ETV Bharat / opinion

'కమల వికాసం'పై మోదీ సర్కార్ మౌనమేల?

దశాబ్దాలుగా అమెరికాలో భారత సంతతి వ్యక్తులు కార్పొరేట్​, టెక్​ రంగాల్లో సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం అగ్రస్థానం అందలేదు. ఇప్పుడు ఆ అవకాశం భారత సంతతి మహిళ కమలా హారిస్​కు దక్కింది. ప్రపంచంలోని భారతీయులందరి నుంచి ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. మరి అగ్రరాజ్యంలో 'కమల వికాసం'పై మోదీ సర్కార్​ మౌనానికి కారణమేంటి?

Kamala Harris nomination does not thrill government in New Delhi
కమల వికాసంపై మోదీ సర్కార్ మౌనం ఎందుకు?
author img

By

Published : Aug 15, 2020, 12:50 PM IST

2014 ఎన్నికల్లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిరోహించిన నాటి నుంచి నేటి వరకు దేశంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 'కమల' వికాసమే కనిపించింది. నరేంద్రుడికి ఇటు దేశమే కాక ప్రపంచ నలమూలలో ఉన్న భారతీయులందరూ ఛత్రం పట్టారు.

ఇటు మోదీ సర్కార్​ సైతం అదే స్థాయిలో ప్రవాస భారతీయులను గౌరవించింది. వారు సాధించిన విజయాలను గర్వంగా చెప్పుకుంది. కానీ.. ఇప్పుడు అగ్రరాజ్యంలో వెల్లివిరిస్తోన్న 'కమల' వికాసంపై మాత్రం మోదీ సర్కార్​ మౌనం వహిస్తోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అమెరికాలో భారతీయం...

అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు తొలిసారి అవకాశం దక్కింది. ఆఫ్రికన్-అమెరికన్‌గా స్థిరపడినప్పటికీ భారతీయ మూలాలున్న హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిస్తే మాత్రం చరిత్ర తిరగరాసినట్టే. ఇది కచ్చితంగా భారతీయతకు దక్కిన గౌరవమే అవుతుంది.

నా మూలాలు భారత్​లో: కమల

తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్లిన మొదటి తరం వారిలో కమలా హారిస్​ తల్లి ఒకరు. భారతీయురాలైన తన తల్లి నుంచి నేర్చుకున్న పాఠాలను కమల​ గర్వంగా చెప్పుకుంటారు.

కరేబియన్ దేశాల నుంచి పోర్చుగల్, ఐర్లాండ్, సింగపూర్, ఫిజి, మారిషస్ వరకు అనేక దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు అగ్రనేతలుగా ఉన్నారు. ఇప్పుడు భారత మూలాలు కలిగిన మహిళ... ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేస్తుండటం చాలా పెద్ద విషయం. ప్రస్తుతం ఇటు భారత్​ మీడియాలో, అటు యూఎస్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కమలా హారిస్​పై కథనాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతటి భారతీయ ఘనతపై మోదీ సర్కార్​ మౌనం ఎందుకు వహిస్తోంది..? ఆమె అభ్యర్థిత్వంపై కనీస స్పందన ఎందుకు లేదు? కారణమేంటి?

మౌనమేల నోయి..!

మోదీ సర్కార్​ మౌనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో ఉన్న సాన్నిహిత్యమే కావొచ్చు. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం భారత్​కు అనుకూలమని ఇప్పటికే పలుమార్లు మోదీ సర్కార్​ చెప్పుకొచ్చింది. అంతేకాక ట్రంప్​ భారత్​కు అత్యంత విశ్వాస మిత్రుడిగా భారత ప్రధాని ఎన్నోసార్లు ఉద్ఘాటించారు.

డెమొక్రాట్ల విమర్శలు...

డెమొక్రాట్లల్లో చాలా మంది నాయకులు ఇటీవల మోదీ సర్కార్​ తీసుకువచ్చిన కొన్ని విధానాలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయాలను విమర్శించడంలో డెమొక్రాట్లు వెనక్కి తగ్గలేదు. అయితే మాజీ (డెమొక్రటిక్ పార్టీ) అధ్యక్షుడు బరాక్ ఒబామా, మోదీ మధ్య బలమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఈ వ్యతిరేకత కనిపించింది.

అందులో హారిస్​ ఒకరు...

  1. అధికరణ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ పరిస్థితిని బహిరంగంగా విమర్శించిన నాయకులలో హారిస్ ఒకరు.
  2. 2020 డిసెంబర్‌లో 'హౌస్ ఫారిన్ రిలేషన్స్' కమిటీతో జమ్ముకశ్మీర్ అంశంపై జరిగిన సమావేశానికి గైర్హాజరైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్​శంకర్‌ను కూడా ఆమె విమర్శించారు.
  3. గత ఏడాది సెప్టెంబరులో అమెరికా హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమానికి కూడా హారిస్ దూరంగా ఉన్నారు.

ఇవే కారణాలు...!

  • కమలా హారిస్ నామినేషన్​పై భారత ప్రభుత్వం మౌనంగా ఉండటానికి ట్రంప్ చపల స్వభావం కూడా ఒక ముఖ్య కారణమని మోదీ సర్కార్​ వ్యూహాత్మక నిపుణులు చాలామంది అభిప్రాయపడ్డారు.
  • భారత్​కు జీఎస్‌పీ (సాధారణ ప్రాధాన్య వ్యవస్థ) హోదాను ట్రంప్​ సర్కార్ త్వరలో పునరుద్ధరించే అవకాశం ఉందని పెద్ద చర్చే నడుస్తోంది. ఇటువంటి సమయంలో ట్రంప్‌ను అసహనానికి గురి చేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేయదు.
  • సరిహద్దు వద్ద చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్​ తన భూభాగంగా పేర్కొన్న ప్రాంతాలను తమవిగా పాక్ ఇటీవల​ బుకాయించడం.. దానికి చైనా వత్తాసు పలకడం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్​కు అమెరికా బహిరంగ మద్దతు చాలా అవసరం.

డెమొక్రాట్లతో కష్టమే...

మానవ హక్కులు, మతపరమైన స్వేచ్ఛ విషయాల్లో రిపబ్లికన్ల కన్నా డెమొక్రాట్లు సాధారణంగానే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. కనుక వారితో మోదీ సర్కార్​కు కొంత అసౌకర్యం కలగడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇటీవల భారత్​ అవలంబిస్తోన్న పర్యావరణ విధానాలు, పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ)పై కూడా డెమొక్రాట్లు దృష్టి సారించారు.

కనుక కమలా హారిస్ నామినేషన్ భారత్​కు ప్రత్యేక ప్రయోజనం చేకూరుస్తుందని పెద్దగా అంచనా లేదు. వాస్తవానికి, కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని భారత ప్రభుత్వం కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.

'హౌడీ మోదీ' కార్యక్రమంలో ముఖ్యంగా భారతీయ అమెరికన్లు ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని మోదీ బహిరంగంగానే చెప్పారు. అహ్మదాబాద్​లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్​ను భారతదేశానికి గొప్ప స్నేహితుడిగా మోదీ అభివర్ణించారు.

బైడెన్​ వ్యూహం....

మొన్నటివరకు ప్రవాస భారతీయుల ఓట్లపై ట్రంప్​ సర్కార్​కు ఓ నమ్మకముంది. అయితే హారిస్‌ను బైడెన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం అమెరికాలోని భారత ప్రవాసులలో కొత్త ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం చాలామంది ప్రవాసులు హారిస్​కే మద్దతు పలికే అవకాశం ఉంది.

3 కోట్ల మంది...

ప్రపంచంలో ఉన్న 3 కోట్ల మందికిపైగా ప్రవాసులను భారత్​ అతిపెద్ద శక్తిగా పరిగణిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రవాస భారతీయలు, భారతీయ సంతతి వారు ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వీరు 80 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారు. దేశ నిర్మాణంలో వారి సహకారం అపారం. గత రెండు దశాబ్దాలుగా, భారత ప్రభుత్వం వార్షిక 'ప్రవాస్ భారతీయ దివస్'(నాన్-రెసిడెంట్ ఇండియన్ డే) నిర్వహించి, అవార్డులు కూడా ఇస్తోంది.

అమెరికాకు వెళ్లిన మొదటి, రెండవ తరం భారతీయులు సైన్స్, టెక్నాలజీ, అంకుర సంస్థల్లో నిపుణులుగా మంచి స్థాయిలో స్థిరపడ్డారు అమెరికాలో భారత సంతతికి చెందిన వారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎమ్ వంటి హైటెక్ కంపెనీలకు నాయకత్వం వహించే సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి యూఎస్ లోని భారతీయులు వారి సహకారాన్ని భారత్​కు బహిరంగంగా ప్రకటించారు.

అమెరికా అత్యున్నత రాజకీయ పదవిని ఆశిస్తోన్న కమలా హారిస్‌కు ఒక ప్రధాన రాజకీయ పార్టీ నామినేషన్ ఇచ్చి ఘనమైన గౌరవం ఇచ్చింది. అయితే తమ మూలాలు ఉన్న భారత్​ నుంచి మాత్రం అభినందనలు దక్కలేదు.

- నీలోవా రాయ్ చౌదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.