ETV Bharat / opinion

ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష!

తొలిదశ నెమ్మదించడంతో ప్రతి ఒక్కరిలో పెరిగిన నిర్లక్ష్యం కొవిడ్‌కు కొత్త కోరలు తొడిగింది. కొవిడ్‌ విస్తృతికి ప్రాథమికంగా కళ్లెం వేసే నిబంధనలని అందరూ పాటించాలి. పౌరుల్లో టీకాపట్ల నేటికీ గూడు కట్టుకొని ఉన్న భయసందేహాల్ని పటాపంచలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి. వైరస్​ సృష్టిస్తున్న మానవ మహా విషాదానికి ముగింపు పలకాలంటే ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తల్ని విధిగా పాటించక తప్పదు!

mask
మాస్క్​
author img

By

Published : Apr 20, 2021, 7:00 AM IST

Updated : Apr 20, 2021, 7:55 AM IST

రోజువారీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, సంబంధిత మరణాలు ఎప్పటికప్పుడు గత రికార్డుల్ని బద్దలు కొడుతూ దూసుకుపోతున్న తీరు భీతిల్లజేస్తోంది. ఇప్పటికే కోటిన్నర దాటిపోయిన కేసులు, దాదాపు లక్షా 80వేల మరణాలతో తీవ్ర భయాందోళనలో ఉన్న జనావళిని పదికిపైగా రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతి బెంబేలెత్తిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, బ్రెజిల్‌ రకాల ఉరవడితో ఇండియాలో మొదలైన మలిదశ కొవిడ్‌ విజృంభణ, మరిన్ని ప్రమాదకర ఉత్పరివర్తనాలతో జన సమూహాల్ని చుట్టబెట్టేస్తోంది. తొలి దశ లక్షణాలకు భిన్నంగా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడమే ఇబ్బందిగా మారి రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు చేతులెత్తేసే దుస్థితి దాపురించింది.

పౌర సమాజంతోనే..

కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్‌ తాలూకు సూక్ష్మ కణాలు వ్యాపిస్తున్నాయని, వైరస్‌ లోడు ఆధారంగా గాలిలో వ్యాప్తి ఉంటోందని సీసీఎంబీ ఈ నెల తొలివారంలో ప్రకటించింది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తల బృందమూ తాజాగా హెచ్చరించింది. ముక్కు నోరుతోపాటు కళ్లనుంచీ వైరస్‌ చొరబడుతోందన్న విశ్లేషణల్ని ఏమాత్రం విస్మరించే వీల్లేదు. నిరుడు ఎన్నో యుద్ధాల పెట్టుగా విరుచుకుపడి సామాజిక ఆర్థిక రంగాల్ని నుగ్గునూచ చేసిన కొవిడ్‌ మహమ్మారి- మలి దశలో మరింత మాయావిగా మారి ప్రాణాంతక సవాళ్లు రువ్వుతోందిప్పుడు! బతికుంటే బలుసాకు తినవచ్చునంటూ మహారాష్ట్ర లాక్‌డౌన్‌ బాటపట్టగా, తాజాగా దిల్లీ అదే పని చేసింది. యూపీలో తీవ్ర ప్రభావిత అయిదు నగరాల్లో లాక్‌డౌన్‌కు అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించినా, యోగి సర్కారు దాన్ని బేఖాతరు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 20 లక్షలు దాటడంతో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ప్రాణాధార ఔషధాలకు కొరత వెంటాడుతోంది. ఆక్సిజన్‌ బట్వాడాకు, వ్యాక్సిన్‌ సమధిక ఉత్పత్తికి, ఔషధాల తయారీ పెంపుదలకూ కేంద్రం భరోసా ఇస్తున్నా- కొవిడ్‌ నియంత్రణకు సమకట్టాల్సింది పౌర సమాజమే. 70శాతం కొవిడ్‌ కట్టడి జరిగేది ముందు జాగ్రత్తలతోనే!

ముగింపు పలకాలంటే..

ప్రపంచవ్యాప్తంగా 13కోట్ల మందికిపైగా సోకిన కొవిడ్‌ 30 లక్షలమందికిపైగా అభాగ్యుల్ని కబళించింది. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల తయారీకి సమకట్టి, దేశదేశాల్లో 70కోట్లమందికి టీకాలు వేసినా, కొత్త ఉత్పరివర్తనాలతో కరోనా భయానకంగా కోరచాస్తూనే ఉంది. ఇప్పటికీ పూర్తిగా అంతు చిక్కని మాయావి వైరస్‌ లక్షణాల్ని పరిశీలిస్తూ దాని పనిపట్టే టీకాకోసం పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మే నెల ఒకటినుంచి పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వడానికి కేంద్రం సంకల్పించినా- పౌరుల్లో దానిపట్ల నేటికీ గూడు కట్టుకొని ఉన్న భయసందేహాల్ని పటాపంచలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి. టీకా తీసుకొన్న వ్యక్తికి కొవిడ్‌ సోకినా ప్రాణాపాయం ఉండదన్న సందేశాన్ని ప్రజలకు అందించాలి. అసలు కొవిడ్‌ దరిచేరకుండా రక్షణ కల్పించే మేలిమి చిట్కా వైద్యం ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజర్ల ద్వారా చేతుల్ని శుభ్రపరచుకోవడం; ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు రెండు గజాల భౌతిక దూరం పాటించడం- కొవిడ్‌ విస్తృతికి ప్రాథమికంగా కళ్లెం వేసేవే. వాటితోపాటు దక్షిణ కొరియా వాసులు అనుసరించిన- చేతుల మధ్య పని విభజనా మంచి ఫలితాన్నిస్తుంది. మాస్కు సరిచేసుకోవడం, కళ్లు నులుముకోవడం వంటి వ్యక్తిగతాలకు కుడిచేతిని; తలుపు తీయడం, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం వంటి పనులకు ఎడమ చేతిని వినియోగించడం సృజనాత్మక పరిష్కారంగా అక్కరకొస్తుంది. తొలిదశ నెమ్మదించడంతో ప్రతి ఒక్కరిలో పెరిగిన నిర్లక్ష్యం కొవిడ్‌కు కొత్త కోరలు తొడిగింది. నేడు అది సృష్టిస్తున్న మానవ మహా విషాదానికి ముగింపు పలకాలంటే ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తల్ని విధిగా పాటించక తప్పదు!

ఇదీ చదవండి: టీకా ఉత్పత్తిదారులతో నేడు ప్రధాని భేటీ

ఇదీ చదవండి: 'ప్రాణవాయువు'ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌!

Last Updated : Apr 20, 2021, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.