ETV Bharat / opinion

భూగర్భజలాల అతి వినియోగం అనర్థదాయకం! - వ్యవసాయం

సమర్థ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగులో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలి. సాగు ఉత్పాదకత తగ్గకుండా, ఇతర రంగాలకు నీటిని మళ్లించే అంశాన్ని ప్రభుత్వాలు క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే విధానాలను సత్వరం అందిపుచ్చుకోవాలి.

water management
సమర్థ నీటి వినియోగ పద్ధతులు
author img

By

Published : Jul 3, 2021, 8:12 AM IST

గతేడాది ఆర్థిక వ్యవస్థ డీలాపడ్డ సమయంలోనూ వ్యవసాయ రంగం చక్కటి వృద్ధిని నమోదు చేసింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ఆశించే పరిస్థితులు లేవు. అస్తవ్యస్త వర్షాలు, భూగర్భజలాల మితిమీరిన వినియోగం, భూసారం క్షీణించడం వంటి సమస్యలెన్నో సేద్యాన్ని వెంటాడుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు, భవిష్యత్తు సవాళ్లకూ ముందస్తు సన్నద్ధత తప్పనిసరి అని కరోనా సంక్షోభం తెలియజెప్పింది. ఇది సాగు రంగానికి, అందులోని వనరుల వినియోగానికి వర్తిస్తుంది. దేశంలోని సాగుభూముల్లో దాదాపు 60శాతం వర్షాధారమే కాబట్టి రైతుకు రుతుపవనాల అనుగ్రహం చాలా అవసరం. ఈ ఏడాది సాధారణ వర్షపాతం (98శాతం) నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేయడం కాస్త ఊరటనిచ్చేదే.

ఆదా ప్రధానం..

సాగునీటి అవసరాలకు తగినట్లు మన ఆనకట్టల సామర్థ్యం లేకపోవడంతో చాలా మంది రైతులు భూగర్భజలాలపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా వాటి వినియోగంలో చైనా, అమెరికాలను భారత్‌ అధిగమించింది. భూగర్భజలాల అతి వినియోగం సేద్యం, ఉత్పాదకతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌లో నూనెగింజల సాగు కోసం హెక్టారుకు 96.20 వేల ఘనపుటడుగుల నీటిని వాడుతుండగా, వరికి 1.61 లక్షల ఘనపుటడుగులు, చెరకుకు 3.16 లక్షల ఘనపుటడుగులు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయంలో అతిగా నీటిని వినియోగించడంవల్ల ఇతర రంగాల అవసరాలను తీర్చడంలో భారత్‌ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నీటి వాడకాన్ని తగ్గిస్తూనే, రైతన్నకు లాభదాయకంగా ఉండేట్లు తృణధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి. నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల విషయంలోనూ సమర్థంగా వ్యవహరిస్తే ఆహారభద్రత, ఉత్పాదకతలకు లోటు రాకుండా చూసుకోవచ్చు.

ఎనిమిది పంటలకు సంబంధించి నీటి వినియోగంపై ఇటీవలే ఒక అధ్యయనం జరిగింది. సమర్థ వినియోగ పద్ధతుల ద్వారా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో వరిపంటలో నీటి అవసరం చాలా వరకు తగ్గింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే మొత్తం మీద 2030-50 మధ్య కాలంలో 47శాతం వరకు సాగు నీటిని ఆదా చేసి ఇతర రంగాలకు మళ్ళించవచ్చు. దేశీయంగా 2010లో 33.51 లక్షల కోట్ల ఘనపుటడుగుల నీటిని వివిధ అవసరాలకు వినియోగించుకోగా, వచ్చే మూడు దశాబ్దాల్లో అది 37.36 లక్షల కోట్ల ఘనపుటడుగులకు చేరుతుందని అంచనా! అదే సమయంలో ఈ జలవినియోగంలో వ్యవసాయం వాటా 77శాతం నుంచి 81శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో ఎంత నీటిని ఆదా చేయగలిగితే అంత మేరకు పట్టణ భారతంలో నీటి కొరత తగ్గుతుంది. సేద్యంలో నీటి వృథా నివారణపై తక్షణం దృష్టి సారించకపోయినా, ఆదా చేసిన నీటిని ఇతర రంగాలకు సక్రమంగా పంపిణీ చేయకపోయినా దీర్ఘకాలంలో ఆర్థికంగా దేశం నష్టపోకతప్పదు! మరోవైపు పంటల మార్పిడి, ఆగ్రోఫారెస్ట్రీ, వాన నీటి సేకరణ వంటి పద్ధతులు మొత్తం సాగుభూమిలో అయిదు శాతంలోనే వాడుకలో ఉన్నాయి. దేశంలో పంట మార్పిడి 18 కోట్ల ఎకరాల్లో జరుగుతుండగా, ఆగ్రోఫారెస్ట్రీ 6.17 కోట్ల ఎకరాలకు విస్తరించింది. ప్రకృతి వ్యయసాయం చేసే రైతుల సంఖ్య (ఎనిమిది లక్షల మంది)లో ప్రపంచం మొత్తమ్మీద ఇండియా అగ్రస్థానంలో ఉన్నా- దేశవ్యాప్త రైతుల్లో వీరు కేవలం 0.7శాతమే! మొత్తం సాగుభూముల్లోని రెండు శాతం నేలల్లోనే సేంద్రియ వ్యయసాయం జరుగుతోంది. దీని వృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

ప్రభుత్వ మద్దతు అవసరం..

దేశంలో గిరాకీకి తగ్గట్టుగా నూనె గింజల ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దేశీయ అవసరాల్లో 60శాతం దిగుమతుల రూపంలోనే వస్తున్నాయి. కేంద్రం కనికరించి సుంకాలు తగ్గిస్తే తప్ప ఆకాశాన్నంటుతున్న వంట నూనెల ధరలు దిగిరావు. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగకూడదంటే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం తగ్గించుకోవాలి. వరి, గోధుమలే కాకుండా నూనెగింజల ఉత్పత్తిపైనా రైతులు దృష్టిసారించాలి. సుస్థిర వ్యవసాయంపై దేశంలో సరైన అవగాహన లేకపోవడం మరో సమస్య. సాగును కేవలం ఉత్పత్తి, ఆదాయం కోణాల్లోనే చూడకుండా జీవ వైవిధ్యం గురించీ ఆలోచించాలి. ఎరువుల వాడకం తగ్గించడం అత్యవసరం. తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం చిక్కుతుంది. ఈ అంశాలన్నింటిపైనా అధ్యయనాలు జరిగితే మేలు. సుస్థిర వ్యవసాయాభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. పంట సామర్థ్యాన్ని పెంపొందించే ప్రత్యామ్నాయాలపై సరైన ప్రయోగాలు జరపాలి. పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు పెంచాల్సిఉంది. ప్రత్యామ్నాయ పంట వ్యవస్థపై ప్రయోగాలు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి. సుస్థిర సాగు విధానాల ద్వారా సాధించగల లాభాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. కొవిడ్‌ దెబ్బకు ఆర్థిక రంగం కుదేలైనా వ్యవసాయంపై ఆ ప్రభావం అంతగా పడలేదని సంతోషించడం కన్నా- సమర్థ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగులో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలి. సాగు ఉత్పాదకత తగ్గకుండా, ఇతర రంగాలకు నీటిని మళ్లించే అంశాన్ని ప్రభుత్వాలు క్షుణ్నంగా పరిశీలించాల్సిఉంది. దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే విధానాలను సత్వరం అందిపుచ్చుకోవాలి.

- సౌమ్య

ఇదీ చదవండి:ఒకే చెట్టుకు ఎన్ని రకాల మామిడికాయలో!

'కరోనా 2.0 కథ ముగియలేదు.. తేలికగా తీసుకుంటే...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.