ETV Bharat / opinion

వైద్యసేవలకు అనారోగ్యం.. పొంచి ఉన్న పెనుముప్పు

author img

By

Published : May 26, 2020, 9:26 AM IST

భారత్​ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కలలు కంటోంది. కానీ వైద్య, విద్యారంగాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా కరోనా మహమ్మారి దేశాన్ని పీక్కుతింటుంటే... సరిపడా వైద్య సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాల్సిన అవసరం ఉంది.

Illness for medical services in india
వైద్యసేవలకు అనారోగ్యం

రానున్న అయిదు సంవత్సరాల్లో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్‌ కలలను కరోనా భగ్నం చేస్తోంది. ఊహకందని రీతిలో అన్ని రంగాలనూ అది చావుదెబ్బ తీస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న నష్టం నుంచి కోలుకుంటూ భవిష్యత్తు వైపు దేశం తాను చేయాల్సిన ప్రయాణంలో కొన్ని మార్పులు చేసుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. అభివృద్ధి దేశానికి అత్యవసరం. అదే సమయంలో మనం ప్రయత్నిస్తున్నది ఎలాంటి స్వభావం ఉన్న అభివృద్ధికోసం అన్నది విశాల ప్రజానీకం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వైద్యం, విద్య వంటి సౌకర్యాలను ప్రతి ఒక్కరికీ చేరువచేసే విధానాలతో ముడివడిన సమగ్రాభివృద్ధిని సాధించినప్పుడే దేశంలో ప్రజల జీవన ప్రమాణాల్లోనూ మెరుగుదల కనిపిస్తుంది. ప్రపంచ దేశాల అనుభవం కూడా ఇదే. దురదృష్టవశాత్తు, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ మన పాలకులు వైద్య, విద్యారంగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దాని దుష్ఫలితాలను జాతి అనుభవిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రజారోగ్యంపై పెట్టే వ్యయం చాలా తక్కువ.

వ్యయం అంతంతమాత్రం...

తాజా గణాంకాల ప్రకారం భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.6శాతమే ప్రజారోగ్యంపై ఖర్చుపెడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కొద్ది సంవత్సరాలుగా పెట్టే ఖర్చును తగ్గించుకుంటూ వస్తున్నారు. 2004-05లో ప్రజారోగ్యంపై చేసిన వ్యయం 4.2శాతం. ఇక్కడ మరో కీలకమైన అంశమూ ఉంది. ఈ ఖర్చంతా ప్రభుత్వమే పెట్టింది కాదు. దాంతో పాటు ప్రజలు పెట్టే ఖర్చులు, ఇన్సూరెన్సు కంపెనీలు చెల్లించే ప్రీమియం, విదేశాలనుంచి వచ్చే విరాళాలు, స్వచ్ఛంద సంస్థలు చేసే ఖర్చులు... కలిసి ఉంటాయి. ఇందులోనూ ప్రజలు సొంతంగా భరించేదే అత్యధికం. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖకు అనుబంధంగా ఉండే జాతీయ ఆరోగ్య గణాంక విభాగం కొంతకాలం కిందట విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆరోగ్యంపై చేసిన మొత్తం వ్యయం రూ.5.81లక్షల కోట్లు. ఇది జీడీపీలో 3.8శాతం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెట్టింది రూ.1.88 లక్షల కోట్లు. ఇది మొత్తం వ్యయంలో కేవలం 32శాతం. దేశ జనాభాలో ఒక్కొక్కరిపై తలసరి 1,418 రూపాయలు అన్నమాట. ఇక ప్రజలు సొంతంగా పెట్టుకున్న ఖర్చు రూ.3.40లక్షల కోట్లు. ఇది మొత్తం ఖర్చులో 58.7శాతం. ప్రజల తలసరి భారం రూ.2,570. ఆరోగ్యానికి సంబంధించిన వ్యయాన్ని ఈ స్థాయిలో ప్రజలపై మోపే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. ఆరోగ్యంపై అయ్యే మొత్తం ఖర్చులో చైనాలో 36, బ్రిటన్‌లో 16, జపాన్‌లో 12.85, జర్మనీలో 12.67, బ్రెజిల్‌లో 27.46శాతాల వంతున మాత్రమే ప్రజలు భరిస్తున్నారు. మిగిలినదానిలో అత్యధిక శాతం ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ప్రపంచంలోని నిరుపేదల్లో సగం మంది ఉన్న భారతదేశం మాత్రం- ప్రజారోగ్యం తన ప్రాధాన్యరంగం కాదని అధికభారాన్ని ప్రజలపై వేస్తున్నది. మన దగ్గర సామాన్య ప్రజలు తరచూ అప్పుల పాలయ్యేది ఆరోగ్యపరమైన అవసరాలకోసమే. సాధారణ విష జ్వరాలకూ వేల రూపాయల ఖర్చును భరించాల్సిన దుస్థితి ఇక్కడ ప్రజానీకానిది. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు భారమై భారత్‌లో 2017లో 5.50 కోట్ల జనాభా పేదరికంలోకి జారుకున్నట్లు 'పబ్లిక్‌హెల్త్‌ పౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా' చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సంఖ్య దక్షిణ కొరియా, స్పెయిన్‌, కెన్యా వంటి దేశాల జనాభా కంటే అధికం. ఇలా పేదరికంలోకి వెళ్లినవారిలో 3.8 కోట్ల మంది మందుల కొనుగోళ్ల ఖర్చును భరించలేకనే పేదరికంలో కూరుకుపోయారని ఆ అధ్యయనంలో తేలింది. కేన్సర్‌, గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల చికిత్స కోసం భారత్‌లో సామాన్యులు ఎక్కువగా అప్పులపాలవుతున్నారని, ప్రమాదాల్లో గాయపడిన వారు కోలుకునేందుకు ఆస్పత్రుల్లో చేయాల్సిన ఖర్చులూ వారు భరించలేని స్థాయిలో ఉంటున్నాయని ఆ నివేదికలో తేలింది.

పడకల సౌకర్యమేదీ?

ఇక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఒక్కో తల్లికి ఒక్కో పడక ఇవ్వలేక ఒకే పడకపై ఇద్దరిని బిడ్డలతో సహా సర్దుకొమ్మనే పరిస్థితి మనవద్దనే కనిపిస్తుంది. డెంగీవంటి జర్వాలు ప్రబలి కాస్త ఎక్కువమంది అనారోగ్యం పాలైనప్పుడు ఆస్పత్రిలో పడక సంపాదించేందుకు సిఫార్సు కోసం మంత్రులవద్దకు, ఎమ్మెల్యేలవద్దకు వెళ్లాల్సిన దుర్గతీ తాండవిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2018లో ప్రపంచంలో క్షయ సోకిన వారిలో 27శాతం భారత్‌లోనివారే. ఆ ఏడాది మన దేశంలో క్షయతో చనిపోయినవారి సంఖ్య 4.4లక్షలు. అంటే సగటున రోజుకు 1,216 మంది. అందుకే మన దేశానికి ఎలాంటి అభివృద్ధి అవసరమో, దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రాధాన్యాలు కీలకమో- మన ప్రభుత్వాలు ఇకపై భిన్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు నేడున్నాయి. ఒక సమాజంలో మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు. వారి నుంచి మెరుగైన ఉత్పాదకత సాధ్యం అవుతుంది. వారు ఎక్కువ ఆదాయాలను సంపాదించగలుగుతారు. తమ అవసరాలకోసం డబ్బులనూ ఖర్చుపెట్టుకోగలుగుతారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు ఊతం కలిగించే అంశాలే. ఆరోగ్య రంగంలో భారత్‌ అనుసరిస్తున్న నమూనా దుష్ఫలితాలనిస్తోందని, ప్రపంచంలో ఆరోగ్యరంగాన్ని అత్యధికస్థాయిలో ప్రైవేటీకరణ చేసిన దేశాల్లో భారత్‌ ఒకటని... అందువల్లనే ఈ రంగంలో దీని ప్రమాణాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తీసికట్టుగా ఉంటున్నాయని అమర్త్యసేన్‌ వంటి మేధావులు ఎప్పటినుంచో చెబుతున్నారు.

పొంచి ఉన్న పెనుముప్పు

కరోనా ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే పదికోట్లమందికి పైగా ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. కొద్దికాలంలోనే ఆకలి అనేది తీవ్రమైన సమస్యగా మనకు ఎదురుకాబోతోందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పౌష్టికాహార లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మహిళలు, పిల్లలు, వృద్ధులపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. తిండికే డబ్బులులేని జనం వైద్యం కోసం ఎలా ఖర్చుపెట్టగలరు? అందుకే తక్షణ ప్రాధాన్యంగా ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలి. ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలి. మన జనాభా అవసరాలకు సరిపడిన స్థాయిలో వైద్యులు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తల సంఖ్యను, ఇతర సౌకర్యాలను పెంచుకునే ప్రణాళికలు రచించి అమలుపరచాలి. ప్రాణావసరాలైన మందులకోసం సామాన్యులు అప్పులు చేసే దుర్గతి ఉండకూడదు. ప్రభుత్వం ఉచితంగా వాటిని సరఫరా చేయాలి. జీడీపీలో ఇప్పుడు పెట్టే ఖర్చును రెట్టింపు చేయగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయనేది నిపుణుల విశ్లేషణ. పాలకులకు సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యమైంది కాదు!

- ఎన్‌.విశ్వప్రసాద్‌ (రచయిత)

ఇదీ చూడండి: క్వారంటైన్​తో తల్లి కడచూపునకు దూరమై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.