ETV Bharat / opinion

వ్యక్తిగత గోప్యతకు తూట్లు- పెండింగులోనే బిల్లు

దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార పరిరక్షణ(పీడీపీ) బిల్లును(Personal data protection bill) కేంద్రం 2018లో తెరపైకి తెచ్చింది. మూడేళ్లు గడుస్తున్నా ఇది పార్లమెంటు గడప దాటలేదు. గతేడాది ఇది సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందుకు వెళ్ళింది. ఆ కమిటీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు చేసింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా బిల్లు చట్టరూపం దాలుస్తుందా? అనేది అనుమానమే!

PERSONAL DATA PROTECTION BILL
వ్యక్తిగత గోప్యత
author img

By

Published : Nov 6, 2021, 8:21 AM IST

బ్యాంకు ఖాతాలో డబ్బులుంటే చాలు- జేబులో రూపాయి లేకపోయినా ఎంతటి లావాదేవీని అయినా ఫోను సాయంతో పూర్తి చేసే సౌలభ్యాన్ని సాంకేతికత మనముందుకు తెచ్చింది. ఈ ప్రక్రియలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటికి పొక్కి ఏ హ్యాకర్‌ బారినోపడితే బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. లేదంటే ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ వంటివి ఎవరెవరికో అందుబాటులోకి వెళ్ళి వ్యక్తిగత స్వేచ్ఛకు(Personal Privacy) ఇబ్బంది కలగవచ్చు. ఈ ఏడాది మార్చిలో మొబీక్విక్‌ వాడుతున్న దాదాపు 35 లక్షల మంది వినియోగదారుల సమాచారం బయటకు పొక్కింది. 99 లక్షల మందికిపైగా ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, కార్డుల సమాచారం బహిర్గతమయ్యాయి. దీనిపై నేటికీ ఎలాంటి చర్యలూ లేవు. వినియోగదారుల సమాచార పరిరక్షణకు సరైన చట్టాలు లేకపోవడం వల్లే ఇటువంటి అనర్థాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ మాటకు అర్థమేంటి?

రెండేళ్ల క్రితం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని తొమ్మిది లక్షల మంది రైలు ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలతో సహా బహిర్గతమయ్యాయి. ఎయిర్‌ ఇండియా ప్రయాణికుల సిస్టమ్‌ ప్రొవైడర్‌ అయిన స్విట్జర్లాండ్‌ కంపెనీ 'సిటా' సర్వర్‌ నుంచి కొన్నాళ్ల కిందట 45 లక్షల విమాన ప్రయాణికుల ఊరు, పేరు, పాస్‌పోర్టు, ఫోన్‌ నంబర్లు, టికెట్లు కొనడానికి ఉపయోగించిన క్రెడిట్‌ కార్డుల వివరాలు బయటికొచ్చాయి. నిరుడు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సర్వర్‌పై సైబర్‌ దాడులు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలు ఒక రోజంతా నిలిచిపోయాయి. ఒక ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ తెలిస్తేనే సైబర్‌ నేరగాళ్లు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. ఏకంగా క్రెడిట్‌కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ సమాచారం సైతం అంగడి సరకైపోతే సమాచార భద్రత అనే మాటకు అర్థమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారమూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీన్ని నిగ్గు తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఓ కమిటీని నియమించింది.

పరిరక్షించడమే లక్ష్యంగా

వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని జస్టిస్‌ పుట్టస్వామి కేసులో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. ఒక వ్యక్తికి సంబంధించిన ఏ అంశాన్నయినా వారికి తెలియకుండా సేకరించడం, వారి సంభాషణను చాటుగా వినడం గోప్యతకు భంగం కలిగించడమే. రోజువారీ వ్యవహారాల్లో సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్దీ పౌరుల వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార పరిరక్షణ(పీడీపీ) బిల్లును(Personal data protection bill) కేంద్రం 2018లో తెరపైకి తెచ్చింది. మూడేళ్లు గడుస్తున్నా ఇది పార్లమెంటు గడప దాటలేదు. దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాలు, ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగదారుల సమాచారాన్ని విదేశాలకు అమ్ముకోకుండా కట్టుదిట్టం చేయాలన్న లక్ష్యంతో ఈ బిల్లు రూపుదిద్దుకుంది. గతేడాది ఇది(Personal data protection bill) సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)(Pdp Bill Jpc) ముందుకు వెళ్ళింది. ఆ కమిటీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు చేసింది. వచ్చేపార్లమెంట్‌ సమావేశాల్లోనైనా బిల్లు చట్టరూపం దాలుస్తుందా అనేది అనుమానమే!

సమాచార రక్షణ బిల్లు-2021గా మారి..

సమాచారం బయటికి పొక్కకుండా గట్టి చర్యలు తీసుకునే యంత్రాంగం గురించి పీడీపీ బిల్లులో ప్రస్తావించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యక్తిగతమే కాకుండా ఇతరత్రా సమాచారం సైతం కీలకమైనదేనని, ఇలాంటివి బహిర్గతమైనా ప్రమాదమేనని గుర్తు చేస్తున్నాయి. దాన్నిసైతం కలిపి ఈ బిల్లును మరింత పటిష్ఠంగా మార్చాల్సి ఉంది. అప్పుడు ఇది వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు అని కాకుండా, సమాచార రక్షణ బిల్లు-2021 అని మారి, అదే పేరుతో చట్టంగా రూపొందాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ ప్రాధికార సంస్థ ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఆధార్‌ కార్డు నుంచి ఆరోగ్యసేతు యాప్‌లో నమోదు వరకు పౌరుల సమాచారాన్ని సర్కారే విస్తృతంగా సేకరించిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. దేశ రక్షణ, సార్వభౌమాధికారం పేరు చెప్పి ప్రజల సమాచారాన్ని ప్రభుత్వమే అడిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ ప్రాధికార సంస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినీ దీనికి బాధ్యులను నియమించాలని సూచిస్తున్నాయి. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు వందకు పైగా దేశాల్లో చట్టాలున్నాయి. వ్యక్తిగత సమాచార భద్రతను భారత్‌ సైతం తక్షణావసరంగా గుర్తించి, చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలి. ప్రజలు సైతం తమ వ్యక్తిగత సమాచార పరిరక్షణలో అప్రమత్తతతో వ్యవహరించడం తప్పనిసరి.

- శిశిర

ఇదీ చూడండి: వ్యక్తిగత గోప్యత.. గాలిలో దీపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.