ETV Bharat / opinion

నవ్యాలోచనతో ప్రవేశ పరీక్ష లేకుండా చేయలేమా?

కరోనా వైరస్​ అంతకంతకూ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంజినీరింగ్​ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షలు నిర్వహించడంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు పరీక్ష వాయిదాకు మొగ్గుచూపితే, మరికొందరు ఒకే దఫా పరీక్షలు మంచివని అంటున్నారు. ఇంకొందరు వినూత్న ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ అధ్యాపకులు సూచిస్తున్న కొత్త తరహా ఎంపిక ప్రక్రియను కనీసం కొన్నేళ్లపాటు ప్రయోగాత్మకంగా చేపట్టి, ఫలితాలను బేరీజు వేయాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఎంపికలకన్నా ఎంతో మెరుగైనది కాగా.. దీర్ఘకాలంలో సత్ఫలితాలనూ ఇవ్వవచ్చు.

CAN NOT DO WITHOUT THE ENTRANCE EXAM?
ప్రవేశ పరీక్ష లేకుండా చేయలేమా?
author img

By

Published : Sep 3, 2020, 9:41 AM IST

కరోనా వైరస్‌ జడలు విప్పి నర్తిస్తున్న ప్రస్తుత దశలో ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షలు నిర్వహించడం అభిలషణీయమేనా అనే చర్చ నడుస్తోంది. కొంతమంది ఐఐటీ ప్రొఫెసర్లు కరోనా కల్లోలం దృష్ట్యా పరీక్షల వాయిదాయే ఉత్తమమని భావిస్తుంటే, మరి కొందరు ఒకే దఫా పరీక్షతో ముగించడం ఉత్తమమని చెబుతున్నారు. ఇంకొందరు వినూత్న ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్‌ మాజీ ప్రొఫెసర్‌ పీఆర్కే రావు ప్రవేశ పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే పద్ధతిని సూచించారు. దీనికింద ఐఐటీలలో చేరగోరే విద్యార్థులు ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరకూడదు. అలాగే ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశం కోరే అవకాశం ఉండదు. ఐఐటీలలో చేరాలనుకునే విద్యార్థులు గరిష్ఠంగా రెండు బ్రాంచీలు, రెండు లేదా మూడు ఐఐటీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత స్థాయిని అందుకోలేని విద్యార్థులు కోర్సు నుంచి వైదొలగుతామని లిఖితపూర్వకంగా వాగ్దానం చేయాలి. నిర్దిష్ట కాలావధిలో ముందు వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం ప్రాతిపదికపై ప్రవేశాలు జరుగుతాయి.

ఇదీ ప్రక్రియ...

దేశంలో 23 ఐఐటీలుండగా, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన 3,289 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 15,53,809 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జేెఈఈ మెయిన్స్‌ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, దేశంలోని మొత్తం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఉన్న సీట్లకు సమానం. అంటే ఐఐటీ ఆశావహులందరికీ ఏదో ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు తప్పక లభిస్తుంది. ఏ రాష్ట్రంలోని ఐఐటీ, ఆ రాష్ట్రం లేదా ప్రాంతంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల సీట్లను అర్హులైన స్థానిక విద్యార్థులకు కేటాయించే బాధ్యతను తీసుకోవాలి. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని 296 ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని 1,42,972 సీట్లను ఆ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించే బాధ్యతను ఐఐటీ కాన్పూర్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం తీసుకుంటాయి. తమ రాష్ట్రంలో సీట్లు లభించని విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ఖాళీ సీట్లను పొందవచ్చు.

పారదర్శకంగానే..

దేశంలోని ఇంజినీరింగ్‌ సీట్లన్నింటికీ (15,53,809) సరిపడా విద్యార్థులు 23 ఐఐటీలలోని పరిమిత సీట్లకు పోటీ పడుతున్నారంటే అర్థం- ఒక్కో ఐఐటీ 67,557 మంది ఆశావహులను మూల్యాంకనం చేయవలసి వస్తోంది. ఒక్కో ఐఐటీలో 200 మంది అధ్యాపక సిబ్బంది ఉంటారు. ఒక్కో అధ్యాపకుడు ఎనిమిది గంటల పని దినంలో ఒక్కో విద్యార్థిని 15 నిమిషాలసేపు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేస్తారనుకుంటే, పదిన్నర రోజుల్లో 338 మందిని ఇంటర్వ్యూ చేయగలుగుతారు. రిజర్వుడు సీట్లకు, విద్యార్థినులకు కేటాయించే సీట్ల కోసం ఇంటర్వ్యూలూ ఇందులో కలిసి ఉంటాయి. ఈ విధంగా జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డు పరీక్షలతో నిమిత్తం లేకుండా మొత్తం సీట్లను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు, కౌన్సెలింగ్‌తోనే భర్తీ చేస్తారు. ఎవరికి ఏ బ్రాంచీ, ఏ కళాశాలను కేటాయించాల్సిందీ ఈ పద్ధతిలోనే నిర్ణయిస్తారు. అభ్యర్థుల సత్తా ఆధారంగా ఈ కేటాయింపు జరుగుతుంది. అంతిమంగా ఎంపిక అయిన విద్యార్థుల జాబితాను సంబంధిత ఐఐటీ వెబ్‌సైట్లో బహిరంగంగా ప్రకటిస్తారు కాబట్టి అంతా పారదర్శకంగా ఉంటుంది.

వ్యక్తిపరమైన పక్షపాతాలకు తావు లేకుండా అధ్యాపకుల బృందాలతో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలి. ఒక విద్యార్థి మొదటి సంవత్సరంలో కనబరచిన ప్రతిభను బట్టి మరుసటి సంవత్సరం వేరే బ్రాంచీలోకి మారే అవకాశం కల్పిస్తున్నారు. ఇదేవిధంగా వేరే కళాశాలకు మారే అవకాశాన్నీ కల్పించాలి. అంటే ఏదైనా ఇంజినీరింగ్‌ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన మొదటి సంవత్సరం విద్యార్థికి తదుపరి సంవత్సరం నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్‌, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల లేక ఎన్‌ఐటీ లేదా ఐఐటీలో ప్రవేశం పొందే అర్హత ఉండాలి. అతడు లేక ఆమె మొదటి సంవత్సరం ఐఐటీ సీటు పొందలేకపోయినా కఠోరశ్రమ, ప్రతిభ ఆధారంగా రెండో సంవత్సరం నుంచైనా ఆ అవకాశం పొందగలగాలి.

కోచింగ్‌ కేంద్రాలపై కొరడా

ఈ పద్ధతిలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియను ఆలస్యం లేకుండా, అధిక వ్యయప్రయాసలు లేకుండా సులువుగా, సమర్థంగా పూర్తి చేయవచ్ఛు ప్రస్తుతం కోచింగ్‌ సెంటర్ల పుణ్యమా అని ఏవో కొన్ని రాష్ట్రాల విద్యార్థులే అత్యధిక ఐఐటీ సీట్లను పొందుతున్నందు వల్ల ప్రాంతీయ అసమానతలు నెలకొంటున్నాయి. కొత్త ప్రక్రియలో ఈ అసమానతలను సరిదిద్దవచ్ఛు కొత్త జాతీయ విద్యా విధానం కూడా కోచింగ్‌ సెంటర్ల వల్ల జరుగుతున్న అపశ్రుతులను సరిదిద్దాలని చెబుతోంది. మున్ముందు కోచింగ్‌ కేంద్రాలు లేకుండా చేయాలనీ సంకల్పిస్తోంది. ఇంజినీరింగ్‌ చదవాలని కోరుకునే ప్రతి విద్యార్థికీ సీటు లభించే విధానాన్ని ప్రవేశపెట్టదలచింది. కోచింగ్‌ కేంద్రాల నుంచి వస్తున్న విద్యార్థుల్లో చాలామందికి ఇంజినీరింగ్‌పై నిజమైన ఆసక్తి ఉండటం లేదని, ఐఐటీ ముద్ర వేసుకుని లాభసాటి అయిన ఫైనాన్స్‌ వంటి రంగాలకు మళ్లాలని చూసేవారే ఎక్కువని ఐఐటీ అధ్యాపకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐఐటీ అధ్యాపకులు సూచిస్తున్న కొత్త తరహా ఎంపిక ప్రక్రియను కనీసం కొన్నేళ్లపాటు ప్రయోగాత్మకంగా చేపట్టి, ఫలితాలను బేరీజు వేయాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఎంపికలకన్నా ఎంతో మెరుగైనది. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే పద్ధతిగా చెప్పవచ్చు.

సందీప్​ పాండే, రచయిత - రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత

ఇదీ చదవండి: 2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.