ETV Bharat / opinion

బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు 'ఆర్డినెన్స్' రూపం - బ్యాంకింగ్ రంగ వ్యవస్థ

బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ పాలనను కట్టుదిట్టం చేసి, ఆర్థిక మధ్యవర్తులపై నియంత్రణ పెంచాలనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం 1949-బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు చేసింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు తగిన సమయంలో స్పందించి సంక్షోభాన్ని నివారించే విధంగా ఆర్డినెన్సు తీసుకొచ్చింది. ప్రైవేటు బ్యాంకులపై నిషేధం విధించకుండానే.. డిపాజిట్ల ఉపసంహరణకు వీలు కల్పించేలా చట్టంలోని సెక్షన్ 45ను సవరించింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, కింది స్థాయి కస్టమర్లకు అందే ఫలాల గురించి ప్రొఫెసర్ డా. కె. శ్రీనివాస రావు అందించిన ప్రత్యేక విశ్లేషణ.

Hastening bank reforms - the ordinance way
ఆర్డినెన్స్​ మార్గంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణలు
author img

By

Published : Jun 30, 2020, 12:51 PM IST

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లతో పాటు ప్రస్తుత సమస్యలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయడమనేది ఓ నిరంతర ప్రక్రియ. స్థిరమైన, సురక్షితమైన వ్యవస్థను స్థాపించి ఆర్థిక వృద్ధికి బాటలు పరిచే విధంగా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు వినూత్నమైన విధివిధానాలను రూపొందిస్తూనే ఉన్నాయి.

ఒడుదొడుకుల్లో రంగం

వేర్వేరు కారణాలతో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఎల్​ఎఫ్​ఎస్​ఎల్​), పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్​ దగ్గరి నుంచి తాజాగా ఎస్​ బ్యాంక్ వరకు ఎన్నో బ్యాంకులు ఇందుకు ఉదహరణగా నిలుస్తున్నాయి.

'సహకారం'లోనూ

ఇదేతరహా వైఫల్యాలే సహకార బ్యాంకుల్లోనూ కనిపిస్తున్నాయి. జీవనోపాధిపై ప్రభావం చూపే విధంగా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల ప్రయోజనాలను ఈ వైఫల్యాలు దెబ్బతీస్తున్నాయి. దిగువ, మధ్య స్థాయి వర్గానికి శతాబ్ద కాలం పాటు ఈ సహకార బ్యాంకులు సమర్థంగా సేవలందిస్తూ వచ్చాయి. ఆర్థిక వ్యవస్థలో దిగువ, మధ్య స్థాయి కుటుంబాలను భాగస్వామ్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతల వల్ల ఈ సంస్థల అభివృద్ధి, అవకాశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఫలితంగా చాలా మంది వాటాదారులు తమ విశ్వాసం కోల్పోయారు.

ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ పాలనను కట్టుదిట్టం చేసి, ఆర్థిక మధ్యవర్తులపై నియంత్రణ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పాటు నియంత్రణ సంస్థలకు తగిన సాధికారికత అందించడం అత్యావశ్యకమైపోయింది.

ఆర్డినెన్స్

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే భారత ప్రభుత్వం బ్యాంకింగ్ నియంత్రణ(బీఆర్​ఏ) చట్టం-1949కి సవరణలు చేసింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్​బీఐ తగిన సమయంలో స్పందించి సంక్షోభాన్ని నివారించే విధంగా ఆర్డినెన్సు తీసుకొచ్చింది.

సవరణ లాభాలు

బీఆర్​ఏ-1949 సెక్షన్ 45ను సవరించడం వల్ల ప్రైవేటు బ్యాంకులపై నిషేధం విధించకుండానే.. డిపాజిట్ల ఉపసంహరణకు వీలు కలుగుతుంది. మారటోరియం విధించకుండానే పునర్నిర్మాణం(రీకన్స్​స్ట్రక్షన్), సంలీనం(అమాల్గమేషన్) ప్రక్రియలు చేపట్టేలా ఆర్​బీఐకి అధికారం లభిస్తుంది.

అంతకుముందు... ప్రైవేటు బ్యాంకుల్లో సంక్షోభం కారణంగా కస్టమర్లు/రుణగ్రహీతలు ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతే ఆర్​బీఐ సెక్షన్ 45ను ప్రయోగించాల్సి వచ్చేది. తొలుత మారటోరియం విధించి, ఓ అడ్మినిస్ట్రేటర్​ను నియమించి, అనంతరం డిపాజిట్ల ఉపసంహరణపై పరిమితులు విధించిన తర్వాతే పునర్నిర్మాణ పనులను చేపట్టాల్సి వచ్చేది.

మారటోరియం విధించడం వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడుతుంది. డిపాజిట్లపై ఆంక్షలు విధించడం వల్ల నగదు ప్రవాహం ఆగిపోతుంది. రోజూవారీ కార్యకలాపాలు సాగించే బ్యాంక్ కస్టమర్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సామాజిక భయాందోళనలకు దారితీస్తుంది.

పాలనకు మెరుగులు!

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి పరిణామం. దీని వల్ల సంక్షోభం కస్టమర్లపై ప్రభావం చూపక ముందే ప్రైవేటు బ్యాంకులపై చర్యలు తీసుకునే అధికారం ఆర్​బీఐకి లభిస్తుంది. కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాల్లో అనిశ్చితులు నెలకొన్నందున.. ఆర్థిక సంస్థల పతనాన్ని నిరోధించేలా నిఘా, వ్యవస్థీకృత నియంత్రణలు చాలా అవసరం.

తీవ్రమైన సంక్షోభ సమయంలో ఆర్​బీఐ సెక్షన్ 45ను ప్రయోగించే అవకాశం ఉందని గ్రహిస్తాయి కాబట్టి... బ్యాంకులు తమ పాలనను మరింత మెరుగుపర్చుకుంటాయి.

సహకార బ్యాంకులపై ప్రభావం

బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్​లో మరో ప్రధానమైన అంశం బీఆర్​ఏ-1949 సెక్షన్ 56ను సవరించడం. దీని ద్వారా సహకార రంగ పర్యవేక్షణపై ఆర్​బీఐకి పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఫలితంగా సహకార బ్యాంకులు నిర్వహణను మెరుగుపడి... కిందిస్థాయిలో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది.

1,482 పట్టణ సహకార బ్యాంకులతో పాటు, 58 అంతర్​ రాష్ట్ర సహకార బ్యాంకులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ బ్యాంకుల్లో 8.6 కోట్ల మంది చేసిన రూ. 4.84 లక్షల కోట్ల డిపాజిట్లతో పాటు... మొత్తం బ్యాకింగ్ రంగ డిపాజిట్లైన రూ. 138 లక్షల కోట్లు సురక్షితంగా ఉంటాయి.

బలహీనమైన కార్పొరేట్ పాలన వల్ల సహకార రంగం కుదేలై బ్యాంకింగ్ రంగ వైఫల్యాలకు దారితీసింది. సహకారం అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి బ్యాంకుల నిర్వహణకు కావాల్సిన నియంత్రణ ఆర్​బీఐకి లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 10ఏలో ఉన్న మినహాయింపులు వీటికి వర్తించవు. సెక్షన్ 10బీలో పేర్కొన్న విధంగా సీఈఓ/బోర్డు సభ్యులకు తగిన ప్రమాణాలు కూడా ఇందులో ప్రస్తావించలేదు.

సహకార సంఘాలకు బెంగలేదు!

ఈ కొత్త ఆర్డినెన్సు వల్ల ప్రస్తుతమున్న సహకార సొసైటీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల(పీఏసీఎస్)తో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం దీర్ఘకాల రుణాలు ఇచ్చే సహకార సంఘాలకు ఈ నూతన సవరణలు వర్తించవు. ఈ సంస్థలన్నీ 1904-సహకార సంఘాల చట్టం ప్రకారమే నడుచుకుంటాయి.

ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్. గాంధీ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించడం అవసరం. 2015లో విడుదలైన ఈ నివేదికలో బ్యాంకింగ్ రంగంలోని అనేక బలహీనతలను గుర్తించి ఈ రంగ పునరుత్తేజానికి కావాల్సిన సిఫార్సులు చేసింది.

పట్టణ సహకార బ్యాంకులను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా మార్చడం అందులో ఒకటి. ఇందులో కొన్ని బలమైన చిన్న వాణిజ్య బ్యాంకులుగా మారగలవు. తద్వారా వాటాదారులకు చాలా ప్రయోజనం కలుగుతుంది.

ఆర్​బీఐ ముందుచూపు!

కరోనా సహా ఇతర కారణాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేలా బ్యాంకింగ్ రంగాన్ని మరింత దృఢంగా మార్చేందుకు ఆర్​బీఐ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్​బీఐ విడుదల చేసిన 'భారత్​లోని వాణిజ్య బ్యాంకుల్లో పరిపాలన' చర్చా పత్రాన్ని ఆర్డినెన్స్​తో కలిపి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అంతే కాకుండా భారత్​ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈ ఆర్డినెన్స్ వల్ల ఆర్​బీఐకి కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం 141 బ్యాంకులను పర్యవేక్షిస్తున్న ఆర్​బీఐ... పెద్ద సంఖ్యలో ఉన్న సహకార బ్యాంకులను పర్యవేక్షించడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కింది స్థాయిలో ఉన్న వినియోగదారులతో అనుసంధానం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న భౌగోళిక వైవిధ్య సంస్థలపై నిఘా పెంపొందించడానికి భారీ ఎత్తున మానవవనరులను పెంచుకోవాల్సి ఉంటుంది.

వినియోగదారులకు మేలే

ఈ కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లు సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. సహకార బ్యాంకింగ్ వ్యవస్థ సాంకేతికంగా ఉన్నతంగా లేదు కాబట్టి భవిష్యత్తు సవాళ్లు మరింత భయంకరంగా ఉంటాయి. అయితే వినియోగదారుల కోణంలో చూస్తే ఈ చర్యలన్నీ ప్రయోజనం చేకూర్చేవే. డిపాజిట్లపై రూ. 5 లక్షల బీమా కల్పించడం, బ్యాంకులతో పాటు సహకార శాఖలలో కార్యకలాపాలను మెరుగుపర్చడం వల్ల వారికి ఎనలేని మేలు కలుగుతుంది.

(రచయిత-డా. కె.శ్రీనివాస రావు, అనుబంధ ఆచార్యులు, ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్​మెంట్-ఐఐఆర్​ఎం, హైదరాబాద్)

ఇదీ చదవండి- రూ.3.46 అప్పు తీర్చేందుకు 15 కి.మీ. నడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.