ETV Bharat / opinion

టీకా పీఎస్​యూలపై నాటి నిర్లక్ష్యం.. నేటి శాపం! - భారత్‌ ఇమ్యునాలజికల్‌

ఔషధ, ఆస్పత్రి రంగాలపై ప్రైవేటు పెత్తనం ఎంత ప్రాణాంతకమో ప్రస్తుత కొవిడ్‌ కాలంలో అందరికీ అనుభవమవుతోంది. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఔషధ రంగంలో స్వావలంబన సాధనకు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను నెలకొల్పారు ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. కానీ అవి ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పరిశోధన చేసే సత్తా- ప్రభుత్వ రంగ సంస్థలకే ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు రంగ ఉత్పత్తి, ప్రభుత్వ రంగ సృజనాత్మక సామర్థ్యాలను మేళవిస్తే రేపటి ఆర్థిక విజృంభణలో సంపన్న దేశాలకు దీటుగా నిలవవచ్చు.

PSUs Failure
ప్రభుత్వ రంగ సంస్థల్లో టీకా
author img

By

Published : Jun 7, 2021, 7:44 AM IST

నిషికి అత్యవసరాలైన ఆహారం, ఔషధాలు క్రమేపీ ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రజలకు ఆహారాన్ని అందించే సేద్యం ప్రైవేటీకరణను రైతన్నలతోపాటు, ఇతర వర్గాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఔషధ, ఆస్పత్రి రంగాలపై ప్రైవేటు పెత్తనం ఎంత ప్రాణాంతకమో ప్రస్తుత కొవిడ్‌ కాలంలో అందరికీ అనుభవమవుతోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించినందునే భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 'ఔషధ పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అది ప్రైవేటు రంగంలో ఉంటే లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారు' అని 1961లోనే హెచ్చరించారు. అందుకే ఔషధ రంగంలో స్వావలంబన సాధనకు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లను నెలకొల్పారు.

ముందుచూపు కొరవడి...

భారత్‌లో 1980లలో మొత్తం 29 పీఎస్‌యూలు టీకాలను ఉత్పత్తి చేసేవి. వాటి చలవతోనే దేశంలో పోలియో, ధనుర్వాతం, మశూచి, కోరింత దగ్గు వంటి వ్యాధులను అరికట్టగలిగాం. ప్రపంచీకరణ మూలంగా 2005నాటికి 17 వ్యాక్సిన్‌ పీఎస్‌యూలు మూతపడిపోయాయి. 2007నాటికి ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో, మిగిలిన అయిదు సంస్థలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. 2008లో కేంద్రం మూడు పీఎస్‌యూల లైసెన్సులు రద్దు చేసింది. అవి- హిమాచల్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, తమిళనాడు కూనూరులోని పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నైలోని బీసీజీ వ్యాక్సిన్స్‌ ల్యాబ్‌. ఉత్తమ కార్యనిర్వహణ పద్ధతులను పాటించకపోవడం వల్ల వాటి నుంచి టీకాలు కొనడం ఆపేశామని కేంద్రం సాకు చెప్పగా, దాన్ని ఒక పార్లమెంటరీ కమిటీ తప్పు పట్టింది. ఈ మూడు పీఎస్‌యూలను మళ్లీ తెరవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గత్యంతరం లేక 2012లో వాటిని మళ్లీ తెరచినా 2019 వరకు ఖాళీగా ఉంచారు. 2012లో చెన్నై సమీపంలో రూ.900 కోట్ల వ్యయంతో ఏడాదికి 58.5 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సమగ్ర టీకా తయారీ కాంప్లెక్స్‌ నిర్మించినా... కేంద్రం ఇప్పటికీ తాళాలు బిగించి కూర్చుందే తప్ప, టీకా తయారీకి అనుమతించలేదు.

టీకాల కొరత తీర్చడానికి ప్రభుత్వం పీఎస్‌యూలకు ఆర్డరు పెట్టి, వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకొనేలా ఆదేశించాలని ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ప్రస్తుతం మూతపడిఉన్న పీఎస్‌యూలను పునరుద్ధరించి స్వయం ప్రతిపత్తినిచ్చి టీకా ఉత్పత్తిని పునఃప్రారంభించాలని 2010లోనే జావీద్‌ చౌధరి కమిటీ సిఫార్సు చేసింది. దాన్ని తక్షణం అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తాజా పిటిషన్‌ సుప్రీంకోర్టును కోరింది. మంచి నాణ్యత, సరసమైన ధరలకు టీకాలు అందించగల పీఎస్‌యూలన్నింటికీ ఆర్డర్లు ఇవ్వాలని పిటిషనర్లు డిమాండ్‌ చేశారు. ఒకప్పుడు బాలల్లో ఆరు వ్యాధుల నియంత్రణకు కావలసిన టీకాల్లో 80-85 శాతాన్ని, అదీ ఒక్కో డోసు 30 రూపాయలకు సరఫరా చేసిన మూడు పీఎస్‌యూలు ఇప్పుడు పనిలేక మూలపడ్డాయి. ప్రభుత్వం చెల్లించే అతి తక్కువ ధరలతో అవి నెట్టుకురాలేకపోయాయి. అయిదేళ్ల తరవాత అవే టీకాలకు ప్రభుత్వం 250 శాతం ఎక్కువ ధరలు చెల్లించింది. వ్యాక్సిన్‌ పీఎస్‌యూల ఆయుష్షు తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసినట్లుంది. దాని ఫలితాన్ని ఇప్పుడు జాతి అనుభవిస్తోంది.

సృజన, పరిశోధనల మేళవింపు అవసరం

నేడు భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ మాత్రమే కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతానికి సీరం గరిష్ఠంగా నెలకు 6.5 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ఒక కోటి డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. వచ్చే అక్టోబరుకల్లా భారత్‌ బయోటెక్‌ నెలకు 10 కోట్ల డోసుల చొప్పున, సీరం 11 కోట్ల డోసుల చొప్పున టీకాలు ఉత్పత్తి చేస్తాయని కేంద్రం చెబుతోంది. హాఫ్‌కిన్‌, ఇండియన్‌ ఇమ్యునాలజికల్స్‌, భారత్‌ ఇమ్యునాలజికల్‌ అనే మూడు పీఎస్‌యూలు లైసెన్సుపై నెలకు నాలుగు కోట్ల కొవాగ్జిన్‌ డోసులు అందిస్తాయి. స్పుత్నిక్‌, జైడస్‌ క్యాడిలా వంటి సంస్థలన్నీ కలిసి ఏడాది చివరికల్లా 200 కోట్లకుపైనే డోసులు తయారుచేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, అప్పటికి కరోనా మహమ్మారి వల్ల ఎంతో నష్టం జరిగే ప్రమాదముంది. భారత ప్రభుత్వం దేశ జనాభాను, ప్రైవేటు టీకా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని ముందుగానే బేరీజు వేసుకుని, పీఎస్‌యూలను రంగంలోకి దించాల్సింది. ఫార్మా పీఎస్‌యూలలో కొవిడ్‌ టీకాల ఉత్పత్తికి వీలుగా మార్పుచేర్పులు చేసి వ్యాక్సిన్ల ఉత్పత్తికి సిద్ధం చేయాల్సింది. విదేశీ సంస్థలతోపాటు జైడస్‌ క్యాడిలా, జెనోవా వంటి స్వదేశీ కంపెనీల నుంచి కూడా టీకా తయారీ పరిజ్ఞానాన్ని పీఎస్‌యూలకు బదిలీ చేయాలి. వేగంగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే, ప్రస్తుత టీకాలలో ఎప్పటికప్పుడు మార్పులు చేయాలి. అందుకోసం పరిశోధన చేసే సత్తా- ప్రభుత్వ రంగ సంస్థలకే ఉంటుంది. ప్రైవేటు రంగ ఉత్పత్తి, ప్రభుత్వ రంగ సృజనాత్మక సామర్థ్యాలను మేళవిస్తే రేపటి ఆర్థిక విజృంభణలో సంపన్న దేశాలకు దీటుగా నిలవవచ్చు.

- ఆర్య

ఇవీ చదవండి: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2 స్థానాల దిగువకు భారత్​

:'రైళ్లలో టికెట్​ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.