ETV Bharat / opinion

మహమ్మారితో మానసిక కల్లోలం.. స్థైర్యమే విరుగుడు!

మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చివేసిన కరోనాతో తీవ్ర మానసిక సమస్యలు ఎదురవుతున్నట్లు అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. మానసిక కల్లోలానికి గురవుతూ.. వ్యాధి సోకుతుందేమోనన్న భయాలతో సతమతం అవుతున్నారు చాలామంది. ఉద్యోగం కోల్పోవడం, సొంతవారికి దూరంగా ఉండటం వంటి అనేక సమస్యలు ఎందరినో మానసికంగా కుంగదీస్తున్నాయి. చివరకు ఈ ధోరణి ఆత్మహత్యలకు దారితీస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే జీవనశైలి మార్పులతో స్థైర్యాన్ని కూడగట్టుకుని సరికొత్త జీవితాన్ని ఆరంభించడమే అసలైన పరిష్కారం అంటున్నారు నిపుణులు.

corona pressure
మానసిక కల్లోలం
author img

By

Published : May 1, 2021, 8:36 AM IST

కరోనా మహమ్మారివల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితులు అందర్నీ వేధిస్తున్నాయి. నలుగురిలో మెసలే అవకాశం లేకపోవడం, భౌతిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధం వంటి నిబంధనలు పౌరుల్లో మానసికంగా ఒత్తిడి పెంచుతున్నాయి. సమాజంలో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. వ్యాక్సిన్‌ వంటివి వచ్చేసినా.. మన దేశ జనాభా అధికంగా ఉన్న కారణంగా అవి అందరికీ అందడంలో జాప్యం జరుగుతోంది. ఈలోగా ఆందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. జీవన శైలిని మార్చుకోవాలి. మహమ్మారి సృష్టిస్తున్న వ్యాకులతకు అడ్డుకట్ట వేసే దిశగా ఆహారం, ఆరోగ్యాలపట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రమాదం కన్నా, ఏదో జరుగుతుందన్న భయమే మానసికంగా మనిషికి ఎక్కువ కీడు చేస్తుంది. మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది.

మానసిక దృఢత్వమే మందు..

కొందరిలో మానసిక దౌర్బల్యం ఎక్కువ కావడంతో- విచక్షణ కోల్పోయి, ఆత్మహత్యవంటి విపరీత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసిక సన్నద్ధతను పెంపొందించుకోవాలి. మానసిక ఆందోళనకు ప్రధాన కారణం అభద్రత. మన సమాజంలో ఎక్కువగా ఇంటి పెద్ద మాత్రమే ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటాడు. కొవిడ్‌ కాలంలో పెరుగుతున్న వైద్య వ్యయాలను భరించలేక పోవడం, కుటుంబ సభ్యుల పట్ల ఆందోళన, తనకు ఏదైనా జరిగితే వారు ఏమైపోతారో అన్న వ్యాకులత ఇంటి పెద్ద ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.

ఖర్చుకు బడ్జెట్​తో చెక్..

ఇక గృహిణి కుటుంబ సభ్యుల ఆహార, ఆరోగ్య అవసరాలు తీర్చడంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. మరోవైపు కొవిడ్‌ సృష్టించిన సంక్షోభంవల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం తగ్గడంతో పాటు వ్యయాలు పెరిగాయి. శానిటైజర్‌, ముఖ మాస్కులు వంటి వాటికి పెట్టే ఖర్చు అనివార్యమయింది. సామాన్యుడికి ఇది పెను భారమే. ఈ పరిస్థితులను తట్టుకునేందుకు- కుటుంబ సభ్యులందరూ ఆర్ధిక పరిస్థితులను గురించి విపులంగా చర్చించుకుని, ఖర్చులను అదుపులో పెట్టుకునే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. తద్వారా పెద్దలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా పిల్లలు సైతం తమ గృహ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించడం అలవరచుకుంటారు. మరోవైపు ఇలాంటి చర్యలవల్ల 'మన కుటుంబం' అన్న భావన ద్వారా వారు మానసికంగా బలవంతులుగా అవుతారు.

ఒత్తిడి దరిచేరకుండా..

మన పూర్వీకులు జీవనం చక్కగా సాగడానికి కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు నిర్దేశించారు. ధ్యానం, సూర్యనమస్కారాలు తదితరాలు చేయడంవల్ల నేటి తరానికి మంచి అలవాట్లు నేర్పినట్లవుతుంది. నిత్యావసరాల కొనుగోలుకై అవసరం అయినప్పుడు అందరూ బైటకు వెళ్లడం కాకుండా కదలికలను నిరోధించుకోవాలి. గృహంలో పనులను అందరూ పంచుకుని చేయడంవల్ల గృహిణులపై ఒత్తిడి పెరగకుండా నిరోధించవచ్చు. ఉద్యోగ, వ్యాపార కారణాలతో బయటకు వెళ్లి వచ్చేవారు- ఇంటికి రాగానే తలస్నానం చేయడం వంటి అలవాట్లను పాటించాలి. కరోనా వైరస్‌ వ్యాప్తికి తావివ్వని ఇలాంటి జీవన విధానాన్ని అవలంబించడం ఇప్పటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. రెండోసారి కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి విస్తృతివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఈ సమయంలో విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను కనుగొని వెలికితీసి ప్రోత్సహించాలి.

అనుబంధాల లోగిళ్లతో ఒత్తిడి దూరం..

ఇంట్లో ఉన్న వృద్ధులతో సమయాన్ని గడపడం ద్వారా వారి అనుభవాల నుంచి విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మానవుడు స్వతహాగా సంఘజీవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతరులతో కలవడం సరైనది కాదు కాబట్టి.. వివిధ మాధ్యమాల ద్వారా ప్రేమానురాగాలను పంచుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా రక్కసి కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు సరైన పరిజ్ఞానంతో మానసిక దృఢత్వాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది.

తాజా ఆహారమే మేలు..

ఉబ్బసం, న్యూమోనియా డయాబెటిక్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తలను తీసుకోవాలి. ధ్యానం లాంటివి ఇటువంటి సమయంలో బాగా ఉపయోగపడతాయి. సెరటోనిన్‌, డోపమైన్‌, ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు సంతోషదాయక హార్మోన్లు. ఇవి ఆనందం, ప్రేమ వంటి సానుకూల భావాలను పెంపొందిస్తాయి. ఇవి ఉత్పన్నం కావాలంటే కొంచెం వ్యాయామం, మనసారా నవ్వడం, ఇష్టమైన వ్యాపకాలను చేపట్టడంవంటివి కీలకం. వీటితో పాటు ఉన్నంతలో తాజా ఆహారాన్ని తీసుకొని, శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడమూ ముఖ్యమే. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని, మానసిక బలాన్ని పొంది, ఆందోళన, వ్యాకులతలకు దూరంగా ఉండి ఒత్తిడిని జయించాల్సిన అవసరం ఉంది.

మానవ పరిణామ క్రమంలో ఎన్నో వ్యాధులు, మహమ్మారులు చుట్టుముట్టాయి. మానవ సమాజం అన్నిటినీ ఎదుర్కొంటూ అభ్యున్నతి వైపు అడుగులు వేసుకుంటూ వచ్చింది. ఈ మహమ్మారినీ అదే స్థైర్యంతో పారదోలగలగాలి!

- షణ్మితా రాణి

(బెంగళూరులోని నిమ్హాన్స్‌లో సైకాలజీ కౌన్సెలర్‌)

ఇవీ చదవండి: కరోనా భయాలు- సాంత్వనకు మార్గాలు

మానసికంగా కుంగదీస్తున్న కరోనా మహమ్మారి

భయపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది: మానసిక వైద్య నిపుణుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.