ETV Bharat / opinion

పేరుకుపోతున్న మొండి బకాయిలు- ఇలా చేస్తే మేలు!

author img

By

Published : Jul 9, 2021, 7:45 AM IST

దేశీయంగా బ్యాంకుల్లో ఎన్నాళ్లుగానో పేరుకుపోతోన్న నిరర్థక ఆస్తుల (ఎన్​పీఏ) పద్దు వచ్చే మార్చి నాటికి తగ్గనుందని ఓ రేటింగ్​ ఏజెన్సీ పేర్కొంది. అయితే విశ్లేషకులు అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. సరైన చర్యలు చేపడితేనే ఎన్‌పీఏల విస్తరణను ఆదిలోనే అడ్డుకోగల వీలుంటుందని సూచిస్తున్నారు.

NPA problem Indian banks
బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల సమస్య

దేశీయంగా బ్యాంకుల్లో ఎన్నాళ్లుగానో పారుబాకీలు కొండల్లా పేరుకుపోతున్నాయి. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా వ్యవహరించే మొండి బకాయిల పద్దు వచ్చే మార్చి నాటికి తగ్గనుందని రేటింగ్‌ ఏజెన్సీ 'ఇక్రా' చెబుతున్నా- ఇతర విశ్లేషణలు ఆందోళనకర దృశ్యాన్నే ఆవిష్కరిస్తున్నాయి. అయిదేళ్లక్రితం ప్రవేశపెట్టిన దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ) పనితీరు, వికటించిన చికిత్సకు దాఖలాగా పరువు మాస్తోంది. ఇన్నేళ్లలో దాని ద్వారా బ్యాంకుల బాకీల్లో వసూళ్లు ఏపాటి అన్న ప్రశ్నకు దిగ్భ్రాంతి కలిగించే సమాధానం దూసుకొస్తుంది. వివిధ వ్యాపార సంస్థల నుంచి రావాల్సిన బకాయిల్లో దివాలా పరిష్కారం కింద బ్యాంకులు కొన్ని సందర్భాల్లో 98 శాతం వరకు వదులుకోవాల్సి వస్తున్నదంటే, ఎవరైనా దిమ్మెరపోవాల్సిందే. తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించని సంస్థల నుంచి వీలైనంత రాబట్టుకోవడం, రుణాలు ఎగవేసిన సంస్థల్ని వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి బదలాయించి తద్వారా మొండిబాకీల పరిమాణాన్ని సాధ్యమైనంతగా కుదించడం- దివాలా స్మృతి ప్రధాన లక్ష్యాలు.

వీడియోకాన్‌, శివ ఇండస్ట్రీస్‌ అండ్‌ హోల్డింగ్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రభృత సంస్థల దివాలా పరిష్కారాల తీరుతెన్నులు పరికిస్తే, సుమారు 95శాతం మేర అప్పులూ వడ్డీల్ని తెగ్గోస్తేనే గాని కొనుగోలుదారులు ముందుకు రాని వైనం- ఐబీసీ రూపేణా అహేతుక చికిత్సను కళ్లకు కడుతుంది. దివాలా స్మృతికింద పునర్‌ వ్యవస్థీకరణ లేదా ఆస్తుల విక్రయానికి విధించిన గరిష్ఠ గడువు 270 రోజులు. మూడు వందలకు పైగా కార్పొరేట్‌ రుణ గ్రహీతల కేసుల్ని విశ్లేషిస్తే పరిష్కార ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి పట్టిన సగటు వ్యవధి 441 రోజులుగా లెక్క తేలుతుంది. నిర్దేశించిన గడువును తుంగలో తొక్కి, దివాలా స్థితిలోని కంపెనీల్ని సొంతం చేసుకోవడానికి బడా సంస్థలు విదిపే స్వల్ప మొత్తాన్నే బ్యాంకులు విధిలేక తీసుకోవాల్సి రావడం- అదెంతటి లోపభూయిష్ఠ చికిత్సో ప్రస్ఫుటీకరిస్తోంది!

ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ?

ఒక పక్క మొండిబాకీలు, మరోవైపు విశృంఖల మోసాలు... బ్యాంకుల ఆర్థిక స్వస్థతకు తూట్లు పొడుస్తున్నాయి. ఇంటిదొంగల ఉరవడి ఆనవాళ్లను పట్టిస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో వేలకోట్ల రూపాయలకు రెక్కలొచ్చి ఎగిరిపోతుంటే ఏడేళ్లపాటు ఆడిట్‌, నియంత్రణ సంస్థలు ఏం వెలగబెట్టాయని ఆర్థికమంత్రిగా అరుణ్‌ జైట్లీ నిగ్గదీసినప్పుడు కిక్కురుమన్న నాథుడు లేడు. బాకీల చెల్లింపు రికార్డు అధ్వానంగా ఉన్నవాళ్లకు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సైతం రుణాలు ఎలా మంజూరవుతున్నాయన్న కేంద్ర నిఘా సంఘం (సీవీసీ) సూటిప్రశ్నకూ సరైన జవాబు కొరవడింది. అప్పులు ఎగ్గొట్టి ఎవరూ విదేశాలకు ఎగిరిపోకుండా కట్టడి చేసేందుకంటూ అనుమానితులపై ప్రాథమిక సమాచార నివేదిక తయారు కాకముందే లుకౌట్‌ నోటీసుల జారీని కోరే అవకాశాన్ని బ్యాంకుల ఛైర్మన్లు, ఎమ్‌డీలు, సీఈఓలకు దఖలుపరచినా- ఏం ఒరిగింది?

కేవలం నాలుగేళ్లలో రూ.1.79 లక్షల కోట్ల పారుబాకీల్ని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేయాల్సి వచ్చింది. పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటివీ మొండిబాకీల బరువు తట్టుకోలేక విలవిల్లాడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రుణ లభ్యత మార్గాలు మూసెయ్యడంతోపాటు, కోట్ల రూపాయల బాకీ చెల్లింపుల క్రమంపై అనుమానాలు తలెత్తడంతోనే బ్యాంకులు అప్రమత్తమైతే- ఎన్‌పీఏల విస్తరణను ఆదిలోనే అడ్డుకోగల వీలుంటుంది. ఈ అయిదేళ్ల అనుభవాలను సాకల్యంగా సమీక్షించి దివాలా పరిష్కార స్మృతిని అత్యవసర ప్రాతిపదికన పరిపుష్టీకరించాల్సి ఉంది. పారుబాకీల్ని కనిష్ఠస్థాయికి కుదించగలిగిననాడు దేశార్థికంలో రుణలభ్యత గణనీయంగా పెంపొందుతుంది. పరిశ్రమలకైనా వ్యవసాయ అవసరాలకైనా సకాలంలో సరైన రుణవసతి ఇనుమడిస్తే- కీలక ప్రాధాన్యరంగాలు తేజరిల్లుతాయి. బ్యాంకుల్లో మేటవేసిన నిష్పూచీతనాన్ని చెదరగొట్టే సమగ్ర పకడ్బందీ చికిత్స దేశానికి బహుళ ప్రయోజనదాయకమవుతుంది!

ఇదీ చూడండి: 'కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.