ETV Bharat / opinion

వలస కార్మికులను వెంటాడుతున్న వెతలు

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​లు.. రోజువారీ, వలసకూలీల జీవనోపాధిని దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా వలసకూలీల వెతలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం రేషన్ ఇస్తున్నామని ప్రకటించినా.. చాలా మందికి నిత్యవసర సరకులు దొరకని పరిస్థితి. శ్రామిక్​ రైళ్లు నడుపుతున్నా... ఇంకా లక్షలాది మంది స్వస్థలాలకు చేరుకోలేని దైన్యం. ప్రభుత్వాల నిర్లక్ష్యం మరీ దారుణం.

author img

By

Published : May 26, 2020, 9:57 AM IST

Lockdown troubles for migrants
లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న వలసకార్మికులు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ వలస కూలీలు, రోజువారీ కూలీల జీవనోపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. వలస కూలీలను ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా స్థానిక చౌక ధరల దుకాణాలతో అనుసంధానం చేయలేదు. దానివల్ల ఉచిత రేషన్‌ సరకులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా- దేశవ్యాప్తంగా వారికి సరకులు దక్కడంలేదు. ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమవ్వాలంటూ ఆంక్షలు విధించే సమయంలో వలస కూలీలు ఎదుర్కోబోయే సమస్యల్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోలేదు. తమ వద్ద పని చేసే వారందరికీ వేతనాలు ఆపవద్దని ప్రైవేటు కంపెనీల యజమానులను ప్రధానమంత్రి కోరినా చాలామంది మొండిచెయ్యి చూపారు. ఫలితంగానే నగరాలు, పారిశ్రామిక కేంద్రాల నుంచి భారీ స్థాయిలో కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు.

ఆకలి బాధ

వీరందరినీ కరోనా వైరస్‌కన్నా ఆకలితో చనిపోతామనే భయమే ఎక్కువగా ఆందోళనకు గురిచేసింది. తొలుత వీరికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అధికార యంత్రాంగం ఆ విషయాన్ని విస్మరించింది. కాస్త ఆలస్యంగా కళ్లు తెరచి వారిని సొంతూళ్లకు తరలించడంలో నిమగ్నమైంది. శ్రామిక ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయినా లక్షలాది వలస కార్మికుల తరలింపునకు ఈ ఏర్పాట్లు సరిపోలేదు. దీంతో ఇప్పటికీ తండోపతండాలుగా వలస కూలీలు కాలినడకన వెళుతూనే ఉన్నారు. వారిని అడ్డుకుంటే తిరగబడతారేమోననే భయం కూడా ఓ పక్కన ఉండటంతో యంత్రాంగం- గట్టిగా అడ్డుపడే సాహసం చేయలేకపోయింది. కార్మికులను నిలువరించాలనే ప్రయత్నాలు జరిగిన చోట్ల పోలీసులతో ఘర్షణలకు దిగిన ఉదంతాలూ చోటుచేసుకున్నాయి. ఫలితంగా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

పరిశ్రమలకూ కష్టమే...

వలస కూలీల విషయంలో వాణిజ్య వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చిందనేది వాస్తవం. అందరూ వెళ్లిపోతే కార్మికుల కొరత ఏర్పడి తమ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందేమోననే ఆందోళనతో పరిశ్రమల యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. మామూలుగా ప్రైవేటు కంపెనీల యజమానులు వలస కార్మికులను వెట్టికార్మికుల్లా చూస్తుంటారు. వారికెలాంటి హక్కులూ దక్కవు. ఎలాంటి లిఖితపూర్వక దీర్ఘకాలిక ఒప్పందాలూ ఉండవు. సామాజిక భద్రతా ఉండదు. ప్రభుత్వం రాజస్థాన్‌ కోట పట్టణంలో ఉండిపోయిన విద్యార్థుల్ని, హరిద్వార్‌, వారణాసిల్లో చిక్కుకుపోయిన గుజరాత్‌, దక్షిణ భారత యాత్రికులను తరలించే విషయంలో చూపిన శ్రద్ధ వలస కూలీలను సొంతూళ్లకు తరలించడంపై పెట్టలేదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ముందుగా పోలీసులు వలస కూలీలను రోడ్లపై నడిచేందుకు అనుమతించకపోవడంతో వారు రైలు పట్టాల బాట పట్టారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద రైలు పట్టాలపై పడుకున్న వలస కూలీలపై రైలు దూసుకెళ్లిన దుర్ఘటనలో 16 మంది మరణించడంతో అధికార యంత్రాంగాలు వారిని రోడ్లపై నడవనిచ్చేందుకు అనుమతించాయి. కార్మికులు సైకిళ్లు, మోటారు సైకిళ్లు, లారీలు వంటి అందుబాటులో ఉన్న ప్రతి వాహనాన్నీ ఆశ్రయించారు. ముంబయి, దిల్లీల నుంచి ఆటోల్లో స్వస్థలాలకు బయల్దేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో 25 మంది మరణించడంతో అధికారులు రహదారి ప్రయాణాలపై మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేయడం మొదలు పెట్టారు. దీంతో మరోదారి లేని కూలీలు- పొలాలు, అంతర్గత రహదారుల బాటపట్టారు. ఈ క్రమంలో వలస కూలీలకు అండగా నిలుస్తూ, ఆహారం అందిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్న వారికీ పోలీసులను దాటి బాధితులను చేరి, సహాయం అందించడం కష్టతరంగా మారింది. ఏదేమైనా, కొద్ది రోజులుగా సామాన్యులు కరోనా వైరస్‌ భయం, ఆకలి భయం, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి మూడు రకాల ఇబ్బందుల్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ముందు చూపులేని ప్రభుత్వాలు

ఈ తరహా సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్మికుల సంఖ్యను నిర్దిష్టంగా అంచనా వేసి ఉండాల్సింది. వారు గమ్యస్థానాలకు చేరేందుకు ఆ ప్రకారమే రైళ్లు తదితర రవాణా సౌకర్యాల్ని ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ దేశంలో ధనికులు, మధ్యతరగతి వారిలాగే కార్మికులకూ గౌరవప్రద జీవనం గడిపే హక్కుందన్న సంగతి ఎవరూ మరచిపోరాదు. ముందుచూపు లేని కారణంగా లాక్‌డౌన్‌ విధించడానికి ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలున్నా... ఇప్పటికైనా లక్షలమంది శ్రామికుల కష్టాల్ని, బాధల్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవచ్ఛు తగినన్ని రైలు సర్వీసులు, వాటికి అనుసంధానంగా బస్సులు, సంచార వైద్య సౌకర్యాలు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంటికి చేరడానికి ముందుగా పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి, ఆహారం, నీరు వంటి సౌకర్యాలన్నీ కల్పించాలి. వందేభారత్‌ కార్యక్రమం కేవలం విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసమేనా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. వ్యవసాయ కార్మికుల తరవాత దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలిచే వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటనేది స్పష్టం చేయాల్సి ఉంది.

- సందీప్‌ పాండే

(రచయిత- రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

ఇదీ చూడండి: 'అగ్ర' హోదా కోసం కాలుదువ్వుతున్న చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.