మహమ్మారి తరవాత ఈ-కామర్స్‌ రెక్కలు తెంచుకుని మరీ విస్తరించింది. ఆరంభంలో చట్టనిబంధనల భయంలేకుండా పోవడంతో ఈ-కామర్స్‌ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. ఆర్డర్‌ చేసిన వస్తువు రాకపోయినా, ఇతర సేవాలోపాలు తలెత్తినా కంపెనీలను ప్రశ్నించే పరిస్థితులు లేకుండాపోయాయి. ఐఫోన్‌ కోసం సొమ్ము చెల్లిస్తే ఇటుకరాయి వచ్చిందన్న ఫిర్యాదులూ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చూపినది కాకుండా వేరే నాసిరకానిది వచ్చిందని వస్తువు వెనక్కి పంపితే నెలలు గడచినా డబ్బు తిరిగి రాలేదన్న ఫిర్యాదులూ అనేకం. వాటిపై దృష్టిపెట్టి పరిష్కరించే యంత్రాంగం లేదు. ఇప్పుడు కొత్త చట్టం రాకతో ఈ పెడధోరణులకు పగ్గాలు పడే రోజులు వచ్చినట్లే భావించాలి.

షరతులు వర్తిస్తాయ్..

వినియోగదారుల పరిరక్షణ చట్టం (2019)లోని కొత్త నిబంధనలు ఈ-కామర్స్‌ కంపెనీలకూ వర్తిస్తాయి. ఇకపై ఆన్‌లైన్‌ కొనుగోళ్ల మోసాలకు ఈ-కామర్స్‌ సంస్థలు బాధ్యత వహించి, అపరాధ రుసుము చెల్లించాలి. మోసం స్థాయిని బట్టి ఆయా కంపెనీల అధికారులకు జైలుశిక్షా విధించవచ్ఛు నాణ్యతలేని వస్తువులు అందజేసినా అపరాధరుసుం కట్టాల్సి ఉంటుంది. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ బుక్‌ చేసి తరవాత దాన్ని రద్దుచేస్తే ఈ-కామర్స్‌ సంస్థలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఈ చట్టం నిర్దేశిస్తోంది. వస్తువులను తిరిగి ఇవ్వడం (రీఫండ్‌), మార్చుకోవడం (ఎక్స్ఛేంజ్‌), వస్తువు నాణ్యతకు హామీ (గ్యారంటీ, వారంటీ) లాంటి వివరాలన్నీ ఈ-కామర్స్‌ సైట్‌లో వినియోగదారుకు ఇక కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. చైనా వస్తువులను నిషేధించాలన్న డిమాండ్‌ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన చాలా కీలకం కానుంది. ఇది కచ్చితంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ స్పష్టీకరించారు.

సమస్యల్ని పరిష్కరించాలి!

ఈ-కామర్స్‌ సంస్థలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక నోడల్‌ అధికారిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆ అధికారి నిర్ణీత కాలవ్యవధిలో ఫిర్యాదుల్ని పరిష్కరించాలి. కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఇకపై ఈ-కామర్స్‌ కంపెనీల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఈ నిబంధనలను స్నాప్‌డీల్‌ లాంటి కొన్ని దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీలు స్వాగతించాయి. అయితే ప్రతీ వస్తువు మీద ఫిర్యాదులు పరిష్కరించే అధికారి (గ్రీవెన్స్‌ ఆఫీసర్‌) వివరాలు లాంటివన్నీ వేయడం కొంత కష్టమేనని ఓ ఈ-కామర్స్‌ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. వస్తువుల నాణ్యత, ధరల విషయంలో ఈ-కామర్స్‌ కంపెనీల గుత్తాధిపత్యానికి ఈ కొత్త నిబంధనలు ముకుతాడు వేసినప్పుడే వినియోగదారులకు ఊరట కలుగుతుంది!

- శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ఇదీ చూడండి: టిక్​టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్​ ప్రయత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.