ETV Bharat / opinion

ప్రేమను పంచిన మానవతామూర్తులకు వందనం - సెర్గియో డిమెల్లో

మానవత్వమంటే ఎవరికో ఏదో ఉపకారం చేయడమో, ఉద్ధరించడమో కాదు. సకాలంలో, సరైన రీతిలో స్పందించే గుణం. ఇతరుల మనసుకు బాధ కలగకుండా మసలుకోవడం. ఈ లక్షణం వల్ల సృష్టి మొత్తానికీ లాభం చేకూరుతుంది. అదే నేడు కొరవడుతోంది. వీటిని గుర్తుచేయడం కోసమే అన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2009 నుంచి ఏటా ఆగస్టు 19వ తేదీని 'ప్రపంచ మానవతా దినోత్సవం'గా జరుపుకొంటున్నారు.

World Humanitarian Day
ప్రపంచ మానవతా దినోత్సవం
author img

By

Published : Aug 19, 2021, 7:01 AM IST

మానవత్వం- మనుషుల సహజ స్వభావం. మనిషిలా ప్రవర్తించడమే మానవత్వం. సృష్టిలో ప్రేమ, దయ, కరుణ వంటి విలక్షణమైన గుణాలున్న ఏకైక జీవి మనిషి. ఇతర జీవులతో పోలిస్తే- ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే గొప్ప మనసు మనిషికి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి మనిషికీ ఉండవలసిన ప్రధాన లక్షణం. అది అందరిలోనూ సహజసిద్ధంగా, అంతర్లీనంగా నిబిడీకృతమై ఉంటుంది. దురదృష్టవశాత్తు పోనుపోను అది మరుగున పడిపోతోంది. అలసత్వం, నిర్లిప్తత, స్వార్థం, నైరాశ్యం, లాభనష్టాలను బేరీజు వేసుకొనే తత్వం వంటి అనేక లక్షణాలు మనసును ఆవరించుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల మనిషి తనలోని సహజమైన మానవత్వాన్ని బహిర్గతం చేయడం లేదు.

సరైన రీతిలో స్పందించడమే..

మానవత్వమంటే సాటి మనిషికి సహాయపడటమో, ఎవరికో ఏదో ఉపకారం చేయడమో, ఉద్ధరించడమో కాదు. సకాలంలో, సరైన రీతిలో స్పందించే గుణం. ఇతరుల మనసుకు బాధ కలగకుండా మసలుకోవడం. ఈ లక్షణం వల్ల సృష్టి మొత్తానికీ లాభం చేకూరుతుంది. అదే నేడు కొరవడుతోంది. వీటిని గుర్తుచేయడం కోసమే అన్నట్లు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2009 నుంచి ఏటా ఆగస్టు 19వ తేదీని 'ప్రపంచ మానవతా దినోత్సవం'గా జరుపుకొంటున్నారు. బ్రెజిల్‌కు చెందిన సెర్గియో డిమెల్లో ఇందుకు మూలకారకులు. ఐరాస మానవతా సహాయ కార్యక్రమాల్లో మూడున్నర దశాబ్దాలపాటు అంకిత భావంతో పనిచేసి, ఎన్నో యుద్ధాల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టి ఆదుకున్న మానవతావాది. 2003, ఆగస్టు 19న ఇరాక్‌లో ఒక బాంబు పేలుడు ఘటనలో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. సెర్గియో త్యాగం, అంకితభావం, సాహసోపేతమైన జీవితానికి గుర్తింపుగా ఆగస్టు 19న ఐరాస ప్రపంచ మానవతా దినోత్సవాన్ని జరుపుతోంది.

మానవత్వానికి పరిధులు ఉండవు..

మానవత్వానికి పరిధులు, భేదభావాలు లేవు. 24 సంవత్సరాల మెల్లీ స్విట్జర్లాండ్‌కు చెందిన వైద్య విద్యార్థి. ఒకరోజు ఓ విందుకు వెళ్తుండగా, దారిలో ఒక వృద్ధుడు బండి లాగలేక అవస్థలు పడటం కంటపడింది. రెండో ఆలోచన లేకుండా వ్యర్థాలతో నిండిన ఆ బండిని వెనక నుంచి తోసి వృద్ధుడికి సహాయం అందించారు. మరకలంటిన దుస్తులతోనే విందుకు ఆలస్యంగా హాజరయ్యారు. ఆ మానవతామూర్తిని తెలుగు వ్యక్తి ఉప్పల లక్ష్మణరావు ఆ విందులోనే మొదటిసారి చూశారు. జీవితాన్ని పంచుకున్నారు. ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ వృత్తిరీత్యా నర్సు. తన శక్తికి మించి యుద్ధవీరులకు వైద్య సేవలందించారు. యుద్ధభూమిలో లాంతరు పట్టుకొని తిరుగుతూ గాయపడిన ప్రతి సైనికుడికి సేవలందించారు. 'లేడీ విత్‌ ది ల్యాంప్‌'గా ప్రసిద్ధి పొందారు. యుగొస్లేవియా దేశానికి చెందిన ఓ బాలిక మానవతా దృక్పథంతో ఊరు, వాడ, దేశం విడిచి భారత్‌లో ఎన్నో ఆటుపోట్లు అధిగమించి ఆర్తులకు, అనాథలకు సేవలందించి మదర్‌ థెరెసాగా ప్రసిద్ధి చెందారు. 'ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్న' అన్న బోధనతో మానవతా విలువలను చాటిచెప్పారు.

ప్రేమను పంచిన మానవతామూర్తి ఆర్ల్లే మన్సన్‌ అమెరికాలో జన్మించారు. తల్లిదండ్రుల ప్రభావంతో బాల్యం నుంచే మానవతా దృక్పథం అలవడింది. వైద్యపట్టా పుచ్చుకొన్న మన్సన్‌ తన సహాధ్యాయి, మహారాష్ట్రకు చెందిన కర్మాకర్‌ పరిచయ ప్రభావంతో వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో భారత్‌ వచ్చారు. మన దేశంలో ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జీవితపర్యంతం సమాజసేవలో తరించారు. కలరా వ్యాధి వ్యాపించినప్పుడు సామాన్యులను కాపాడేందుకు డాక్టర్‌ మన్సన్‌ చేసిన కృషి మరువలేనిది. తన వైద్య సేవల ద్వారా ఎంతోమందిని మహమ్మారి నుంచి కాపాడారు.

పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచించరు.

తమకు కాస్త కష్టం కలిగినా ఎదుటి వారికి మంచి జరిగితే చాలనే ఆలోచనే ఇలాంటి మానవతా మూర్తులకు ప్రేరణ. ఇందుకు ఉదాహరణలుగా ప్రపంచ చరిత్రలో దేశ దేశాల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఎందరో మానవతావాదులు తమ నిస్వార్థ సేవలతో చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. భారీస్థాయిలో సహాయ కార్యక్రమాలు చేయకపోయినా అవసరమైనప్పుడు సమయానికి తగిన రీతిలో స్పందించి మానవత్వాన్ని ప్రదర్శించే వారూ ఎంతోమంది ఉన్నారు. అది తమ విధి, బాధ్యత అన్నట్లుగా స్పందిస్తారు తప్పించి, పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచించరు. ఇలా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తోటివారికి తోడ్పాటు అందించేందుకు అహరహమూ శ్రమించిన వారి సేవల్ని స్మరించుకోవడం- మనందరి బాధ్యత.

- రమా శ్రీనివాస్‌

ఇదీ చూడండి: ప్రార్థించే పెదవులకన్నా..సహాయం చేసే చేతులు మిన్న

ఇదీ చూడండి: ఆ ఊరి నీటి సమస్య తీర్చిన సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.