ETV Bharat / opinion

'500 మీటర్ల దూరంలో భారత్, చైనా సైన్యాలు'

author img

By

Published : Feb 23, 2021, 3:04 PM IST

బలగాల ఉపసంహరణకు ముందు ఎదురెదురుగా ఉన్న భారత్-చైనా దళాలు.. ప్రస్తుతం 500 మీటర్ల దూరాన్ని పాటిస్తున్నాయి. గల్వాన్ లాంటి ఘర్షణలు జరగకుండా ఈ చర్య దోహదం చేయనుంది. అయితే అరగంటలోనే మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకునేలా సైన్యం మోహరింపులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

india china armies
భారత్ చైనా సైన్యం

తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభనను తొలగించేలా భారత్-చైనా అంగీకరించడం వల్ల పాంగాంగ్ సరస్సు వద్ద ప్రమాదకర స్థితిని నివారించినట్లైంది. ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి(ఫిబ్రవరి 10) ముందు ఇరుదేశాల సైన్యాలు 30-40 మీటర్ల దూరంలో ఉండేవి. పదో విడత సైనిక చర్చల సమయానికి ఆ దూరం కాస్తా 500 మీటర్లకు పెరిగిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు 'ఈటీవీ భారత్​'కు తెలిపారు.

"ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఇరుదేశాల సైనికులు ప్రమాదకర స్థితిలో ఉన్నారు. సైన్యం మధ్య దూరం 30-40 మీటర్లు మాత్రమే ఉండేది. అంత దగ్గరగా ఉండే ఏదైనా జరిగేది. కానీ ఇప్పుడు సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇద్దరి మధ్య 500 మీటర్ల దూరం ఉంది."

-అధికారులు

చర్చల్లో పురోగతి వల్ల గల్వాన్ లాంటి ఘటనలు మరోసారి జరగకుండా నివారించినట్లైందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఖాళీ చేసిన సైన్యం అరగంటలోనే మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా మోహరించారని చెప్పారు. సరిహద్దు ప్రతిష్టంభనపై వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

"కమాండర్ స్థాయి సైనిక అధికారుల చర్చలు మాత్రమే కాకుండా.. డబ్ల్యూఎంసీసీ(వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫర్ ఇండియా-చైనా బార్డర్ అఫైర్స్), జాతీయ భద్రతా సలహాదారుల ప్రతినిధుల స్థాయిల్లోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివిధ వేదికల్లో రాజకీయ స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి."

-అధికారులు

సరిహద్దు ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇప్పటివరకు పది విడతల చర్చలు జరిగాయి. పాంగాంగ్ సరస్సు వద్ద ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా.. గోగ్రా, హాట్​స్ప్రింగ్స్, దెప్సాంగ్ ప్రాంతాల నుంచి బలగాల తరలింపుపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

అజెండా రూపకర్తలు

జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని ఉన్నతస్థాయి చైనా స్టడీ గ్రూప్(సీఎస్​జీ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, త్రివిధ దళాల ఉప అధిపతులు, ఇంటలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్ వింగ్(రా) అధిపతులు చర్చల కోసం అజెండా రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ అజెండా రూపొందించిన తర్వాతే క్షేత్రస్థాయిలో సైన్యం చర్చలు జరుపుతోంది.

భారత్​ తరపున చర్చలకు లేహ్​లోని 14 కార్ప్స్​ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, డీజీఎంఓ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్)కు చెందిన బ్రిగేడియర్ స్థాయి అధికారులు పాల్గొంటున్నారు.

(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.