ETV Bharat / opinion

హక్కులు అపహాస్యం పాలు- చట్టాలకు వక్రభాష్యాలు - education laws implementation

పల్లెల్లో పేదరికాన్ని పారదోలడానికి ఉద్దేశించిన గ్రామీణ ఉపాధి హామీ చట్ట నిబంధనలను ఇప్పటికీ సక్రమంగా పాటించకపోవడం పెద్ద సమస్య. ఈ చట్టంలోని 3(1) సెక్షన్‌ ప్రకారం శారీరక శ్రమ తప్ప.. ఎటువంటి నైపుణ్యాలూ అవసరం లేని పనులను చేయడానికి ముందుకొచ్చే వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో '100 రోజులకు తగ్గకుండా' పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ '100 రోజులకు తగ్గకుండా' అనే పదబంధం చాలా కీలకమైంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాకారం కావాలంటే కొవిడ్‌ వల్ల దారుణంగా దెబ్బ తిన్న విద్య, ఉపాధి అవకాశాలను మళ్లీ వేగంగా గాడిన పెట్టాలి.

perversions of education and employment laws
హక్కులు అపహాస్యం పాలు.. విద్య, ఉపాధి చట్టాలకు వక్రభాష్యాలు
author img

By

Published : Aug 31, 2020, 8:41 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ సాకారం కావాలంటే కొవిడ్‌ వల్ల దారుణంగా దెబ్బ తిన్న విద్య, ఉపాధి అవకాశాలను మళ్లీ వేగంగా గాడిన పెట్టాలి. ఇందుకు 2005నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, 2009 నాటి విద్యా హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలుచేయడం అత్యంత ఆవశ్యకం. పల్లెల్లో పేదరికాన్ని పారదోలడానికి ఉద్దేశించిన గ్రామీణ ఉపాధి హామీ చట్ట నిబంధనలను ఇప్పటికీ సక్రమంగా పాటించకపోవడం పెద్ద సమస్య. ఈ చట్టంలోని 3(1) సెక్షన్‌ ప్రకారం శారీరక శ్రమ తప్ప.. ఎటువంటి నైపుణ్యాలూ అవసరం లేని పనులను చేయడానికి ముందుకొచ్చే వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో '100 రోజులకు తగ్గకుండా' పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ '100 రోజులకు తగ్గకుండా' అనే పదబంధం చాలా కీలకమైంది. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు ఉంటే ఇంతకన్నా ఎక్కువ రోజులు కూడా పని కల్పించవచ్చునని పార్లమెంటు ఉద్దేశం. 'కనీసం' 100 రోజులకు తగ్గకుండా పని కల్పించాలని చట్టం నిర్దేశిస్తుంటే, 'గరిష్ఠం' 100 రోజులనే అర్థంలో ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజలు కూడా అదే అభిప్రాయం ఏర్పరచుకున్నారు. పోనీ, కనీసం 100 రోజుల పనైనా చూపిస్తున్నారా అంటే, అదీ లేదు.

లోపించిన చిత్తశుద్ధి

గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఏటా సగటున కల్పిస్తున్న పని దినాల సంఖ్య 45-50కి మించడం లేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలనే చిత్తశుద్ధి అధికార యంత్రాంగంలో లోపించడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. పేదలు కోరిన 15 రోజుల్లోపు పనులు చూపించలేకపోతే, వారికి నిరుద్యోగ భృతి కల్పించాలన్న చట్ట నిబంధననూ అధికారులు పట్టించుకోవడం లేదు. 2020 జనవరిలో కేరళలో అనూహ్యంగా భారీ వరదలు విరుచుకుపడినప్పుడు 100 రోజులకుపైనే పనులు చూపారు. ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తే తప్ప చట్టాన్ని సక్రమంగా అమలు చేయర..- అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. 3 (1) సబ్‌ సెక్షన్‌ నిర్దేశించిన ప్రకారం 100 రోజులకు తగ్గకుండా పనులు చూపిస్తూనే- కేంద్రం, రాష్ట్రాలు తమ ఆర్థిక స్తోమత, అభివృద్ధి అవసరాలను బట్టి అంతకన్నా ఎక్కువ రోజులే పేదలకు పనులు కల్పించవచ్చునని 3 (4) సబ్‌ సెక్షన్‌ నిర్దేశిస్తోంది. దేశ అభివృద్ధి ఫలాలను పేదలకూ పంచడం ధర్మం, న్యాయం. తదనుగుణంగా ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును పెంచవలసి ఉన్నా, అవి ఏటా తగ్గిపోతున్నాయి. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపు 13శాతం మేర తగ్గిపోయింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40,000 కోట్ల నిధులు కేటాయించడం బాగానే ఉన్నా, కనీస పని దినాలను 100రోజులకన్నా ఎక్కువకు పెంచాలనే ఊసే లేకపోవడం విచారకరం.

అరకొరగా అమలవుతున్న మరో శాసనం.. 2009నాటి విద్యాహక్కు చట్టం. ఈ చట్టం చేయడానికి చాలాముందే, 1992లో మోహినీ జైన్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులో విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. 1993నాటి ఉన్నికృష్ణన్‌, జె.పి.వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో 14 ఏళ్ల వయసు వరకు ఉచితంగా, తప్పనిసరిగా విద్యను పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. 45వ రాజ్యాంగ అధికరణ ప్రాథమిక హక్కు హోదా సంతరించుకొందని పేర్కొంది. ఆపైన దాదాపు దశాబ్ద కాలానికి, 2002లో పార్లమెంటు ఆమోదించిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం కొత్తగా 21ఏ అధికరణను ప్రవేశపెట్టింది. 6-14 ఏళ్ల వయసు బాలలందరికీ ఉచితంగా, తప్పనిసరిగా విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆ అధికరణ స్పష్టీకరించింది. ఆ తరవాత ఎనిమిదేళ్లకు బాలలకు ఉచితంగా, తప్పనిసరిగా విద్యను పొందే హక్కును కల్పించే విద్యాహక్కు (ఆర్‌టీఈ) చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.

మారిన 'అన్వయాలు'

ఈ చట్టంలోని 12(1) సి సెక్షన్‌ ప్రకారం ఒక తరగతిలో ‘కనీసం’ 25శాతం సీట్లను బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ‘కనీసం’ అనే పదాన్ని ‘గరిష్ఠం’ అనే అర్థంలో రాష్ట్రాల విద్యాశాఖలు, ప్రైవేటు విద్యాసంస్థలు అన్వయిస్తున్నాయి. ప్రతి ప్రైవేటు విద్యాసంస్థలో ఈ 25శాతం ఆర్‌టీఈ సీట్లకు లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాథమిక విద్యాశాఖ వెబ్‌సైట్‌ ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం ఆర్‌టీఈ కోటా కింద మొత్తం 2,73,070 సీట్లు అందుబాటులో ఉన్నట్లు చూపుతోంది. ఈ ఏడాది ఈ కోటా కింద కేవలం 59,656 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. మూడో విడత ప్రవేశాలు ఇంకా పూర్తి కావలసి ఉన్నా, చివరకు కోటా లోని సీట్లు అన్నీ భర్తీ కావని వేరే చెప్పాలా? రాజ్యాంగం బాలలకు ప్రసాదించిన విద్యాహక్కు ఈ విధంగా అపహాస్యం పాలవుతోంది. ఇకనైనా రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయడం అత్యంత ఆవశ్యకం.

-సందీప్‌ పాండే (రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

ఇదీ చూడండి: 'రాహుల్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్‌ నాశనమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.