ETV Bharat / opinion

సర్కారీ సేవల జవసత్వాలను మార్చనున్న 'మిషన్‌ కర్మయోగి'! - eenadu editorial

ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సమర్థంగా నిర్వహించడం కోసం, వారి నైపుణ్యాలను మెరుగుపరచటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మిషన్‌ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ సిబ్బందికి ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడానికి ఐగాట్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌) అనే డిజిటల్‌ వేదికను ఏర్పరుస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ శిక్షణ సంస్థల అనుభవాన్ని రంగరించి కోర్సులను రూపొందిస్తారు. ఈ కోర్సులలో సంతరించుకున్న నైపుణ్యాల ఆధారంగా ప్రభుత్వ సిబ్బందికి పోస్టింగులు ఇస్తారు. కేంద్ర, రాష్ట్రాల్లోని మొత్తం రెండు కోట్ల ఉద్యోగులకు శిక్షణ ఇస్తారని కొన్ని వార్తా కథనాలు చెబుతున్నాయి.

Narendra Modi govt's latest step to reform bureaucracy Mission Karmayogi
సర్కారీ సేవల జవసత్వాలను మార్చనున్న 'మిషన్‌ కర్మయోగి'!
author img

By

Published : Sep 18, 2020, 7:32 AM IST

ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సమర్థంగా నిర్వహించడం కోసం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మిషన్‌ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రకటించింది. 21వ శతాబ్దిలో సాంకేతికం, సంక్లిష్టం అవుతున్న పరిపాలనా విధుల నిర్వహణలో ప్రభుత్వ సిబ్బందికి ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడానికి ఐగాట్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌) అనే డిజిటల్‌ వేదికను ఏర్పరుస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ శిక్షణ సంస్థల అనుభవాన్ని రంగరించి కోర్సులను రూపొందిస్తారు. ఈ కోర్సులలో సంతరించుకున్న నైపుణ్యాల ఆధారంగా ప్రభుత్వ సిబ్బందికి పోస్టింగులు ఇస్తారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం కూడా మిషన్‌ కర్మయోగిలో ముఖ్యభాగం. సివిల్‌ సర్వీసుల సిబ్బంది పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి జాతీయ స్థాయి సంస్థ- ఎన్‌పీసీఎస్‌సీబీని లాభాపేక్ష లేకుండా పని చేసే ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ కార్యకలాపాలకు ప్రధానమంత్రి ఛత్రం కింద పనిచేసే పబ్లిక్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ కౌన్సిల్‌ దిగ్దర్శకత్వం వహిస్తుంది. ఈ మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సభ్యులుగా ఉంటారు. మిషన్‌ కర్మయోగి కింద 46 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శిక్షణ లభిస్తుందని కొన్ని వార్తా కథనాలు వెలువడితే- కేంద్ర, రాష్ట్రాల్లోని మొత్తం రెండు కోట్ల ఉద్యోగులకు శిక్షణ ఇస్తారని ఇతర కథనాలు చెబుతున్నాయి. 2020-2025 మధ్య కాలంలో మిషన్‌ కర్మయోగిపై రూ.511 కోట్లు వెచ్చిస్తారు. అందులో 60 శాతాన్ని ఐక్యరాజ్యసమితి సంస్థలు అందిస్తాయి.

గతంలోనూ సంస్కరణలు

పూర్వ ప్రభుత్వాల హయాములలోనూ మూడు పాలనా సంస్కరణల సంఘాలు ఏర్పాటై, పుంఖానుపుంఖంగా నివేదికలు సమర్పించాయి. వాటి లక్ష్యం కూడా ప్రభుత్వోద్యోగుల పని సామర్థ్యాన్ని మెరుగుపరచడమే. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరవాత ఇదే లక్ష్య సాధనకు మూడు ముఖ్యమైన చర్యలు తీసుకుంది. కానీ, అవి విమర్శలకు గురయ్యాయి. వీటిలో మొదటి చర్య లేదా సంస్కరణను 2016 ఏప్రిల్‌ లో చేపట్టారు. దీని కింద సంయుక్త కార్యదర్శులకన్నా పైస్థాయి అధికారుల పనితీరును క్షుణ్నంగా పరిశీలించాకనే పదోన్నతులు ఇవ్వాలి. దీనికి ముందు సంబంధిత మంత్రితో పాటు మూడు స్థాయుల ఉన్నతాధికారులు చేసే వార్షిక మూల్యాంకనం, సిబ్బంది పదోన్నతులకు ప్రాతిపదికగా ఉండేది. సంబంధిత అధికారి తన పనితీరుపై స్వీయ సమీక్షనూ సమర్పించాల్సి ఉండేది. కొత్త 360 డిగ్రీల సమీక్ష కింద ఒక అధికారి పదోన్నతికి నిజంగా అర్హుడేనా అన్నదీ పరిశీలించాలి. ఈ పని నిపుణుల సంఘానికి అప్పగించాలి. సాటి ఉద్యోగులు, జూనియర్లు, సీనియర్లు, బయటివారు, పదవిలో ఉన్న కార్యదర్శులు సంబంధిత అధికారి పదోన్నతిపై వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిని గోప్యంగా ఉంచుతారు. రెండో సంస్కరణ- ప్రభుత్వేతర రంగాలకు చెందిన నిపుణులు, అనుభవజ్ఞులను ఉన్నత పదవుల్లోకి తీసుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ప్రకటించిన సంస్కరణ ప్రకారం ఇటువంటి నిపుణులను సంయుక్త కార్యదర్శి హోదాలోకి తీసుకుంటారు.

Narendra Modi govt's latest step to reform bureaucracy Mission Karmayogi
కె. పద్మనాభయ్య కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆస్కి ఛైర్మన్​

ఇది కూడా బొత్తిగా కొత్త విషయమేమీ కాదు. 1980లలోనూ వెలుపలి నుంచి అనుభవజ్ఞులను ప్రభుత్వం లోకి తీసుకునేవారు. నూతక్కి భాను ప్రసాద్‌, డీవీ కపూర్‌ తదితరులు అలా వచ్చినవారే. అయితే, ఎన్డీయే ప్రభుత్వం ఇటువంటి నిపుణులను చాలా పెద్ద సంఖ్యలో తీసుకోవాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. వీరిని ఎంపిక చేసే బాధ్యతను క్యాబినెట్‌ కార్యదర్శికి అప్పగించారు. తరవాత 2019లో తొమ్మిదిమంది బయటి నిపుణులను సంయుక్త కార్యదర్శి హోదాలో తీసుకునే ప్రక్రియను యూపీఎస్‌సీకి అప్పగించాక వివాదం సద్దుమణిగింది. ఇలా బయటి నుంచి వచ్చినవారి పనితీరుపై ఇంకా మూల్యాంకనం జరగకపోయినా, కేంద్రం మరో 40 మందిని వెలుపలి నుంచి తీసుకోవడానికి సిద్ధమైంది. కేంద్రంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఐఏఎస్‌ అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్‌ మీద వెళ్లడానికి ఇష్టపడటం లేదు. సివిల్‌ సర్వీసులకూ పాలనా సంస్కరణల్లో భాగస్వామ్యం కల్పించి, ఈ సాధకబాధకాలను పరిష్కరించాలి.

అసమర్థులను సాగనంపాల్సిందే

ఇటీవల ప్రకటించిన మూడో సంస్కరణ- అందరు సీనియర్‌ అధికారుల పనితీరును 50-55 ఏళ్ల వయసులో మూల్యాంకనం చేసి, వారిని సర్వీసులో కొనసాగించాలా లేక నిర్బంధంగా పదవీ విరమణ చేయించాలా అని తేల్చడం. ఇదీ కొత్త విషయం కాదు. 1912లోనే ఇటువంటి నిబంధన తెచ్చినా, దాన్ని ఉపయోగించిన సందర్భాలు అరుదు. ఏ సంస్థ లేదా సర్వీసులోనైనా అసమర్థులు ఉంటారు. వారిని తొలగించడంలో తప్పులేదు. ఈ నిబంధనను అన్ని ప్రభుత్వ సర్వీసులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపజేయాలి. తమకు గిట్టనివారిని సాగనంపడానికి ప్రభుత్వాలు ఈ నిబంధనను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పాటించాలి. కేంద్రం ప్రకటించిన మరో ముఖ్యమైన సంస్కరణ- జాతీయ రిక్రూటింగ్‌ సంస్థ ఏర్పాటు. సబార్డినేట్‌ సర్వీసు ఉద్యోగాలకు ఈ సంస్థ ఉమ్మడి ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తుంది. దేశంలోని అన్ని జిల్లాల్లో జరిగే ఈ పరీక్షలను అందరూ స్వాగతిస్తున్నారు.

ఉద్యోగుల పనిసామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంచడానికి మిషన్‌ కర్మయోగిని తీసుకొస్తున్నామనడం బాగానే ఉంది కానీ, అసలు ప్రభుత్వోద్యోగుల పనితీరు బాగాలేకపోవడానికి కేవలం సామర్థ్య లోపమే కారణమా అని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ సీనియర్‌ ప్రభుత్వాధికారుల విధులను సరిగ్గా అర్థం చేసుకోవాలి. వారికి రెండు బాధ్యతలు ఉంటాయి. మొదటిది- మంత్రులకు విధానపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం. రెండోది- మంత్రివర్గ ఆమోదం పొందిన విధానాలను సక్రమంగా అమలుచేయడం. వాస్తవంలో కార్యదర్శి స్థాయి అధికారులు విధానపరమైన సలహాలు ఇవ్వడం నానాటికీ తగ్గిపోతోంది. సాంకేతిక విషయాల్లో సంబంధిత నిపుణుల సలహాసంప్రతింపులను మంత్రిత్వ శాఖలు స్వీకరిస్తాయి. కార్యదర్శులు మాత్రం ఒక విధానం లేదా ప్రతిపాదన రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనే అంశంపై మంత్రులకు సలహాలు ఇస్తారు. ఆ విధానం అమలుకు అయ్యే ఖర్చు, ఇతర సాధకబాధకాలను వివరిస్తారు. కార్యదర్శికి ఉన్న సుదీర్ఘ అనుభవం ఈ విషయంలో తోడ్పడుతుంది.

రాజకీయ జోక్యంతో వైఫల్యాలు

నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఏ పనికైనా చాలా ఎక్కువ సమయం పడుతోందంటూ కొందరు మంత్రులు అడ్డతోవలోనైనా వేగంగా పనులు జరిపించాలని చూస్తారు. దానికి ఒప్పుకోని అధికారులను పక్కనపెట్టి, తమ అంతేవాసులకు ఆ పనులు అప్పగిస్తారు. ఏతావతా విధానాలు విఫలం కావడానికి కారణం అధికారుల అసమర్థత కాదు- రాజకీయ జోక్యమే. కాబట్టి మంత్రికి, సీనియర్‌ అధికారికి మధ్య పరస్పర విశ్వాసం లేకపోతే ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఉపయోగం ఉండదు. ప్రస్తుత సివిల్‌ సర్వీసు అధికారులకు సాంకేతిక నైపుణ్యాలు కొరవడినాయనడమూ సరికాదు. నేడు డాక్టర్లు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో సివిల్‌ పరీక్షల్లో ఎంపికవుతున్నారు. అయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌, వైద్యం, అంతరిక్షం, ఖనిజ వనరుల అన్వేషణ వంటి ప్రత్యేక రంగాలకు సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది తప్ప, ఇతర పాలనాపరమైన శాఖలకు ఆ అవసరం ఉండదు. అసలు సివిల్‌ సర్వీసుల రిక్రూట్‌మెంట్‌కు సాధారణ పట్టభద్రులు చాలు. ఉద్యోగానికి ఎంపిక అయిన తరవాత ఆయా శాఖలకు కావలసిన నైపుణ్యపరిజ్ఞానాలను, పనిచేస్తూ అలవరచుకుంటారు. మరోవైపు మంత్రుల పక్షపాత వైఖరి పలు అపశ్రుతులకు కారణమవుతోంది. కొందరు మంత్రులు తమకు నచ్చిన అధికారులను రాష్ట్రాల క్యాడర్‌ నుంచి తెచ్చుకుంటారు. కొందరు అధికారులు మంత్రుల ప్రాపకం పొంది, కోరిన పోస్టింగులు తెచ్చుకుంటారు. మిషన్‌ కర్మయోగి ఈ పరిస్థితిని మారుస్తుందని ఆశిద్దాం.

వ్యాసం తరువాయి భాగం రేపు....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.