ETV Bharat / opinion

బంగారానికి రెక్కలొచ్చాయ్​- 'సీబీఐ' కాకమ్మ కథలు! - మద్రాస్​ హైకోర్టు

తమిళనాడు సీబీఐ కస్టడీ నుంచి ఇటీవల 103 కేజీల బంగారం అదృశ్యమైందన్న ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ ప్రతిష్ఠ దిగజారుతుందని ఆక్రోశిస్తోంది.

gold worth 45 crore missing in CBI custody madras highcourt probe investigation
సీబీఐ కాకమ్మ కథలు
author img

By

Published : Dec 20, 2020, 7:15 AM IST

Updated : Dec 20, 2020, 8:57 AM IST

ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న సామెత ఊరికే పుట్టలేదు. చోరకళలో ఎంతగా చేయి తిరిగినవాడైనా నేర ప్రదేశంలో పొరపాటునో, గ్రహపాటునో తన ఆనుపానుల్ని పట్టించే కొన్ని సాక్ష్యాల్ని వదిలిపెడతాడంటాయి పోలీసు దర్యాప్తులు. అదే ఇంటిదొంగైతే చురుగ్గా పని కానిచ్చేయడమే కాదు, ఇంటిగుట్టు రట్టు అయితే పరువు పోతుందన్న బెదురుతో వాస్తవాల్నీ కప్పిపుచ్చేస్తాయి బొడ్డుపేగు బంధాలు! దొంగల్ని పట్టుకొనే పోలీసుల్లో- దొంగసొత్తును కాజేసే పోలీసు దొంగలు తామర తంపరగా పుట్టుకొస్తున్నారు. జాతీయస్థాయి నేర దర్యాప్తుల్లో తన సాటి ఎవరూ లేరని ఘనంగా చాటుకొనే కేదస(సీబీఐ)లోనూ ఆ తరహా చేతివాటంగాళ్ల ఉరవడి- ఏకంగా 103 కిలోల బంగారానికి కాళ్లొచ్చేలా చేసింది. దానిపై రాష్ట్ర సీఐడీ పోలీసుల దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశించగానే తన పరువు గంగలో కలుస్తుందంటూ కేదస ఆక్రోశించింది. ఆ ప్రహసనాన్ని చిత్తగించండి!

ఎనిమిదేళ్ల క్రితం సురానా కార్పొరేషన్‌ అనే సంస్థపై దాడులు చేసిన కేదస మొత్తం 400.47 కిలోల బంగారాన్ని, ఆభరణాల్ని స్వాధీనపరచుకొంది. మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు బంగారం దిగుమతి చేసుకొనే సురానా కార్పొరేషన్‌కు అనుచిత లబ్ధి కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో భాగంగా జరిపిన దాడి అది. ఎంఎంటీసీ అధికారుల్ని అవినీతి కేసులో ప్రాసిక్యూట్‌ చెయ్యడానికి స్వాధీనపరచుకున్న బంగారంతో పనిలేదన్న కేదస- విదేశీ వాణిజ్య విధాన ఉల్లంఘనకు పాల్పడిందంటూ సురానా కార్పొరేషన్‌పై 2013లో మరో కేసు పెట్టింది. దరిమిలా నేరం ఏమీ జరగలేదంటూ కేసును మూసేయగా, ఆ బంగారం ఎవరిదో అవినీతి కేసు విచారణలోనే నిగ్గు తేలుతుందంటూ దాన్ని విదేశీ వాణిజ్య విభాగ డైరెక్టర్‌ జనరల్‌కు బదలాయించాలని కేదస ప్రత్యేక కోర్టుకు విన్నవించింది. ఎస్‌బీఐ సహా బ్యాంకుల నుంచి తాము రుణాలు తీసుకొన్నందువల్ల బంగారాన్ని తమకు అప్పగించాలని సురానా కార్పొరేషన్‌ కోరడం, ఆ సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభించిన బ్యాంకులకు మొత్తం స్వర్ణాన్నీ బదలాయించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించడంతో అసలు లొసుగు బయటపడింది.

కాకమ్మ కథ

స్వతంత్ర సాక్షుల సమక్షంలో మొత్తం బంగారాన్ని 400.47 కిలోలుగా నిర్ధారించి దాన్ని సురానా కార్పొరేషన్‌ ఖజానాలోనే సురక్షితంగా సీళ్లు వేసి, మొత్తం 72 తాళాలతో భద్రతను కట్టుదిట్టం చేసి ఆ తాళం చెవుల్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించామని కేదస చెబుతోంది. ఆ బంగారాన్ని యథాతథంగా ఎస్‌బీఐకి అప్పగించాల్సిన సమయంలో తూకం వేసి చూస్తే అక్షరాలా 103 కిలోల బంగారం తరుగు పడింది. అందుకు, ఏమాత్రం తడుము కోకుండా కేదస చెప్పిన కథా సంవిధానం వింటే ఎంతటి గణకులైనా బిత్తరపోవాల్సిందే. అప్పట్లో బంగారం కడ్డీలను ఏకమొత్తంగా తూచారట! అదే ఇప్పుడు దేనికదిగా తూచడంతో అంత తేడా కనిపిస్తోందట! ఈ కేదస కథల ముందు కాకమ్మ కథలు ఏ పాటి?

అగ్ని పరీక్ష

తరుగుపడిన బంగారాన్ని కేదస అప్పగించేలా చూడాలంటూ మద్రాస్‌ హైకోర్టుకు చేరిన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆ సంస్థ విడ్డూర వాదనలు వినిపించింది. స్థానిక పోలీసులతో కాకుండా, పొరుగు రాష్ట్ర సీబీఐతో గాని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తోగాని దర్యాప్తు జరిపించాలని, స్థానిక పోలీసులు దర్యాప్తు సాగిస్తే తమ ప్రతిష్ఠ దెబ్బతింటుందని కేదస వాపోయింది. ఆ వాదనను అడ్డంగా కొట్టేసిన న్యాయపాలిక- కేదసకు ప్రత్యేకంగా కొమ్ములేవీ లేవని, పోలీసులందర్నీ విశ్వసించాల్సిందేనంటూ చేసిన వ్యాఖ్యలు కీలకమైనవి. కేదస అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సిందేనంటూ ఆర్నెల్లలోగా పోలీసు దర్యాప్తు పూర్తి కావాలని, అందులో కేదస నిజాయతీ నిగ్గు తేలితే దాని ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని లేకపోతే శిక్షకు సిద్ధపడాల్సిందేననీ స్పష్టీకరించింది. అయినా కేదస పిచ్చిగాని- పరువు, దాని తాలూకు బరువు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతల్ని ఏనాడో వదిలేసిన సంగతిని మరిచిపోయినట్లుంది. తన అజమాయిషీలో రూ.43 కోట్ల విలువైన బంగారం కనబడకుండా పోయినప్పుడే తన పరువు బజార్న పడిందని కేదస ఎందుకు గ్రహించడం లేదో మరి!

అక్రమంగా సాగే లావాదేవీల్లో, దొంగ రవాణా దారుల్లో నిఘా దర్యాప్తు సంస్థలకు చిక్కే బంగారం, మాదక ద్రవ్యాలవంటివి అంతిమంగా ఏమవుతున్నాయి అన్నది సగటు పౌరుణ్ని వేధించే ప్రశ్న. 2005-15 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 60 లక్షల కిలోల మాదకద్రవ్యాల్ని పట్టుకొన్నారని, 16 లక్షల కిలోల్ని ధ్వంసం చేశారనీ రికార్డులు చాటుతుంటే, తక్కిన సరకంతా ఎటుపోయిందో అజాపజా లేదని సుప్రీంకోర్టుకే విన్నవించాయి ప్రభుత్వ వర్గాలు! ఎనిమిదేళ్ల క్రితం చెన్నైలోని ఫ్లవర్‌ బజార్‌ పోలీసు ఠాణాలో భద్రపరచిన 144 కిలోల మాదక ద్రవ్యాలు మాయం కావడంపై ప్రత్యేక కోర్టు తీవ్రంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2015లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కార్యాలయాల నుంచే వందకిలోల సరకు గల్లంతైంది. ఇంటిదొంగల హస్తలాఘవం ఇంతంత కాదనడంలో సందేహం ఏముంది?

విదేశాల నుంచి ప్రయాణికులు అక్రమంగా తెస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకొని భద్రపరచేందుకు కస్టమ్స్‌ విభాగానికి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షిత ఖజానా ఒకటి ఉంది. దాని నుంచి వందకిలోల బంగారం దొంగతనానికి గురికావడంపై కేదస దర్యాప్తు జరుపుతోంది! దానికి సంబంధించిన వివరాల ఆరా సమాచార హక్కు చట్టం కింద కోరితే- కస్టమ్స్‌ విభాగం వింతగా స్పందించింది. ఇంకా ఎంత బంగారం నిల్వ ఉందో చెబితే దానికి భద్రత లేకుండా పోతుందట! నేరం పూర్వాపరాలు చెబితే కేదస దర్యాప్తు కుంటువడుతుందట! గుజరాత్‌లోని జామ్‌నగర్‌ కస్టమ్స్‌ విభాగం అజమాయిషీ నుంచి తాజాగా కోటీ 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారానికి రెక్కలొచ్చి ఎగిరి పోయింది. ఎవరైనా, ఎప్పుడైనా స్వాధీనం చేసుకొన్న సొత్తు ఎవరి అధీనంలోకి పోతోందో తెలియనంతగా నిఘా దర్యాప్తు సంస్థల నిర్వాకం భ్రష్టుపట్టిపోయింది!

మూడేళ్ల కాలావధిలో 36మంది కేదస అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయని కేంద్రమే నిరుడు పార్లమెంటుకు వెల్లడించింది. రాజకీయ కోణాల్లేని కేసుల్లో సీబీఐ పనితీరు బాగుందన్న మెచ్చుకోళ్లూ తన ఒంటికి సరిపడవన్నట్లుగా కేదస పనిపోకడలు నగుబాటుకు గురికావడం నిశ్చేష్టపరుస్తోంది. నిఘా దర్యాప్తు సంస్థలు ఇంతగా చితికిపోతే దేశం పరువేంగాను?

ఇదీ చదవండి : సీబీఐ కస్టడీలో బంగారం మాయం- పోలీసుల దర్యాప్తు!

Last Updated : Dec 20, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.