ETV Bharat / opinion

ఆ ఎంపీలకు ఏడుగురు సంతానం.. మరి 'జనాభా నియంత్రణ' ఎలా?

Population Control Bill: దేశంలో జనాభా నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. టూ ఛైల్డ్ పాలసీకి మద్దతుగా బిల్లు తీసుకొస్తున్నట్లు భాజపా ఎంపీ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి, బిల్లు పార్లమెంట్ గడప దాటుతుందా? ఇద్దరికి మించి సంతానం ఉన్న ఎంపీల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీనిపై ఏమంటోంది?

Population Control Bill
Population Control Bill
author img

By

Published : Jul 25, 2022, 4:58 PM IST

Population control bill pros and cons: జనాభా నియంత్రణపై ప్రముఖ నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. జనాభాను కట్టడి చేసేందుకు బిల్లును తీసుకొస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటనపై.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన రవి కిషన్.. ఏ నైతిక బాధ్యతతో ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చర్చల సంగతి పక్కనబెడితే.. నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవడం ముఖ్యం. జనాభా నియంత్రణ బిల్లు నిజంగానే తీసుకొస్తున్నారా? దీని వల్ల లాభమా? నష్టమా? దీనికి ఎంపీల నైతిక విలువలకు సంబంధం ఉందా? అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

జనాభా నియంత్రణ బిల్లు గురించి పరిశీలిస్తే...
జనాభా నియంత్రణ బిల్లును 2019లో భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా ప్రతిపాదించారు. ప్రైవేటు బిల్లు రూపంలో దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దంపతులు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను కనకుండా నిరోధించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం, సబ్సిడీలను తొలగించడం, ప్రభుత్వం అందించే సర్వీసులు, సౌకర్యాలకు దూరం చేయడం వంటివి ఇందులో కీలక అంశాలు. ఇలాంటి బిల్లునే తాను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా రవి కిషన్ ప్రకటించారు.

ప్రభుత్వ వైఖరి ఏంటి?
జనాభా నియంత్రణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇలాంటి బిల్లును తీసుకొచ్చే యోచన ఏదీ తమ వద్ద లేదని పార్లమెంట్ సాక్షిగా గతంలోనే వెల్లడించింది. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం 2019-21 మధ్య దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0కు పడిపోయిందని కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఐదు రోజుల క్రితమే పార్లమెంట్​లో స్పష్టం చేశారు. ఇది జనాభా భర్తీ స్థాయి కంటే తక్కువేనని చెప్పారు. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలోనే 2019లో తన బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఎంపీ రాకేశ్ సిన్హా 'ఈటీవీ భారత్'తో వెల్లడించారు.

ఎంపీలకు వర్తించదా?
అయితే, ఎంపీ రవి కిషన్ చేసిన తాజా ప్రకటనతో జనాభా నియంత్రణ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లైంది. ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్​ను పక్కనబెడితే.. రాజకీయ నేతల నైతికతపై నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చట్టాన్ని రూపొందించే సభ్యులు.. ఇద్దరు పిల్లల నిబంధనకు కట్టుబడే ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్​పై నెటిజన్లు ఫైర్​.. నలుగురు పిల్లలున్నారంటూ..!

ఎంపీల సంతానం ఇలా..
ఈ విషయంపై దృష్టిసారించిన ఈటీవీ భారత్.. ఎంపీల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించింది. లోక్​సభ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 543 ఎంపీలు ఉండగా.. అందులో 303 మంది భాజపా, 53 మంది కాంగ్రెస్, 24 మంది డీఎంకే, 23 మంది తృణమూల్ కాంగ్రెస్​కు చెందినవారు ఉన్నారు. మొత్తం 543 మంది ఎంపీలలో 171 మంది ఎంపీలకు ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నట్లు స్పష్టమైంది. ఇందులో భాజపా వాటా 107. కాంగ్రెస్​ ఎంపీల్లో 10 మందికి ఇద్దరికి మించి సంతానం ఉన్నారు.

39 మంది భాజపా ఎంపీలకు నలుగురికన్నా ఎక్కువ సంతానం ఉండటం ఆసక్తికరమైన విషయం. మిగిలిన పార్టీల ఎంపీల్లో 25 మందికి నలుగురి కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నారు. ఓ ఎంపీకి ఆరుగురు సంతానం ఉండగా.. ముగ్గురు ఎంపీలు- ఏఐయూడీఎఫ్​కు చెందిన మౌలానా బద్రుద్దీన్, అప్నాదళ్​ ఎంపీ పకౌడీ లాల్ కోల్, జేడీయూకు చెందిన దిలేశ్వర్ కామైత్-లకు ఏడుగురు చొప్పున సంతానం కలిగి ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో సభలో బిల్లు ప్రవేశపెట్టినా.. ముగ్గురు, నలుగురు సంతానం ఉన్న సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటేయగలరా అన్నది ప్రధాన ప్రశ్న.

ఇదీ చదవండి: చైనాలో జనాభా సంక్షోభం... పిల్లల్ని కనేందుకు ముందుకు రారే?

విభజన మంత్రమే!
అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం వెనక.. జనాభాను నిజంగానే నియంత్రించాలన్న ఉద్దేశం లేదని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్​తో పాటు దేశప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. 'ఇటువంటి అంశాలపై చర్చ ప్రారంభం కాగానే.. వెంటనే జనాలలో విభజన జరుగుతుంది. ఏదో రకంగా ఇది భాజపాకు కలిసి వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది' అని వినోద్ అగ్నిహోత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నైతికత ప్రశ్నే లేదు!
నైతికత విషయంపై మరో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు యోగేశ్ మిశ్ర మాట్లాడారు. రాజకీయాలకు, నైతికతకు ముడిపెట్టడాన్ని పూర్తిగా ఖండించారు. రాజకీయాల్లో నైతికతకు, నియమాలకు చోటే లేదని తేల్చిచెప్పారు. 'రాజకీయ నాయకులు బహిరంగంగానే అవినీతికి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినా పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధపడని మంత్రుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాజకీయాల్లో నైతికతకు తావులేదు' అని చెప్పుకొచ్చారు.

బిల్లు అసలే రాదని అనలేం!!
అయితే, జనాభా నియంత్రణ బిల్లు అసలు రాబోదని చెప్పలేం. ఈ బిల్లు ఎవరు ప్రవేశపెడుతున్నారనే విషయం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు బిల్లులు కాకుండా ప్రభుత్వమే బిల్లు తీసుకొస్తే.. అప్పుడు దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు. గతంలో 'టూ ఛైల్డ్' పాలసీ బిల్లు 30కన్నా ఎక్కువసార్లు పార్లమెంట్​ ముందుకు వచ్చింది. ఒక్కసారి కూడా దీనికి ఏ సభలోనూ అంగీకారం లభించలేదు.

అయితే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఇలాంటి బిల్లు తీసుకురావాలని పట్టుబడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా ఆ పార్టీ కీలక నేతలు జనాభా నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భాజపాకు పార్లమెంట్ ఉభయసభల్లో మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వమే బిల్లును తీసుకొస్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం!

ఇదీ చదవండి: వచ్చే ఏడాది చైనాను దాటి మనమే నెం.1.. ఏ విషయంలో అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.