ETV Bharat / opinion

ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

భారత్-చైనా సరిహద్దులో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో పొరుగుదేశం నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్​లోని ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తూ మ్యాప్​ను రూపొందించి​.. మరిన్ని వివాదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దులో మొదలైన ఘర్షణను ఇతర మార్గాలకూ విస్తరిస్తోంది.

India faces Nepal heat as it battles China in Ladakh region
నేపాల్ కొత్త కయ్యం!
author img

By

Published : Jun 23, 2020, 2:19 PM IST

సరిహద్దులో ఓవైపు చైనా కయ్యానికి కాలుదువ్వుతుంటే.. మరోవైపు నేపాల్​ ప్రభుత్వం భారత్​తో ఎప్పటినుంచో పెనవేసుకొని ఉన్న సంబంధాలను విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగుతోంది. భారత్​ అధీనంలో ఉన్న ప్రాంతాలను తమదిగా వాదిస్తూ వస్తోంది. భౌగోళిక చిత్రపటాలకు కొత్తరూపు ఇచ్చింది. సరిహద్దులో మొదలైన వివాదాన్ని మరింత సాగదీసేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

బిహార్​లోని తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ నదిపై చేపట్టిన వరద నియంత్రణ పనులను నిలిపివేస్తూ నేపాల్ జూన్ 21న(ఆదివారం) నేపాల్ నిర్ణయం తీసుకుంది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆదివారం నేపాల్ పోలీసులు, జిల్లా అధికారులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: చైనా పాటకు నేపాల్‌ ఆట.. సరిహద్దు వివాదానికి ఆజ్యం

నేపాల్​ నుంచి ప్రవహించే ఈ నది బిహార్​ సితామఢి జిల్లాలో బాగ్​మతి నదిలో కలుస్తుంది. లాల్బకేయతో పాటు నేపాల్​ నుంచి ప్రవేశించే నదులు ప్రవాహం వల్ల బిహార్​ చాలా నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నదులపై భారత్​ అనేక ఆనకట్టలు నిర్మించింది. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు అధికారులు వాటిని పరిశీలించి, మరమ్మతులు నిర్వహిస్తారు. అయితే నేపాల్ అధికారుల జోక్యం చేసుకొని ఈసారి పనులను అడ్డుకున్నారు. నేపాల్ వైఖరితో ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

నెలలో రెండోసారి

ఈ నెలలో భారత్​తో తగువు పడటం ఇది రెండోసారి. జూన్ 12న సరిహద్దు దాటి వచ్చాడన్న కారణంతో ఓ భారత పౌరుడిని నేపాల్ సాయుధ బలగాలు కాల్చి చంపాయి. ఈ ఘటన స్థానిక శాంతిభద్రతల సమస్యగా అధికారులు చెబుతున్నప్పటికీ... ఆదివారం జరిగిన పరిణామాలు మాత్రం ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

2015లోనే అసలు సమస్య!

లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల విషయంలో వివాదం మొదలైనప్పటికీ.. 2015లోనే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో నేపాల్​లో ఆర్థికపరమైన దిగ్బంధం(ఎకనామిక్​ బ్లాకేడ్​) వెనుక భారత్ ఉందన్నది వారి వాదన. అప్పటి నుంచి భారత్​- నేపాల్ మధ్య ఉన్న ప్రతికూల పరిస్థితులను వేరొక దేశం తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి విశ్లేషిస్తున్నారు నిపుణులు.

ఇదీ చదవండి: భారత్​-నేపాల్​ విభేదాలకు కారణాలు ఇవేనా?

"కచ్చితంగా ఇందులో మూడో దేశం జోక్యం ఉంది. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్రస్తుత నేపాల్ నాయకత్వానికి చాలా రకాలుగా ప్రోత్సాహం లభించి ఉంటుంది."

-ప్రొఫెసర్ ఎస్​డీ ముని, మాజీ దౌత్యవేత్త

భారత్​-నేపాల్ మధ్య చాలా కాలంగా కాలాపానీ రగడ నలుగుతోందని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్​ ఫౌండేషన్ నిపుణులు కె. యోమ్​ పేర్కొన్నారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"నిజానికి సమస్య కాలీ నది జన్మస్థలం గురించి కాదు. భారత్​ ఒక నిర్దిష్ట మార్గంలో వివరిస్తే... నేపాల్ మరో కోణంలో చూస్తోంది. సరిహద్దు వివాదాలు, ప్రాదేశిక సమస్యలు భావోద్వేగాలకు సంబంధించినవి. కాబట్టే ఇరుపక్షాలు దీన్ని పరిష్కరించలేకపోయాయి."

-కె. యోమ్, అబ్జర్వర్ రీసెర్చ్​ ఫౌండేషన్

నేపాల్ కాలాపానీ సమస్యను ప్రస్తావించడం కొత్తేం కాదు. 2015లో భారత్​-చైనా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో లిపులేఖ్​ పాస్​ను ప్రస్తావించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

"నాథులా, కియాంగ్లా/లిపులేఖ్​ పాస్​, షిప్కిలా సరిహద్దుల ద్వారా వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసుకోవడం సహా వర్తక ఉత్పత్తుల జాబితాను పెంచడానికి చర్చలు జరిపేందుకు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి."

-భారత్​-చైనా సంయుక్త ప్రకటన(మే 15, 2015)

అయితే ఈ సమస్య చాలా కాలం క్రితం నుంచి ఉందన్న వాదనను ఖండించారు ప్రొఫెసర్ ముని. 1954లో భారత్-చైనా చేసుకున్న పంచశీల ఒప్పందంలో లిపులేఖ్​ పాస్​ను చేర్చడంపై నేపాల్ అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు.

"2015లోనే కాదు 1954లోనూ లిపులేఖ్​ను భారత్​లో అంతర్భాగమని చైనా ఒప్పుకుంది. 1954లో చేసుకున్న శాంతియుత జీవన ఒప్పందంలో భారత్-చైనా మధ్య వర్తక, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు 8-9 మార్గాలు ప్రస్తావించాయి. 2015లో కూడా చైనా తమ పరిధిని స్పష్టం చేసింది. భారత్​ వైఖరిలో మార్పు లేదు. నేపాల్​ మాత్రమే తన వాదనను మార్చుకుంది."

-ప్రొఫెసర్ ఎస్​డీ ముని, మాజీ దౌత్యవేత్త

చైనా సైన్యంతో భారత్​ ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న సమయంలో ఆగమేఘాల మీద నేపాల్ తన నూతన రాజకీయ చిత్ర పటాన్ని ఆమోదించిన విషయమే ఇప్పుడు నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బయటి దేశాల ప్రభావం నేపాల్​పై ఉందనే అనుమానాలకు తావిస్తోంది. జూన్ 18న నేపాల్ కొత్త మ్యాప్​ను ఆమోదించడం... గత వారమే చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించడం వంటివి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

నేపాల్ మ్యాప్​ వెనుక చైనా హస్తం?

ఉత్తరాఖండ్​లోని భారత్​, చైనా, నేపాల్​ ట్రైజంక్షన్​లో వాస్తవాధీన రేఖను చేరుకునేందుకు నిర్మించిన 80 కి.మీ రహదారిని మే 8న భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రారంభించారు. ఈ కొత్త రహదారి మానస సరోవర యాత్రకు వెళ్లే భక్తులపై ప్రయాణ భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. చైనాతో ఘర్షణ తలెత్తితే బలగాలను వెనువెంటనే సరిహద్దుకు తరలించడానికి భారత సైన్యానికి ఈ రహదారి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: భారత్​కు వ్యతిరేకంగా నేపాల్​లో చైనా చిచ్చు!

ఈ రహదారి ప్రారంభానికి ముందే లద్దాఖ్​ ప్రాంతంలో మే 5న భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలైంది. రహదారిని ప్రారంభించిన వెంటనే నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహనను ఈ చర్య నీరుగారుస్తుందని నిరసన తెలిపింది.

"లిపులేఖ్​ను అనుసంధానం చేస్తూ నేపాల్ భూభాగం మీదగా వెళుతున్న రహదారిని భారత్​ ప్రారంభించడం పట్ల నేపాల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోంది."

-మే 8న నేపాల్ ప్రభుత్వ ప్రకటన

ఈ ఆకస్మిక ప్రకటనే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణం ఇప్పటికిప్పుడే చేపట్టిందేమీ కాదు. రూ.81 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి భారత్​ 2015లోనే ఆమోదం తెలిపింది. తర్వాత 2018లో రహదారి నిర్మాణ వ్యయాన్ని రూ.439 కోట్లుగా సవరించింది. 2020 ఏప్రిల్ 17న రహదారి నిర్మాణం పూర్తయింది. కానీ ప్రారంభం మాత్రమే కాస్త ఆలస్యమైంది.

ఆర్మీ చీఫ్ అనుమానం!

ఈ నేపథ్యంలోనే నేపాల్ చర్య వెనక మరో దేశం ప్రమేయం ఉందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు.

"కాలీ నదికి పశ్చిమాన మేం రహదారి నిర్మించాం. కాలీ నదికి తూర్పున ఉన్న భూభాగాన్ని తమది అని నేపాల్ అంగీకరించింది. కాబట్టి ట్రైజంక్షన్ వద్ద అసలు సమస్యే లేదు. వేరొకరి ఆదేశాల మేరకే వారు(నేపాల్) ఈ సమస్యను లేవనెత్తారని అనుకోవచ్చు."

-జనరల్ ఎంఎం నరవణె, భారత ఆర్మీ చీఫ్

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారుతున్న సమయంలో నేపాల్ కేబినెట్ మే 18న కొత్త పటానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాన్ని గత వారం నేపాల్​ పార్లమెంట్​లోని ఉభయ సభలు ఆమోదించాయి. నేపాల్ చర్యపై భారత్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇలా వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనలు, నిరసనల మధ్య సాగుతున్న భారత్​-నేపాల్​ బంధం... మున్ముందు ఇంకెలాంటి మలుపు తిరుగుతుందన్నది ప్రశ్నార్థకం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.