ETV Bharat / opinion

మానింది మందు... బతికింది ఊరు - ఆయుర్వేదం

కొందరు ఈసడిస్తున్నట్లుగా ఆయుర్వేదం- ఆకు పసరో, నాటువైద్యమో కానేకాదు. అన్నిరకాల రోగాలను నివారించడమే కాదు, శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఆయుర్వేద వైద్యులది. ఒకప్పుడది సర్వసమగ్ర, సంపూర్ణ వైద్యవిధానం. అది భారతీయ రుషులు రూపొందించిన వేదశాస్త్రం.అంతే గౌరవంతో ఆ శాస్త్రం ముందు దోసిలి ఒగ్గి ప్రస్తుత సమస్యకు దానిలో పరిష్కారం అన్వేషించడం మన కర్తవ్యం.

duty to preserve the science of Ayurveda
ఆయుర్వేదం ఉపయోగాలు
author img

By

Published : Jun 6, 2021, 7:04 AM IST

ఆస్థాన వైద్యుడి నివాసానికి రాజభటులు పరుగున వచ్చారు. 'రాణీగారికి అనారోగ్యం... వెంటనే దివాణానికి దయచేయాలని ప్రభువుల ఆజ్ఞ అని మనవి చేశారు. రాణివాసం వద్ద పరిచారికలు ఎదురొచ్చారు. ‘అమ్మగారికి జలుబు పడిసెం రొంప...' అన్నారు కంగారుగా రొప్పుతూ. నాడి పరీక్షించాడు వైద్యుడు. చుట్టూ పరికించాడు. గంభీరంగా తల పంకించాడు. 'తప్పదు, ప్లాసెబో పడిపోవాల్సిందే' అని ప్రకటించాడు. 'మూడు పూటలా వాడండి' అంటూ పరిచారికలకు పథ్యం వివరించాడు. మర్నాటికల్లా రాణిగారు తేరుకొన్నారు. వైద్యుడికి భారీ నజరానా అందింది. కథ సుఖాంతమైంది. వైద్యులను నారాయణ స్వరూపులని ఊరికే అన్నారా... అనుకున్నారు జనం.
ఇంతకీ ప్లాసెబో అనేది మందుకాదు. మందు కలపడంకోసం ముందే సిద్ధం చేసుకొనే తీపి హోమియో గుళికలను ప్లాసెబో మాత్రలంటారు. అవసరమైన మోతాదు(పొటెన్సీ)లో వాటికి దరిమిలా మందు చేరుస్తారు. ఆ మందువల్ల మాత్రలకు ఓషధి లక్షణాలు వస్తాయి. బలమైన, విశేషమైన మందేదో కడుపులో పడిందనిపించే ఒకానొక అద్భుత మానసిక చికిత్స అది. దాంతో రోగం నెమ్మదిస్తే- దాన్ని 'ప్లాసెబో ఎఫెక్టు'గా పిలుస్తారు. రోగ భయం వల్ల ఏర్పడే మానసిక సమస్యలకు మనిషి మెదడులోని 'అమిగ్డాలా' అనే గొప్ప రక్షణ వ్యవస్థ చక్కని పరిష్కారం చూపిస్తుంది. క్రమంగా రోగం తగ్గుముఖం పడుతుంది. ప్రధానంగా అమిగ్డాలాను ప్రేరేపించే దిశగా ఈ ప్లాసెబో ఎఫెక్టు పనిచేస్తుంది.

పెరుగుతున్న రోగభయం...

కరోనా ఇప్పుడు ముఖ్యంగా మానసిక వ్యాధి. గతంలో అది ఊపిరితిత్తుల్లో వైరస్‌ రూపంతో ఉప్పెన సృష్టించింది. అప్పుడది శారీరక అనారోగ్యం. ప్రస్తుతం అది భయం రూపంలోనూ మన గుండెల్లో సునామీని పుట్టిస్తోంది. ఇది మానసిక అనారోగ్యం. తుమ్మినా దగ్గినా అది కరోనాయే- అనిపించడం దాని లక్షణం. ఈ స్థితిలో మనిషికి మందుకన్నా ముందు కావలసింది- ఒక చల్లని పలకరింపు... వెచ్చని ఆత్మీయ స్పర్శ... చిటికెడు నమ్మకం... ఒక వైద్యుడి అభయం! వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసేసుకొన్నామనుకొంటే కాసింత గుండె నిబ్బరం. అది ఈ రోజుల్లో వృద్ధుల మానసిక వ్యవస్థకు రక్షణ కవచంగా పనిచేయడం ఒక పచ్చినిజం. ఆక్సిజన్‌ దొరికిందన్న సంబరమే రోగుల విషయంలో అమిగ్డాలాను ఉత్తేజపరుస్తోందన్నది వాస్తవం. రోగంకన్నా రోగభయం పెరిగిపోతున్నప్పుడు ప్లాసెబో మంత్రమే మార్గాంతరం!
దేశ జనాభాకు తగినంతగా వ్యాక్సినేషన్‌ను సకాలంలో సమకూర్చుకోలేని నేపథ్యంలో- మనం ఆయుర్వేదం వంటి మరిన్ని దేశీయ ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు చూపు సారించడం వివేకం. కొందరు ఈసడిస్తున్నట్లుగా ఆయుర్వేదం- ఆకు పసరో, నాటువైద్యమో కానేకాదు. అన్నిరకాల రోగాలను నివారించడమే కాదు, శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఆయుర్వేద వైద్యులది. ఒకప్పుడది సర్వసమగ్ర, సంపూర్ణ వైద్యవిధానం. అది భారతీయ రుషులు రూపొందించిన వేదశాస్త్రం.
అంతే గౌరవంతో ఆ శాస్త్రం ముందు దోసిలి ఒగ్గి ప్రస్తుత సమస్యకు దానిలో పరిష్కారం అన్వేషించడం మన కర్తవ్యం. శాస్త్ర పరిశోధనల్లో ఎన్నోసార్లు సంభవించే 'సెరెండిపిటీ' ఆయుర్వేద శాస్త్ర పరిశోధనల్లోనూ సాధ్యమే. ఒకదానికోసం ప్రయోగం చేస్తుండగా మరో అద్భుతం అనుకోకుండా ఆవిష్కారం కావడాన్నే సెరెండిపిటీ అంటారు. అంటే వెతకబోవని తీగ కాలికి తగలడమని అర్థం. శాస్త్రం పట్ల గురి ఏర్పడితే ఆయుర్వేదం మనల్ని తప్పక ఆదుకొంటుంది.

మూలికలే ఔషధం..

ఆయుర్వేదంలో మూలికలు ప్రధాన ఔషధం. 'త్రిదోషహరం - తిప్పతీగ' అంది ఆయుర్వేదం. కఫ వాత పిత్త... అనే మూడు దోషాలకు అది దివ్యౌషధం. కరోనా తొలి రోజుల్లో తిప్పతీగ కషాయాన్ని ప్రతిపల్లె రుచి చూసింది. 'పేరు తెలియని రోగానికి పెన్నేటిగడ్డ' అని సామెత. రోగమేమిటో అదెలా వచ్చిందో దానికి మందేమిటో తెలియకపోతే 'అశ్వగంధే' పెద్ద దిక్కు, అది సర్వరోగ నివారిణి... అని ఆ సామెతకు తాత్పర్యం. మన గ్రామసీమల్లో ఆయుర్వేదం మూఢనమ్మకం కాదు- రుషులందించిన వైద్య విద్య. 'అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం... మంత్రంకాని అక్షరం, ఔషధ గుణాల్లేని మూలిక ఈ సృష్టిలోనే లేవు' అనేది ఆర్యోక్తి. శాస్త్రవచనం మీద ప్రజల నమ్మకాన్ని అశాస్త్రీయంగా భావించే వారంతా 'నాటుమందు'ను ప్లాసెబో ఎఫెక్టుగా సరిపెట్టుకోవచ్చు. రోగం తగ్గడమే అత్యంత ప్రధానం. ఆ శ్లోకంలోనే చివర్లో 'యోజకః తత్ర దుర్లభః' అనీ శాస్త్రం తేల్చిచెప్పింది. అంటే ఒక మందును ఎప్పుడు ఎవరికి ఎలా వాడాలో చెప్పే 'సంయోజక విద్య' పట్టుబడినవారు అరుదుగా ఉంటారని అర్థం. అలాంటి సంప్రదాయజ్ఞుడి చేతిలో, శాస్త్ర పండితుడి హస్తవాసిలో ప్రతి మూలికా ఒక 'సంజీవని' అయి తీరుతుంది. అదంతే! రామాయణంలో మూలికావైద్యాన్ని విజయవంతంగా నిర్వహించిన సుషేణుడు అలాంటి శాస్త్రపండితుడు. మనం గుర్తుంచుకోవలసిన సత్యం ఏమంటే- దానికి ఆక్సిజన్‌ అని పేరు పెట్టకముందు నుంచే ప్రాణవాయువును మనం పీల్చుకొంటున్నాం. మందేమిటో తెలియడంకన్నా తగ్గడం ప్రధానం రోగికి! దేనివల్ల రోగం తగ్గితే- అదే మంచి మందు. 'మానింది మందు, బతికింది ఊరు' అనే సామెతకు మూలం అదే. ఆయుర్వేద మూలికల్లో ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అందినవి, అందనివి మరెన్నో ఉన్నాయి. అంటే, అందులో మందులేదని కాదు- మనకింకా తెలియలేదని!

- వై. శ్రీలక్ష్మి

ఇదీ చదవండి:'అల్లోపతిలో కరోనిల్‌ చేరితే అది.. మిక్సోపతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.