ETV Bharat / opinion

ధరల ధాటికి కుంగుతున్న నిర్మాణాలు! - నిర్మాణ రంగ వ్యయం కరోనా ప్రభావం

ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా 'అందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రకటించింది కేంద్రం. అయితే కరోనా సంక్షోభంతో పెరిగిపోయిన నిర్మాణ రంగ సామగ్రి ధరలతో ఆ పథక లక్ష్యం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది.

own house
ధరల ధాటికి కుంగుతున్న నిర్మాణాలు
author img

By

Published : Jul 4, 2021, 8:19 AM IST

కొవిడ్‌ సంక్షోభానికి తోడు భారీగా పెరిగిన ఉక్కు, సిమెంట్‌ ధరలు నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రతి వస్తువు ధరా గత రెండేళ్లలో 30 నుంచి 60శాతం పెరిగింది. ముఖ్యంగా సిమెంట్‌, ఉక్కు ధరలు 2020 తరవాత దాదాపు 40 నుంచి 60శాతం అధికమై ఆ రంగం నడ్డి విరిచాయి. కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తి అనంతరం 'అందరికీ ఇళ్లు' పథకాన్ని కేంద్రం ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగం చేసింది. ఈ పథకానికి రూ. 1.72 లక్షల కోట్లు కేటాయించింది. కొవిడ్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనం కావడం, ఉపాధి అవకాశాలు పడిపోవడం, భారీ నిరుద్యోగిత, నిర్మాణ రంగ సామగ్రి ధరలు చుక్కలను తాకడంతో అందరికీ ఇళ్ల పథకం లక్ష్యాల సాధన కుంటువడింది.

నాణ్యతపై ప్రభావం

పక్కా నిర్మాణాలకు ఉక్కు, సిమెంటు అత్యంత కీలకం. రెండేళ్లుగా వాటి ధరలకు రెక్కలొచ్చి సామాన్యులకు అందనంత దూరాలకు చేరిపోయాయి. గత సంవత్సరం మార్చిలో రూ.260-270 మధ్య ఉన్న 50 కిలోల సిమెంటు బస్తా నేడు దాదాపు రూ.420కు చేరింది. టన్ను ఉక్కు ధర రూ.42 వేల నుంచి రూ.61 వేలకు పెరిగింది. ఇదే సమయంలో కరోనా కారణంగా ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. దీంతో సొంతంగా చేపట్టిన నిర్మాణాలతో పాటు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో సాగుతున్నవీ దాదాపు నలభై శాతం నిలిచిపోయాయి. తెలంగాణలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన రెండు పడక గదుల నిర్మాణంలో పూర్తయినవి 35శాతమే. ఇప్పటికీ దాదాపు 20శాతం ఇళ్లు ప్రారంభమే కాలేదు. స్టీలు, సిమెంటు ధరల పెరుగుదలే దీనికి కారణమని గుత్తేదారులు వాపోతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక, కలప, విద్యుత్‌, టైల్స్‌ వంటి వస్తువుల ధరలు 20 నుంచి 40శాతం మేర పెరగడంతో బిల్డర్లు చవక రకానివి వాడుతున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు భారీగా పెరిగిన ధరలతో ప్రాజెక్టులు పూర్తి చేయడమే కష్టంగా మారిందన్నది నిర్మాణదారుల మాట. ముడి ఖనిజం ధరలు, రవాణా ఛార్జీలు ఎక్కువ అవడంతో ఆ మేరకు ఇవీ పెరిగాయని ఉక్కు, సిమెంటు కంపెనీలు చెబుతున్నాయి. ఉక్కు సంస్థల వాదనలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే తూర్పారబట్టారు. దేశంలోని ప్రధాన ఉక్కు సంస్థలన్నింటికీ సొంత గనులు ఉన్నాయని, వారు ధరలు పెంచిన సమయంలో కార్మికుల వేతనాల్లో గాని, విద్యుత్‌ ఛార్జీల్లో గాని ఎలాంటి మార్పులూ లేవని, సంస్థలు కుమ్మక్కై ధరలు పెంచేశాయని విస్పష్టంగా ప్రకటించారు.

సర్కారీ ప్రాజెక్టులకు ఉత్పత్తిదారులు తక్కువ ధరకు సిమెంటు సరఫరా చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఏది ఏమైనా పెచ్చరిల్లుతున్న ధరలతో నిర్మాణ రంగమే కాదు, దాని అనుబంధ రంగాల వృద్ధిపైనా ప్రభావం పడుతోంది.

గుత్తాధిపత్యమే కారణం

చైనా తరవాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ నిలుస్తుంది. 2019 నాటికి ప్రపంచ సిమెంటు ఉత్పత్తిలో ఎనిమిది శాతం మనదేశంలోనే జరుగుతోంది. 98శాతం ఉత్పత్తి ప్రైవేటులో సాగుతుండగా, రెండు శాతమే ప్రభుత్వ రంగం నుంచి వస్తోంది. దేశవ్యాప్తంగా 210 పెద్ద సిమెంటు కర్మాగారాలున్నా 20 సంస్థలే 70శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ధరల పెరుగుదలకు పెద్ద సంస్థల గుత్తాధిపత్యమే కారణమని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. కావాలనే ఉత్పత్తి తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను ఇష్టానుసారం పెంచుతున్నారని, దీని వల్ల ప్రాజెక్టుల వ్యయం తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. మరోవైపు- నిర్మాణదారులు చదరపు అడుగుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు లాభాలు వేసుకోవడంవల్లే ఫ్లాట్లు, ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

ఇనుప ఖనిజం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో కంటే ఇక్కడ తక్కువగా ఉన్నా, ఉక్కు ధరల్ని అంతర్జాతీయ ధరలతో సమానంగా పెంచేశారని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మినరల్‌ ఇండస్ట్రీస్‌ (ఫిమి) పేర్కొంటోంది. ఉక్కు, సిమెంట్‌ ధరలు పట్టపగ్గాలు లేకుండా పెరగడం వల్ల పేద, మధ్య తరగతి వారి సొంతింటి కలలు కల్లలవుతాయి. ఉక్కు, సిమెంట్‌ కంపెనీలపై నియంత్రణకు ఒక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి గడ్కరీ సూచిస్తున్నారు. ఈ మేరకు దాన్ని పట్టాలెక్కించడానికి కేంద్రం సత్వరం చర్యలు తీసుకోవాలి.

నిర్మాణ రంగానికి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలగాలంటే పటిష్ఠ చర్యలకు కేంద్రం సత్వరం పూనుకోవాలి. అప్పుడే అందరికీ గృహ యోగం సాకారమయ్యే అవకాశాలు ఇనుమడిస్తాయి.

రచయిత- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.