ETV Bharat / opinion

మధ్యవర్తిత్వం: రష్యా చొరవతో కొత్త పంచశీల? - border standoff latest news

భారత్​- చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు పలుమార్లు సైనిక, దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. రష్యా వేదికగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అయిదు సూత్రాలను ఉల్లేఖిస్తూ ఇరు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. మాస్కో సంయుక్త ప్రకటనలోని అయిదు సూత్రాలను కొందరు నిపుణులు కొత్త పంచశీలగా వర్ణిస్తున్నారు. కొత్త పంచశీల కుదరడానికి వేదికగా నిలిచి శక్తిమంతమైన మధ్యవర్తిగా రష్యా ఆవిర్భవించింది.

Russia has emerged as a powerful mediator,
రష్యా చొరవతో కొత్త పంచశీల?
author img

By

Published : Sep 14, 2020, 7:56 AM IST

భారత్‌, చైనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలను పరిష్కరించడానికి రెండు దేశాల సైన్యాధికారులు, పౌర అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాలు జరుగుతున్న సమయంలో భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిహద్దు ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా నివారించాలంటే ఇలాంటి మాటామంతీ చాలా అవసరం. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధమే జరిగితే అది యావత్‌ ప్రపంచానికే అరిష్టం. ఆ ప్రమాదాన్ని నివారించి శాంతిని కాపాడటం విధాయకం. మాస్కోలో భారత్‌, చైనాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన శాంతి చిగుళ్లు తొడుగుతుందనే ఆశను కల్పిస్తోంది. రెండు దేశాలు ఒట్టి మాటలతో సరిపెట్టకుండా గట్టి చేతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్త పంచశీల..

మొదట సయోధ్య యత్నాలు అధికారుల స్థాయి నుంచి ఉన్నత రాజకీయ నాయకత్వం చేతుల్లోకి వెళ్లడం గణనీయ పరిణామం. ప్రస్తుతం సరిహద్దులో నెలకొని ఉన్న పరిస్థితులు ఎవరికీ మంచివి కావని భారత్‌, చైనా సంయుక్త ప్రకటన గుర్తించింది. పరిస్థితిని చక్కదిద్దడానికి అయిదు సూత్రాలను ఉల్లేఖించింది. ఇంతవరకు నరేంద్ర మోదీ-షీ జిన్‌పింగ్‌ల శిఖరాగ్ర సమావేశాలు తప్ప విదేశాంగ మంత్రుల మధ్య ఇలా ఉన్నత స్థాయి సమావేశం జరగలేదు. సరిహద్దు వివాదం బ్రిటిష్‌ వలస కాలం నుంచి ఉన్నదని గుర్తుంచుకుంటే సైన్య, దౌత్య స్థాయుల్లో చర్చలతో పరిష్కారం చిక్కదని అర్థమవుతుంది. ఇంతటి దీర్ఘకాల వివాదాన్ని పరిష్కరించాలంటే అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాలి. 1950లలో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, చైనా ప్రధాని చౌఎన్‌ లై ఎల్‌ఏసీ వివాదాన్ని పరిష్కరించుకోలేకపోవడం 1962లో యుద్ధానికి దారితీసింది. మాస్కో సంయుక్త ప్రకటనలోని అయిదు సూత్రాలను కొందరు నిపుణులు కొత్త పంచశీలగా వర్ణిస్తున్నారు. ఇందులో మొదటి సూత్రం- అగ్ర నాయకులు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు అనుసరించాలని పేర్కొంటోంది. భేదాభిప్రాయాలు తీవ్ర విభేదాలుగా మారకుండా జాగ్రత్త పడాలి. దీన్ని బట్టి మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య త్వరలోనే శిఖరాగ్ర సమావేశం జరిగే అవకాశమున్నట్లు భావించవచ్ఛు వీరిద్దరూ ఇప్పటికే వుహాన్‌, మహాబలిపురాల్లో రెండుసార్లు సమావేశమై ఉన్నారు. తాజా పంచశీల ప్రకారం రెండు దేశాలూ సరిహద్దు నుంచి తమ సేనలను వెనక్కు రప్పించి, ఉభయుల మధ్య సమంజసమైన దూరం పాటించాల్సి ఉంటుంది. సరిహద్దుకు సంబంధించి ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ గౌరవించాలన్నది మూడో సూత్రం. రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో సంభాషణలు కొనసాగించాలన్నది నాలుగో సూత్రం. సరిహద్దులో రెండు దేశాలూ పరస్పర నమ్మకాన్ని వృద్ధి చేసే చర్యలు తీసుకోవడం అయిదో సూత్రం. కొత్త పంచశీల కుదరడానికి వేదికగా నిలచి శక్తిమంతమైన మధ్యవర్తిగా రష్యా ఆవిర్భవించింది. మాస్కోలోనే భారత్‌, చైనాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు సయోధ్య చర్చలు జరపడం విశేషం. రెండు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంతకుముందే ప్రతిపాదించినా, చైనా తోసిపుచ్చింది. భారత్‌ మృదువుగా అదేపని చేసింది.

క్వాడ్​ కూటమిపై నీలినీడలు..

మరోవైపు చైనాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి భారత్‌ 'క్వాడ్‌' కూటమిగా ఏర్పడాలన్న ప్రయత్నాలు మున్ముందు ఏమవుతాయోననే సందేహం నెలకొంది. ఇప్పటికే జపాన్‌ ప్రధాని షింజో అబె రాజీనామాతో క్వాడ్‌కు విఘాతం కలిగింది. చైనాతో సంభాషించడానికి భారత్‌ మాస్కోలో ముందుకురావడం క్వాడ్‌ భవితపై ప్రశ్నలు రేపుతోంది. ఇంతకాలం క్వాడ్‌కు అబె బలమైన మద్దతుదారుగా ఉండేవారు. మరోవైపు ఆస్ట్రేలియా పాడి, వ్యవసాయ ఎగుమతులకు చైనాయే అతిపెద్ద విపణి కాబట్టి క్వాడ్‌ కోసం అది ఎంతవరకు కలసివస్తుందన్నది అనుమానమే. షాంఘై సహకార సంస్థ సమావేశం కోసం మాస్కో వెళ్లేటపుడు భారత రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ మధ్యలో ఇరాన్‌లో ఆగడం విశేషం. ఇరాన్‌ పట్ల భారత్‌ విధానం మారబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. నవంబరులో అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇరాన్‌పై అమెరికా కాఠిన్యమూ తగ్గవచ్ఛు దానివల్ల భారత్‌, ఇరాన్‌లు మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంది. ఏతావతా మాస్కో చర్చలు ప్రపంచంలో భౌగోళిక-రాజకీయ సమీకరణలు మారడానికి దారి తీయగలవన్నది అంచనా!

- సంజీవ్‌ కె.బారువా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.