naveen murder case update: తాను ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో తన ఫ్రెండ్ నవీన్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఇంటర్ చదువుకున్న రోజుల్లో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం... ఆ అమ్మాయి నవీన్‌కి క్లోజ్ అవుతుందనే భయంతో.. హరహరకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. హరహరకృష్ణ తన స్నేహితుడు నవీన్‌ను ముక్కలు ముక్కలుగా నరికాడు.
ఈ కేసు గురించి రాచకొండ సీపీ చౌహన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు హరహరకృష్ణ.. తన స్నేహితుడు నవీన్‌ను కత్తితో కడుపులో పొడిచి.. ఆ తర్వాత మర్మాంగాలను కోశారని తెలిపారు. తల, మొండెం వేరు చేసిన హరహర కృష్ణ... నా ప్రియురాలిని ప్రేమిస్తావా.. అంటూ శరీరం నుంచి గుండెను వేరుచేశాడని పోలీసులు పేర్కొన్నారు. హరహరకృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది... యువతి విషయంలో 17వ తేదీ రాత్రి నవీన్, హరహర కృష్ణ గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. కింద పడిపోయిన నవీన్‌ను గొంతు పట్టి ఊపీరి ఆడకుండా చేసి హరహర కృష్ణ చంపాడు. నవీన్ మృతిచెందాక తన వెంట తెచ్చుకున్న కత్తితో తల, మొండెం వేరు చేశాడు. ఆ తర్వాత నవీన్ గుండెను చీల్చాడు. మర్మాంగాలను కోసి.. నవీన్ చేతి వేళ్లను కట్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫొటోస్ అమ్మాయికి పంపించాడు. ఇదంతా డీ మార్ట్‌లో రెండు నెలల క్రితం కొన్న కత్తితో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం హరహర కృష్ణను అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై మృతుడి బంధువులు అబ్దుల్లాపుర్ మెట్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేస్తామని పోలీసులు వెల్లడించారు. కఠిన శిక్ష పడేలాగా చర్యలు ఉంటాయన్నారు. నవీను హత్య చేయడం బాధాకరమన్న పోలీసులు.. హరికృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు వివరించారు. హరహరపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: